breaking news
Speaker of the Assembly
-
స్పీకర్ ఓ ఫ్యాక్షనిస్టు
కర్నూలు (ఓల్డ్‌సిటీ): అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఓ ఫ్యాక్షనిస్టు అని వైఎస్ఆర్సీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. శుక్రవారం స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోడెల 1994లో నర్సరావుపేటలోని ఓ నర్సింగ్ హోమ్‌లో ఐదుగురి మృతి చెందినా కేసులు పెట్టలేదన్నారు. ఇలాంటి వ్యక్తిని చంద్రబాబు నాయుడు స్పీకర్‌గా నియమించారని, ఆయన స్పీకర్లా కాకుండా టీడీపీ కార్యకర్తగా వ్యవహరిస్తూ ప్రతిపక్ష పార్టీ నేత వైఎస్ జగన్‌కు మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదని విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ ఎన్నెన్నో హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టారన్నారు. సభలో ఈ విషయాలపై అడిగేందుకు సమయం ఇవ్వకపోవడం, మైక్‌లు కట్ చేయడం, దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆభండాలు వేయడం పద్ధతి కాదన్నారు. చీఫ్‌విప్ కాలువ శ్రీనివాసులు తన బాధ్యతలను విస్మరించి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలు వ్యక్తిగత దూషణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు వివరాలను కూడా చంద్రబాబు ఇవ్వడం లేదని, నివేదిక పంపకపోగా పట్టిసీమ నుంచి రాయలసీమకు నీళ్లు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నాయకుడు తోట వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ గురువారం శాసనసభలో జరిగిన పరిణామాలను ఖండిస్తున్నామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగన్మోహన్రెడ్డి అడిగితే చంద్రబాబు నాయుడు మంత్రులతో మాట్లాడించాడని, వ్యక్తిగత దూషణలు చేయించారని ఆరోపించారు. విభజన తర్వాత చోటు చేసుకున్న మొట్టమొదటి సంఘటనగా ఇది చరిత్రలో నిలిచిపోతుందన్నారు. విలేకరుల సమావేశంలో వైఎస్ఆర్సీపీ నాయకులు రాఘవేంద్రనాయుడు, సలీం, షరీఫ్, పి.జి.నరసింహులు యాదవ్, పులిజాకబ్, సత్యరాజు, నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
స్పీకర్ తీరు సిగ్గుచేటు
శ్రీకాళహస్తి రూరల్ : అసెంబ్లీలో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరు ప్రజాస్వావ్యూనికే సిగ్గుచేటుగా ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు ధ్వజమెత్తారు. శాసనసభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజా సవుస్యలపై వూట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్ పోడియుంను చుట్టువుుట్టిన ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆ పార్టీ నేతలు శ్రీకాళహస్తిలో ధర్నా చేశారు. పట్టణంలోని తేరువీధిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయుకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు వందలాదిగా తరలివచ్చి ఈ ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధికారప్రతినిధి అంజూరు తారక శ్రీనివాసులు వూట్లాడారు. స్పీకర్ రెండు పక్షాలకు సవున్వయుకర్తగా వ్యవహరిస్తూ సభను హుందాగా జరిగేలా చూడాల్సిందిపోరుు టీడీపీ పక్షపాతిగా వ్యవహరించడం సిగ్గుచేటని అన్నారు. ప్రజా సవుస్యలపై వూట్లాడడానికి విపక్ష నేతకు అవకాశం ఇవ్వాలంటూ పట్టుబట్టిన ఎమ్మెల్యేలను వుూడు రోజుల పాటు సస్పెండ్ చేయుడం దారుణవున్నారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రైతుల రుణవూఫీ అంశంపై వూట్లాడుతుండగా ‘యుు కెనాట్ స్పీక్’ అంటూ స్పీకర్ అనడం చూస్తే, ఇప్పటివరకు భారతదేశంలోని ఏ అసెంబ్లీలోనూ స్పీకర్ ఇలా వ్యవహరించ లేదని అన్నారు. కోడెల శివప్రసాద్‌రావు స్పీకర్‌గా కాకుండా టీడీపీ వ్యక్తిగా వ్యవహరిస్తున్నట్టు స్పష్టంగా అర్థవువుతోందన్నారు. ప్రతిపక్షం గొంతునొక్కేలా స్పీకర్ వైఖరి : మిద్దెల అసెంబ్లీ సవూవేశాల్లో సవుస్యలపై ప్రశ్నిస్తున్న విపక్ష నాయుకుల మైక్ కట్ చేస్తూ స్పీకర్ ప్రతిపక్షం గొంతు నొక్కేలా ప్రవర్తిస్తున్నారని పార్టీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు మిద్దెల హరి వివుర్శించారు. స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఏకపక్షంగా తవు పార్టీ నాయుకులకు కొవుు్మ కాస్తూ ప్రతిపక్షాల గొంతు నొక్కడం వుంచిది కాదన్నారు. వాసుదేవనాయుుడు, వయ్యూల కృష్ణారెడ్డి, షేక్ సిరాజ్‌బాషా, నాని, జయుశ్యామ్, సత్రవాడ ప్రవీణ్, నాగరాజురెడ్డి, వుుని, పాపిరెడ్డి, సుధాకర్‌రెడ్డి, కౌన్సిలర్లు ధర్మయ్యు, గిరి, పార్టీ నాయుుకులు గోరా, జిలాని, ఆరీఫ్, శంకర్‌రెడ్డి, కళత్తూరు ప్రభాకర్, వుునిరావుయ్యుయూదవ్, శంకర్, గిరిగౌడ్, రవిగౌడ్, గోపిగౌడ్, చంద్రరాజు, ఎత్తిరాజులు, జయురావుయ్యు, క్రిష్ణయ్యు, సాగీర్‌బీ, పవనకువూరి, రాజవ్ము, నాగభూషణవ్ము పాల్గొన్నారు. ధర్నా భగ్నం.. భారీగా పోలీసుల మోహరింపు వైఎస్సార్సీపీ నాయుకులు శాంతియుుతంగా చేస్తున్న ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. డీఎస్పీ వెంకటకిషోర్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ధర్నా విరమించుకోవాలని డీఎస్పీ సూచించారు. శాంతియుుతంగా నిర్వహిస్తున్న ధర్నాను విరమించుకోవుంటే ఎలా అని పార్టీ నాయకులు డీఎస్పీని ప్రశ్నించారు. పోలీసులు, నాయకుల వుధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారుు. అనంతరం పోలీసులు ధర్నా చేస్తున్న నాయుకులు, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలించారు. తరువాత సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
స్పీకర్‌పై అవిశ్వాసమా?: టీఆర్ఎస్
హైదరాబాద్: బీసీ వర్గానికి చెందిన సిరికొండ మధుసూదనాచారి అసెంబ్లీకి స్పీకర్‌గా ఎన్నికైతే టీడీపీ ఓర్వలేకపోతోందని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆరోపించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వి.శ్రీనివాస్‌గౌడ్, గంగుల కమలాకర్, సోమారపు సత్యనారాయణ, చింతా ప్రభాకర్, అంజయ్య, గంపా గోవర్దన్ విలేకరులతో మాట్లాడారు. బీసీల పార్టీ అని చెప్పుకొంటున్న టీడీపీలో తెలంగాణ, ఆంధ్రప్రాంత బీసీలకు అన్యాయం జరిగిందన్నారు. బీసీ వర్గానికి చెందిన ఆర్.కృష్ణయ్యకు శాసనసభా పక్షనేత పదవి ఇవ్వకుండా అన్యాయం చేశారని ఆరోపించారు.