గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతనితో చేతులు కలిపిన వారిపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు.
నల్లగొండ: గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత అతనితో చేతులు కలిపిన వారిపై పోలీసులు పట్టుబిగిస్తున్నారు. అందులోభాగంగా నల్లగొండ జిల్లా భువనగిరిలో నయీమ్‌కు అనుయాయులుగా ఉంటున్న ముగ్గురు టీవీ రిపోర్టర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వీరు నయీమ్ అండ చూసుకుని రూ.35 కోట్ల వరకు ఆస్తులు కూడబెట్టినట్లు పోలీసులు గుర్తించారు. సదరు టీవీ రిపోర్టర్లను సోమవారం రాత్రే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.