breaking news
t pandiyan
-
అవినీతిపైనే పోరు
సాక్షి, చెన్నై : రాష్ట్రంలో సీపీఎం, సీపీఐలు కలసి కట్టుగా ఎన్నికలను ఎదుర్కొంటున్నాయి. ఒంటరిగా చెరో తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను నిలబెట్టారు. తమకు పట్టున్న స్థానాల్లో గెలుపు లక్ష్యంగా వామపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లో నేతలు తిష్ట వేసి, గెలుపు లక్ష్యం గా, కార్మిక ఓటు బ్యాంక్‌ను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నారు.తాము రూపొం దించిన మ్యానిఫెస్టోను సీపీఐ విడుదల చేసిం ది. ఉదయం టీ నగర్‌లోని కార్యాలయంలో అవినీతిపైనే పోరు జరిగిన సమావేశంలో ఈ మ్యానిఫెస్టోను ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్, జాతీయ కార్యదర్శి, ఎంపి డి రాజాలు విడుదల చేశారు. 40 గెలిచినా పీఎం సీటు కలే మ్యానిఫెస్టో విడుదల అనంతరం మీడియాతో పాండియన్ మాట్లాడుతూ, డీఎంకే, కాంగ్రెస్, బీజేపీలతో పాటుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. మూడో ఫ్రంట్‌లోకి జయలలిత వస్తారా లేదా అన్నది తనకు తెలియదన్నారు. ఆ పార్టీ పుదుచ్చేరితో పాటుగా రాష్ట్రంలో 40 సీట్లు గెలిచినా, ఆమె పీఎం కావడానికి మరో 234 సీట్లు అవసరం అన్నది గుర్తుంచుకోవాలంటూ ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. శ్రీలంకకు అనుకూలంగా కేంద్రం వ్యవహరించడం విచారకరంగా పేర్కొన్నారు. కాంగ్రెస్‌ను ఇక రాష్ట్రంలో భూస్థాపితం చేయడానికి ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శ్రీలంకను వెనకేసుకు రావడమే కాకుండా అధికారుల మీద నిందలు వేస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి పి చిదంబరం వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఆయనకు ఉన్న అధికారాలను ఉపయోగించి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవచ్చుగా అని ప్రశ్నించారు. దేశంలో మోడీ పవనాలు వీయడం లేదని, ఇవన్నీ ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న మీడియా సృష్టిగా అభివర్ణించారు. కాంగ్రెస్, బీజే పీలు రెండు ఒకటేనని, ఆ ఇద్దరిలో ఎవరు అధికారంలోకి వచ్చినా, ప్రజలకు అష్టకష్టాలు తప్పవని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో కలసి డీఎంకే, డీఎంకేతో కలసి కాంగ్రెస్ చెడి పోయిందని, ఈ రెండు పార్టీలకు రాష్ట్రంలో కాలం చెల్లినట్టేనన్నారు. ఈ సమావేశంలో సీపీఐ నేతలు నల్లకన్ను, మహేంద్రన్, ఏఎస్ కన్నన్, తదితరులు పాల్గొన్నారు. మ్యానిఫెస్టోలోని అంశాలు అవినీతి నిర్మూలనా నినాదంతో ముందుకెళ్తున్నాం. విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని బయటకు తీస్తాం. నదుల అనుసంధానంలో కాంగ్రెస్, బీజేపీలు దొందు దొందే. ఈ రెండు పార్టీలతో ఒరిగేది శూన్యం. దక్షిణాదిలోని నదులు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటాం. దక్షిణాది జిల్లాల ప్రజల కలలను సాకారం చేస్తూ, సేతు సముద్రం ప్రాజెక్టు అమలయ్యేలా చేస్తాం. విద్యుత్ గండం నుంచి రాష్ట్రాన్ని బయట పడేలా చేస్తాం. విద్యుత్ సమస్యతో చతికిలబడుతున్న చిన్న తరహా