breaking news
tension in kirlampudi
-
'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన'
-
'రాష్ట్రంలో హిట్లర్ వంశీయుల పాలన'
కిర్లంపూడి: ఆంధ్రప్రదేశ్లో హిట్లర్ వంశీయుల పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. కాపు రిజర్వేషన్ల సాధన కోసం సత్యాగ్రహ యాత్ర తలపెట్టిన ముద్రగడను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలోని స్వగృహంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాపు ఉద్యమనేత ముద్రగడ మీడియాతో మాట్లాడుతూ.. మా జాతికి పోలీసుల నుంచి స్వేచ్ఛ లభించినప్పుడు సత్యాగ్రహ యాత్ర గురించి ఆలోచిస్తా అన్నారు. పోలీసుల కవాతులు, కేసులతో భయపెట్టాలని చూస్తున్నారని ఆయన మండిపడ్డారు. తుని ఘటనలో మా ప్రమేయం ఉంటే అరెస్ట్ చేయాలని పోలీసులను కోరారు. -
ముద్రగడకు ఆటంకాలు.. తీవ్ర ఉద్రిక్తత
కాపు రిజర్వేషన్ల సాధన కోసం సత్యాగ్రహ యాత్ర తలపెట్టిన మాజీ మంత్రి, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభాన్ని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దాంతో ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. బుధవారం నుంచి ముద్రగడ సత్యాగ్రహ యాత్ర ప్రారంభం కావాల్సి ఉండగా ముందుగానే ఆయన ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు. మంగళవారం సాయంత్రం ఆయన తన ఇంటి నుంచి బయటకు రాగానే ఆయన కారును అడ్డుకుని వెనక్కి పంపేసి, ఆయనను ఇంట్లోనే నిర్బంధించారు. దాంతో ఆయన మద్దతుదారులకు, పోలీసులకు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం చెలరేగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్రగడ యాత్రను అనుమతించేది లేదని పోలీసులు అంటున్నారు.