-
‘థ్యాంక్యూ బ్రదర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్‌కు వెళ్లాలనుకున్న’
బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. అనసూయ గర్భిణిగా నటించిన ఈ చిత్రం మే 7న ప్రముఖ తెలుగు ఓటీటీ ‘ఆహా’లో విడుదలైంది. గర్భిణి అయిన అనసూయ ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడ ఓ యువకుడితో కలిసి లిఫ్ట్‌లో ఇరుక్కుపోతుంది. ఆ సమయంలో ఆమెకు పురిటి నొప్పులు మొదలవడంతో ఆ తర్వాత ఏం జరిగిందనేదే ఈ కథ. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుని సక్సెస్ బాట పట్టింది. ఇందులో అనసూయ పాత్ర విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ నేపథ్యంలో మదర్స్ డే సందర్భంగా సాక్షి టీవీ ఈ మూవీ విషయాలపై అనసూయతో ముచ్చటించింది. ఈ సినిమా సక్సెస్, తన పాత్ర గురించి అనసూయ మాటల్లో విందాం. -
అమ్మ నన్ను పట్టుకుని ఏడ్చేసింది: నటుడు
యాంకర్ అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'థ్యాంక్ యు బ్రదర్'. థియేటర్లలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా కరోనా దెబ్బకు ఓటీటీ బాట పట్టక తప్పలేదు. మే 7 నుంచి ఆహాలో ప్రసారమవుతున్న ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇందులో విరాజ్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. తొలి సినిమాలోనే అనుభవమున్న వ్యక్తిలా నటించాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. పాజిటివ్ రివ్యూలపై విరాజ్ అశ్విన్ సంతోషం వ్యక్తం చేశాడు. అతడు మాట్లాడుతూ.. "నా పాత్ర గురించి చెప్పడం మొదలు పెట్టినప్పుడు నాది నెగెటివ్ రోల్ అనిపించింది. కానీ డైరెక్టర్ రమేశ్ రాపర్తి నా పాత్ర గురించి చెప్తూ ఉండే కొద్దీ అది విపరీతంగా నచ్చేసింది. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఫోన్ చేసి అద్భుతంగా చేశావ్ అని చెప్తుంటే మాటలు రావడం లేదు. ఈ కథను డీల్ చేయడం అంత ఈజీ కాదు, కానీ డైరెక్టర్ దాన్ని విజయవంతంగా తెరకెక్కించాడు" "ఇక క్లైమాక్స్‌లో నా నటన చూసి అమ్మ నన్ను హత్తుకుని ఏడ్చేసింది. అది నా జీవితంలోనే మర్చిపోలేని జ్ఞాపకం. స్టార్ నటి అనసూయతో కలిసి పని చేయడం అంటే మొదట్లో భయమేసింది. కానీ సెట్లో అడుగుపెట్టాక ఆ భయం ఎగిరిపోయింది. ఆమె అందరితో సరదాగా, కలివిడిగా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు. కాగా విరాజ్ అశ్విన్ చేతిలో మరో రెండు సినిమాలున్నాయి. చదవండి: Anasuya Bharadwaj: ‘థ్యాంక్ యు బ్రదర్’ మూవీ రివ్యూ నటి కీర్తికి డాక్టర్ బాబు ఏమవుతారో తెలుసా? -
Anasuya Bharadwaj: ‘థ్యాంక్ యు బ్రదర్’ మూవీ రివ్యూ
టైటిల్: థ్యాంక్ యు బ్రదర్ నటీటులు: అనసూయ భరద్వాజ్, విరాజ్ అశ్విన్, , అనీశ్ కురువిల్లా, ఆదర్శ్ బాలకృష్ణ, మోనికా రెడ్డి, వైవా హర్ష తదితరులు నిర్మాణ సంస్థ : జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాతలు: మాగుంట శరత్ చంద్రారెడ్డి, తారక్నాథ్ బొమ్మిరెడ్డి దర్శకత్వం: రమేశ్ రాపర్తి సంగీతం: గుణ బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ : సురేష్ రగుతు విడుదల తేది : మే 07, 2021(ఆహా) బుల్లితెర ప్రేక్షకులకు అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందంతో పాటు తనదైన యాంకరింగ్‌తో లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. పేరుకు యాంకర్ అయినా కూడా హీరోయిన్‌కు ఏ మాత్రం తీసిపోని ఇమేజ్, అందం ఈమె సొంతం. ఒకవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యింది. కథ నచ్చితే ఎలాంటి పాత్ర చేయడానికైనా సిద్ధంగా ఉంటుంది అనసూయ. చాలా కాలం తర్వాత ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘థ్యాంక్ యు బ్రదర్’. ఇందులో ప్రెగ్నెంట్ లేడీ గెటప్‌లో కనిపించి అందరికి షాకిచ్చింది ఈ అందాల యాంకర్. కరోనా సెకండ్ వేవ్ కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ మూవీ.. శుక్రవారం (మే 7)న ప్రముఖ ఓటీటీ సంస్థ ‘ఆహా’లో విడుదలైంది. టీజర్, ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో పాటు మూవీ ప్రమోషన్స్ గ్రాండ్‌గా చేయడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఆ అంచనాలు ‘థ్యాంక్యు బ్రదర్’ ఏ మేరకు అందుకుందో