పరిశ్రమలను ఆదుకుంటాం. అద్దకం పరిశ్రమలు, రసాయన పరిశ్రమల బారినుంచి గ్రామీణ ప్రజల్ని రక్షిస్తాం. కేంద్ర ప్రభుత్వం నేతృత్వంలో రసాయనాల శుద్ధీకరణ ప్లాంట్లను ఏర్పాటు చేస్తాం. ప్రైవేటు నర్సరీ నుంచి విశ్వవిద్యాలయం వరకు పాల్పడుతున్న విద్యా దోపిడీకి అడ్డుకట్ట వేస్తాం. రాష్ట్రంలోని పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దరి చేరుస్తాం. ఉద్యోగ అవకాశాల మెరుగు లక్ష్యంగా పారిశ్రామిక ప్రగతిని సాధిస్తాం. ఖనిజ సంపదల పరిరక్షణతో పాటుగా ఆ సంపదలను రాష్ట్ర ప్రభుత్వ సంస్థల పరిధిలోకి వచ్చే రీతిలో చర్యలు తీసుకుంటాం. -
సీపీఐ జాబితా
సాక్షి, చెన్నై: ఎన్నికల బరిలో నిలబడే తమ అభ్యర్థుల జాబితాను సీపీఐ బుధవారం రాత్రి ప్రకటించింది. తొమ్మిది స్థానాల బరిలో అభ్యర్థులను దించారు. ఈ నెల 24 నుంచి ఎన్నికల ప్రచారం చేపట్టనున్నట్టు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ ప్రకటించారు. అన్నాడీఎంకేను పక్కన పెట్టి సీపీఎం, సీపీఐలు కలిసి రాష్ట్రంలో ఒంటరిగా ఎన్నికలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. తమకు పట్టున్న స్థానాలను ఈ రెండు పార్టీలు ఎంపిక చేసుకున్నాయి. చెరో తొమ్మిది స్థానాల్లో పోటీకి నిర్ణయించాయి. రెండు పార్టీలు ఏకాభిప్రాయంతో సీట్ల పంపకాలను ముగించాయి. సీపీఎం జాబితా రెండు రోజుల క్రితం వెలువడగా, సీపీఐ జాబితాను తాజాగా ప్రకటించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో తమ అభ్యర్థుల జాబితాను రాష్ట్ర పార్టీ కార్యదర్శి టీ పాండియన్ విడుదల చేశారు. అభ్యర్థులు: తెన్‌కాశీ - లింగం, నాగపట్నం-జి పళని స్వామి, పుదుచ్చేరి - విశ్వనాథన్, సీపీఐ జాబితా తిరుప్పూర్- సుబ్బరాయన్, శివగంగై - ఎస్ కృష్ణన్, తిరువళ్లూరు - ఏఎస్ కన్నన్, కడలూరు - బాలసుబ్రమణ్యన్, రామనాథపురం - ఉమామహేశ్వరి, తూత్తుకుడి - మోహన్ రాజ్‌లు ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రకటించారు. 24 నుంచి ప్రచారం : అభ్యర్థులను ప్రకటించిన టీ పాండియన్ ప్రచారానికి సిద్ధం అయ్యారు. ఈనెల 24 నుంచి తమ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేపట్టనున్నాన్నట్టు ఆయన వివరించారు. కాంగ్రెస్‌ను ఓడించడం తమ లక్ష్యంగా పేర్కొన్నారు. దేశాన్ని సర్వనాశనం చేశారని, అన్నదాతలను కన్నీటి మడుగులో ముంచారని ధ్వజమెత్తారు. అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకునే స్థితికి తెచ్చిన కాంగ్రెస్‌ను తరిమి కొట్టడం లక్ష్యంగా ఎన్నికల్లో ప్రచారం ఉంటుందని వివరించారు. కార్పొరేట్ సంస్థల ధనంతో, మీడియా బలంతో ప్రధాని అభ్యర్థిని తానే అని ప్రచారం చేసుకుంటున్న మోడీని ఓడించే విధంగా ఓటర్ల వద్దకు వెళ్లనున్నామన్నారు. మతత్వానికి వ్యతిరేకంగా ప్రజల్ని ఏకం చేసి తమ అభ్యర్థుల్ని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. వామపక్షాల తరపున పలాన వ్యక్తి పీఎం అభ్యర్థిగా పేర్కొంటూ ప్రచారం ఉండబోదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తాము ఏ ఒకర్నీ ముందుకు తీసుకొచ్చే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.