breaking news
truck roll
-
గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బోల్తా
గుంటూరు, ఇబ్రహీంపట్నం (మైలవరం) : రోడ్డుపై వెళ్తున్న బైకును తప్పించబోయి గ్యాస్ సిలిండర్ల లోడు లారీ బోల్తాకొట్టింది. కొండపల్లి ఎర్రకట్ట బ్రిడ్జి వద్ద 30వ నెంబర్ జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సేకరించిన వివరాల ప్రకారం కంచకచర్లకు చెందిన రాజ్యలక్ష్మీదేవి గ్యాస్ ఏజెన్సీకి చెందిన లారీ ఖాళీ గ్యాస్ బండల లోడుతో కొండపల్లిలోని హెచ్‌పీ గ్యాస్ కంపెనీకి వెళ్తోంది. కొండపల్లి ఎర్రకట్ట వద్దకు చేరుకునే సమయానికి జి.కొండూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన శివకృష్ణ తన బైకుపై ఇబ్రహీంపట్నం వైపు వస్తున్నాడు. రెండు లారీల మధ్యకు వచ్చిన బైక్‌ను తప్పించబోయి గ్యాస్ బండల లోడు లారీ అదుపుతప్పి రోడ్డుపై పల్టీ కొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న శివకృష్ణకు, లారీ డ్రైవర్ రామకృష్ణకు స్వల్ప గాయాలు అయ్యాయి. 108 సిబ్బంది ఇరువురిని ఇబ్రహీంపట్నం పీహెచ్‌సీకి తరలించారు. గ్యాస్ బండలు ఖాళీవి కావటంతో పెద్ద ప్రమాదం తప్పింది. -
లారీ బోల్తా : ముగ్గురు మృతి
ఆదిలాబాద్: లారీ అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. ఈ సంఘటన మామడ మండలంలోని బూరుగుపల్లి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు....హైదరాబాద్ నుంచి నాగ్‌పూర్ వైపు వెళ్తున్న లారీ డీవైడర్ ను డీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీలో ఉన్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులు లారీ డ్రైవర్ ముకేశ్, కో-డ్రైవర్, క్లీనర్ మధ్యప్రదేశ్‌కు చెందిన వారిగా తెలిస్తోంది. ఈ ప్రమాదంతో రహదారిపై వాహన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. (మామడ)