రివ్యూలో చూద్దాం. కథ అభి (విరాజ్ అశ్విన్ ) జీవితంపై అస్సలు బాధ్యతలేని గొప్పింటి కుర్రాడు. తల్లి ప్రేమను అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంటాడు. తల్లి ఎన్నిసార్లు మందలించిన తన ప్రవర్తనను మార్చుకోడు. తన అవేశం, లెక్కలేనితనం కారణంగా ఎన్నో తప్పులు చేస్తుంటాడు. ఒకానొక సమయంలో తల్లితో గొడవపడి ఇంటి నుంచి బయటకు వచ్చి ఉద్యోగం కోసం ట్రై చేస్తుంటాడు. కట్ చేస్తే... ప్రియ(అనసూయ భరద్వాజ్) ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన మహిళ. నిండు గర్భిణి. అప్పటికే తన భర్త చనిపోయి ఉంటాడు. అత్తమ్మతో కలిసి కుట్లు, అల్లికలు చేసూకుంటూ జీవనాన్ని సాగిస్తుంది. ఇలా ఒకరికొకరు ఎలాంటి సంబంధంలేని అభి, ప్రియ అనుకోకుండా ఓ లిఫ్ట్‌లో ఇరుక్కుపోతారు. అదే సమయంలో ప్రియకు నొప్పులు వస్తాయి. ఎలాంటి బాధ్యత లేకుండా తిరిగే అభి, ప్రియను ఎలా సేవ్ చేశాడు? లిఫ్ట్‌లోనే బిడ్డకు జన్మనిచ్చిన ప్రియ క్షేమంగా ఉందా? లేదా?. ప్రియ ఘటన అభిలో ఎలాంటి మార్పు తీసుకొచ్చింది? అనేదే మిగతా కథ. నటీనటులు అనసూయ భరద్వాజ్ గ్లామర్ రోల్సే కాదు, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి ఇప్పటికే తానేంటో నిరూపించుకుంది. ఈ మూవీలో కూడా మరోసారి తనలో దాగి ఉన్న ప్రతిభను బయటపెట్టింది. ప్రియ పాత్రలో అద్భుతంగా నటించి సినిమా మొత్తం తానై నడిపిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. ముఖ్యంగా డెలివరీ అయ్యే సీన్లో తనదైన నటనతో అందరిని భావోద్వేగానికి గురయ్యేలా చేసింది. ఇక హీరోగా నటించిన విరాజ్ అశ్విన్ తన పాత్రకు న్యాయం చేశాడు. బాధ్యత లేకుండా తిరిగే గొప్పింటి కుర్రాడు అభి పాత్రలో జీవించాడు. ఇది వరకు కొన్ని సినిమాల్లో నటించినా విరాజ్‌కు పెద్దగా గుర్తింపు రాలేదు. ఈ సినిమాతో ఆ లోటు తీరుతుంది. కమెడియన్ వైవా హర్ష ఒకటి రెండు చోట్ల నవ్వించేప్రయత్నం చేశాడు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు. విశ్లేషణ గర్భవతి అయిన ఓ మహిళ.. తల్లి విలువ తెలుసుకోలేని ఓ కొడుకు. వీరిద్దరూ లిఫ్ట్ లో వెళుతుంటే అది ఆగిపోతుంది. అంతలో ఓ విపత్కర పరిస్థితి ఎదురవుతుంది. దానిని ఎలా పరిష్కరించారనేదే ‘థ్యాంక్ యు బ్రదర్’నేపథ్యం. పాయింట్ పరంగా మంచి కంటెంట్ ఎంచుకున్న దర్శకుడు.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు. మూవీలో వచ్చే కీలక సన్నివేశాలను తెరపై ఆవిష్కరించిన విధానం అంతగా ఆకట్టుకోలేదు. ఫస్టాఫ్ అంతా బోల్డ్ సీన్స్, లవ్‌ట్రాక్‌తో సోసోగా నడిపించి సెకండాఫ్‌లో అసలు కథని చూపించాడు. ఈ సినిమాకు ఉన్నంతలో ప్రధాన బలం సెకండాఫ్. అయితే సెకండాఫ్‌లో కూడా కొన్ని సీన్స్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తీర్చిదిద్దే స్కోప్ ఉన్నప్పటీకీ దర్శకుడు ఆ దిశగా ఆలోచించలేదు. తల్లి సెంటిమెంట్‌తో సాగే ఈ సినిమాలో ఆమె పాత్రని కూడా బలంగా తీర్చిదిద్దలేకపోయాడు. మ్యూజిక్ డైరెక్టర్ గుణ బాలసుబ్రమణియన్ నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని సీన్లకు తన బీజీఎంతో ప్రాణం పోశాడు. సురేష్ రగుతు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్లస్ పాయింట్స్ అనసూయ, విరాజ్ అశ్విన్ నటన లిఫ్ట్‌లోని సీన్స్ క్లైమాక్స్ మైనస్ పాయింట్స్ స్లో నేరేషన్ ఫస్టాఫ్ సెకండాఫ్‌లో కొన్ని సాగదీత సీన్స్ - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వారి వల్లే మా ఎంగేజ్మెంట్ జరిగింది: అదితిరావు హైదరీ
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ నటి (ఫోటోలు)
రాణించిన హెడ్, కమ్మిన్స్.. ముంబై టార్గెట్ ఎంతంటే?
'దీదీ గిరి' అంగీకరించను: పశ్చిమ బెంగాల్ గవర్నర్
బాబే కాదు ప్రధాని మోదీ కూడా యూటర్న్ తీసుకున్నారు: అమర్నాథ్
త్వరలోనే బిడ్డకు జన్మనివ్వనున్న టాలీవుడ్ హీరోయిన్.. భర్తపై అలాంటి పోస్ట్!
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
T20 WC 2024: టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ ఇదే.. ఫోటోలు వైరల్
కాంగ్రెస్‌కు పాకిస్తాన్ మద్దతు ఉంది: అనురాగ్ ఠాకూర్
టాలీవుడ్ హీరో డ్రీమ్ ప్రాజెక్ట్.. రెబల్ స్టార్ ఎంట్రీ!
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement