మూడు బైక్‌లు ఢీ..ఇద్దరి దుర్మరణం
ఆమదాలవలస, న్యూస్‌లైన్ : తాళ్లవలస వద్ద మూడు బైక్‌లు ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధురాలు, మరో పోస్ట్‌మాస్టర్ దుర్మరణం పాలయ్యారు.. ఐదుగురు క్షతగాత్రులుగా మిగిలారు.వృద్ధురాలు సంఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పో గా..పోస్ట్‌మాస్టర్ మాత్రం విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొ పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం..
బూర్జ మండలం తోటవాడ గ్రామానికి చెందిన పోస్టుమాస్టర్ తోట అప్పారావు, మనమడు చిన్నితో కలిసి శ్రీకాకుళం వెళ్లి..బజాజ్ చేతక్ వాహనంపై తోటవాడకు వస్తున్నారు. వారికి ఎదురుగా చింతలపేట గ్రామానికి చెందిన సిమ్మ యోగేశ్వరరావు..తన బైక్‌పై అమ్మమ్మ దండకల అప్ప మ్మ, తల్లి సిమ్మ రత్నాలమ్మలను ఎక్కించుకుని ఆమదాలవలస వైపు వస్తున్నాడు. అదే వైపు నుం చి సారవకోటకు చెందిన సిమ్మ లక్ష్మీనారాయణ, సిమ్మ నారాయణరావులు కూడా బైక్‌పై వస్తున్నారు.
సరిగ్గా..తాళ్లవలస గ్రామం వద్దకు వచ్చేసరికి.. ఎదురెదురుగా వచ్చిన తోట అప్పారావు చేతక్ వాహ నం, యోగేశ్వరరావు బైక్‌ను ఢీకొట్టింది.
దీం తో అప్పమ్మ(75) బైక్ నుంచి జారిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. మిగిలిన నలుగురికి గాయాలయ్యాయి. అదే రూట్ వచ్చిన లక్ష్మీనారాయణ బైక్ సైతం వీరి వాహనాలను ఢీకొట్టడంతో..దానిపై ఉన్న ఇద్దరికీ గాయాలయ్యాయి. సంఘటన స్థలంలో భయానక వాతావరణం నెలకొంది. క్షణాల్లో ప్రమాదం జరగడం..ప్రాణాలు గాలిలో కలిసిపోవడాన్ని చూసిన స్థానికులు విస్తుపోయారు. వెంటనే 108 వాహనానికి సమాచారమందించారు. గాయపడ్డ అరుగురిని శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అప్పా రావు పరిస్థితి విషమించడంతో విశాఖపట్నం కేజీహెచ్ కు తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన ప్రాణాలు కోల్పోయారు. అప్పమ్మ మృతదేహానికి శవపంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఎన్.సునీల్ చెప్పారు.
విషాదఛాయలు
ప్రమాద విషయం తెలుసుకున్న చింతలపేట గ్రామస్తులు, మృతురాలి కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహం వద్ద గుండెలు బాదుకుని విలపించారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మనుమడితో కలిసి..ఆస్పత్రికి వెల్లిన అప్పమ్మ ఇలా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందంటూ.. వారు విలపిస్తున్నతీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.