breaking news
transgender man
-
పురుషుల అందాల పోటీల్లో ట్రాన్స్‌జెండర్..!
బ్రజీలియా : లింగమార్పిడి చేసుకున్న ఓ వ్యక్తి సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. పురుషుల అందాల పోటీల్లో పాల్గొన్న తొలి ట్రాన్స్‌జెండర్‌గా నిలవనున్నారు. పుట్టుకతో స్త్రీ అయిన 23 ఏళ్ల బెర్నార్డో రిబేరో.. లింగమార్పిడి చేయించుకుని పురుషుడిగా మారారు. బ్రెజిల్లో జరుగనున్న ‘మిస్టర్ బ్రెజిల్’ అందాల పోటీలకు ఎంపికయ్యాడు. ‘పుట్టుకతో అమ్మాయినైనా.. ఎప్పుడూ అలా అనిపించలేదు. నాలో పురుష లక్షణాలే అధికం. అందుకే లింగమార్పిడి చేయించుకున్నా. మిస్టర్ బ్రెజిల్ టైటిల్ సాధించడమే నా కల. రియోడాస్ పెడ్రాస్ పట్టణం నుంచి పోటీలో ఉన్నాను. ఇప్పుడు మోడల్‌గా పనిచేస్తున్నాను. మనదైన జీవితాన్ని పొందకుండా వెనకాడుతున్న చాలామందికి స్ఫూర్తిగా నిలవాలనుకుంటున్నాను’అని బెర్నార్డో చెప్పుకొచ్చారు. కాగా, స్వలింగ సంపర్కాన్ని నేరంగా పరిగణిస్తూ బ్రెజిల్ చట్టం చేసింది. ఈ చట్టం ఉనికిలోకి వచ్చిన వారంలోపే బెర్నార్డో పోటీ విషయం బయటికి రావడం విశేషం. రియో పట్టణంలో ఈ పోటీలు జరుగనున్నాయి. బెర్నార్డోతో పాటు మరో 19 మంది బరిలో ఉన్నారు. -
మగాడిగా మారిపోయింది..
ఓ అమ్మాయి తాను అనుకున్నది నెరవేర్చుకునేందుకు మూడేళ్లపాటు చేసిన కృషి ఫలించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా అని ఆ యువతి సాధించింది ఏ యూనివర్సిటీ సీటో.. టాప్ ఉద్యోగామో కాదు!! ఉన్నట్టుండి మగాడిగా మారిపోవడం. ఎస్సెక్స్ యూనివర్సిటీ సైకాలజీ స్టూడెంట్ జేమీ రైన్స్ అనే యువతి.. తాను అబ్బాయిగా మారాలని గట్టిగా నిర్ణయించుకుంది. జేమీకి సరిగ్గా నాలుగేళ్ల వయసు ఉన్నప్పుడు తాను అందరిలా కాకుండా భిన్నంగా ఉన్నట్లు అనిపించిందట. ఎనిమిదేళ్ల వయసులో హెయిర్ కట్ చేసుకుని తాను అబ్బాయిగా కనిపిస్తున్నట్లు అద్దంలో చూసుకునేది. కొన్నేళ్ల తర్వాత అమ్మాయిల పట్ల ఆకర్షణ కలిగి, తరచు గర్ల్ ఫ్రెండ్ షాబాను కలుసుకునేది. 18 ఏళ్లు వచ్చాక, ప్రతిరోజూ టెస్టోస్టిరాన్ హార్మోన్ తీసుకోవడం ప్రారంభించింది. అలా చేయడంతో పాటు తనలో వస్తున్న శారీరక మార్పును తెలుసుకునేందుకు ప్రతి రోజూ సెల్ఫీ తీసుకునేది. లింగమార్పిడి కోసం సర్జరీ చేయించుకోవడంతో పాటు మూడేళ్ల పాటు ప్రతి రోజూ అందుకు అవసరమైన మందులు వాడేది. మూడేళ్ల తర్వాత ఆమెగా ఉన్న జేమీ రైన్స్... పూర్తిగా అతడుగా మారిపోయాడు. హార్మోన్ తీసుకుంటున్న క్రమంలో తనలో కలిగే మార్పులను తెలుసుకునేందుకు తీసిన 1400 ఫొటోలను వీడియోగా చేసి యూట్యూబ్‌లో అప్లోడ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. 7 లక్షల మంది ఈ వీడియోను చూశారు. ఈ వీడియో చూసిన ఓ న్యూస్ చానెల్ ఆమె నుంచి అతడుగా మారే క్రమంపై 'గర్ల్స్ టు మెన్' అనే డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు తనకు చాలా ధైర్యంగా ఉందని, ఆత్మవిశ్వాసం పెరిగిందని జేమీ అంటున్నాడు. నాలుగేళ్లుగా తనతో పరిచయం ఉన్న గర్ల్ ఫ్రెండ్ షాబా కూడా లింగమార్పిడి విషయంలో తనకు చాలా సహకారం అందించిందని చెప్పాడు. షాబా పేరెంట్స్ మొదట్లో తనతో పెళ్లికి ఒప్పుకోలేదు గానీ, పూర్తిగా అబ్బాయిగా మారిన తర్వాత వారు తనను అంగీకరించారన్నాడు. అయితే, తన పేరు ఇప్పుడు జేమీ అని చెప్పుకొచ్చాడు.