breaking news
TV reporters
-
సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్లపై కేసులు
సాక్షి, అమరావతి: సాక్షి పత్రిక, టీవీ లక్ష్యంగా చంద్రబాబు సర్కారు మరోసారి వేధింపులకు పాల్పడింది. తిరుమలలో ఖాళీ మద్యం బాటిళ్లు కనిపించాయన్న కథనానికి సంబంధించి సాక్షి పత్రిక, టీవీ రిపోర్టర్లు, కెమెరామెన్లపై కేసులు నమోదు చేశారు. అంతేకాకుండా తిరుపతిలో, తిరుమలలో ఇష్టారీతిన వ్యవహరించారు. తిరుపతి సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో మంగళవారం ఉదయం నుంచి ఒక సీఐ, ఎస్ఐ, 20 మంది పోలీసులు సోదాలతో హల్చల్ చేశారు. టెరర్రిస్టులు, స్మగ్లర్లు, హంతకుల కోసం గాలించినట్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగైదుసార్లు ఫొటోగ్రాఫర్ ఇంట్లో సోదాలు చేశారు.సాక్షి ఫొటోగ్రాఫర్ ఇంట్లో లేకపోవడంతో ఎక్కడికెళ్లాడంటూ ఇంట్లోవాళ్లమీద ప్రశ్నల మీద ప్రశ్నలు వేసి వేధించారు. మీ ఆయన ఎక్కడ, ఫోన్లు ఎక్కడ పెట్టాడు.. అంటూ గుచి్చగుచ్చి అడిగారు. ఇంతమంది రావడం ఏమిటి, అసలు ఏం జరిగిందని ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులు అడిగినా పోలీసులు సమాధానం చెప్పలేదు. సాయంత్రం ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులకు పోలీసులు నోటీసులు ఇచ్చి అతడిని విచారణకు హాజరుకావాలని చెప్పమని సూచించి వెళ్లిపోయారు. రోజంతా పోలీసులు ఇష్టారీతిన వ్యవహరించడంతో సాక్షి ఫొటోగ్రాఫర్ కుటుంబసభ్యులతో పాటు చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. ఇదే వార్తను ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఇతర పత్రికలు ప్రచురించినా, ఎల్రక్టానిక్ మీడియా చానళ్లు విస్తృతంగా ప్రసారం చేసినా.. ఒక్క సాక్షి రిపోర్టర్లు, ఫొటోగ్రాఫర్లను మాత్రమే పిలిపించి విచారించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కక్షపూరితంగా సాక్షి విలేకరులనే లక్ష్యంగా చేసుకుని విచారణ జరపడం మీడియా స్వేచ్ఛపై దాడేనని జర్నలిస్టు వర్గాలు మండిపడుతున్నాయి. -
ఇద్దరు టీవీ రిపోర్టర్లపై కేసు నమోదు
సికింద్రాబాద్: జైళ్ల శాఖకు చెందిన ఓ కానిస్టేబుల్ నుంచి డబ్బులు డిమాండ్ చేసిన ఇద్దరు టీవీ విలేకరులపై సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు కేసు నమోదు చేశారు. జీఆర్పీ ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి కథనం ప్రకారం జైళ్లశాఖ కానిస్టేబుల్ భాస్క రాచారి మంచిర్యాల జిల్లా నస్పూర్‌లోని అత్తగారింటికి వెళ్లేందుకు ఈనెల 26న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు వచ్చాడు. ఆయన తనతో పాటు రెండు టేకు చెక్కలను వెంట తెచ్చుకున్నాడు. పార్శిల్ సర్వీసు కార్యాలయం వేళలు ముగియడంతో ఆ చెక్కలను రైలులో తనవెంట తీసుకుని దాణాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాడు. అదే సమయంలో ఇద్దరు టీవీ విలేకరులు (సాక్షి కాదు) వచ్చి గంధం చెక్కలు ఎక్కడి వంటూ నిలదీశారు. తాను తీసుకెళ్తున్నది గంధం చెక్కలు కావని, టేకు చెక్కలని, రూ.1900లకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నాని వివరించే యత్నం చేసినా వారు వినలేదు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఇది గమనించిన జీఆర్పీ పోలీసులు రెండు టేకు చెక్కలను స్వాధీనం చేసుకున్నారు. టేకు చెక్కలు తాను కొనుగోలు చేసినవేనని చెబుతున్నా టీవీ విలేకరులు వినకుండా తనను డబ్బులు డిమాండ్ చేస్తున్నారని కానిస్టేబుల్ భాస్కరాచారి జీఆర్పీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో జీఆర్పీ పోలీసులు చెక్కల కొనుగోలుకు సంబంధించి బిల్లలు ఇవ్వాలని భాస్కరాచారిని కోరారు. భాస్కరాచారి బిల్లులు తెచ్చి వారికి చూపించే లోపే ఆ ఇద్దరు విలేకరులు స్క్రోలింగ్ ప్రారంభించారు. అయితే బిల్లుల ఆధారంగా భాస్కరాచారి తన వెంట తెచ్చుకున్న ఆ రెండు చెక్కలు టేకు కలపగా జీఆర్పీ పోలీసులు నిర్ధారించుకున్నారు. టేకు చెక్కలను గంధం చెక్కలుగా ఆరోపించడంతోపాటు తనను డబ్బులు డిమాండ్ చేయడమే కాకుండా, జైళ్ల శాఖ ఉన్నతాధికారులపై అసత్య ప్రసారం చేసినందుకు ఆ ఇరువురు టీవీ విలేకరులపై భాస్కరాచారి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
పోలీసుల అదుపులో టీవీ రిపోర్టర్లు
నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్కౌంటర్ తర్వాత అతనితో చేతులు కలిపిన వారిపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. అందులోభాగంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో నయీమ్‌కు అనుయాయులుగా ఉంటున్న ముగ్గురు టీవీ రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు నయీమ్ అండ చూసుకుని రూ.35 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సదరు టీవీ రిపోర్టర్లను సోమవారం రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.


