breaking news
under-14 tennis tournment
-
సామ సాత్విక జోరు
సింగిల్స్, డబుల్స్‌లో గెలుపు ఆసియా ఓసియానియా టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆసియా ఓసియానియా వరల్డ్ జూనియర్ అండర్-14 టెన్నిస్ టోర్నమెంట్లో తెలుగమ్మాయి సామ సాత్విక విశేషంగా రాణించింది. దీంతో భారత్ 3-0తో కిర్గిస్థాన్పై క్లీన్‌స్వీప్ చేసింది. న్యూఢిల్లీలోని డీఎల్టీఏ కాంప్లెక్స్‌లో జరుగుతున్న ఈ టీమ్ ఈవెంట్ చాంపియన్‌షిప్‌లో మంగళవారం జరిగిన సింగిల్స్, డబుల్స్ ఈవెంట్లలో సామ సాత్విక విజయాలు నమోదు చేసింది. తొలి సింగిల్స్‌లో ఆమె 4-6, 6-3, 7-6తో ఎలిజాపై గెలుపొందగా, రెండో సింగిల్స్‌లో ఇంజెల్ శివాని 6-1, 6-2తో ఎర్మెకాను కంగుతినిపించింది. డబుల్స్‌లో సాత్విక-ఆర్జా చక్రవర్తి జోడి 6-1, 6-2తో ఎలిజా-ఎర్మెకా జంటను ఓడించింది. బుధవారం జరిగే పోరులో భారత్... జపాన్‌తో తలపడుతుంది. -
ఫైనల్లో సాయి దేదీప్య
ఆసియా ర్యాంకింగ్ టెన్నిస్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయి సాయి దేదీప్య ఆసియా ర్యాంకింగ్ అండర్-14 టెన్నిస్ టోర్నీలో ఫైనల్‌కు చేరుకుంది. టోర్నీ ఆరంభం నుంచి సంచలన విజయాలతో దూసుకెళ్తున్న దేదీప్య శుక్రవారం జరిగిన సింగిల్స్ సెమీఫైనల్లో 6-1, 6-3 తేడాతో మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రకృతి బన్వానిపై ఏకపక్ష విజయం నమోదు చేసింది. ఇక ఫైనల్లో దేదీప్య ఆంధ్రప్రదేశ్‌కే చెందిన ఎ.శివానితో తలపడనుంది.