breaking news
tribute to ambedkar
-
అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల..
-
అంబేద్కర్‌కు చంద్రబాబు నివాళి
-
అంబేడ్కర్ అలోచనా విధానమే శరణ్యం
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు కాకినాడ రూరల్ : దేశానికి అంబేడ్కర్ ఆలోచనా విధానమే శరణ్యమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు అన్నారు. మంగళవారం అంబేడ్కర్ 60వ వర్థంతి సందర్భంగా గైగోలుపాడులో అంబేడ్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వర్థంతి సభలో ఆయన మాట్లాడారు. యువత అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టిబత్తుల రాజబాబు, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, బీసీ విభాగం కార్యదర్శులు కడియాల చినబాబు, రమణాతి మురళి, మాజీ కౌన్సిలర్ చింతపల్లి చంద్రశేఖర్, మాజీ సర్పంచులు బొమ్మిడి శ్రీనివాస్, కోమలి సత్యనారాయణ పాల్గొన్నారు. జయలలిత మృతికి సంతాపం తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతికి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. మంగళవారం రమణయ్యపేటలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు స్వగృహంలో ఏర్పాటు చేసిన సంతాప సభలో వారు పాల్గొన్నారు. తమినాడు రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లోనే ఓ కీలకమైన ఆణిముత్యాన్ని కోల్పొయామని కన్నబాబు అన్నారు. జయలలిత మృతి దేశరాజకీయాలకే తీరని లోటన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, ఎస్సీ సెల్ కార్యదర్శి చెల్లే శేషారావు పాల్గొన్నారు.