breaking news
Sher Khan
-
ఒక్కొక్కడ్ని కాదు షేర్‌ఖాన్...
పంచ్ శాస్త్ర ఎప్పుడూ గంభీరంగా కనిపించే భైరవకోన ఆరోజు భావోద్వేగాలకు సంబంధించిన అనేక కోణాలతో వెలిగిపోతోంది. భయం, నిర్భయం, ఆగ్రహం, ఆరాటం, పోరాటం... వీరత్వం, రణతంత్రం... ఒకే సమయంలో అనేక రకాల అనుభూతులు ఆకాశంలో కారు మేఘాలై సంచరిస్తున్నాయి. దట్టంగా దుమ్ములేస్తుంది. చెవులు పిక్కటిల్లేలా గుర్రపు డెక్కల శబ్దం వినిపిస్తుంది. షేర్‌ఖాన్ వస్తున్నాడు. పేరులోనే కాదు ధైర్యంలోనూ అతడు షేరే. ‘నేను యుద్ధానికి పిలుపునిస్తే... ప్రతిఘటించ కుండానే రాజ్యం అప్పగించి పారిపోయిన రాజులు ఉన్నారు. నేను యుద్ధరంగంలోకి దిగితే... పోరాడకుండానే పారిపోయిన సైనికులు ఉన్నారు’ అని తనను తాను పరిచయం చేసుకునే షేర్‌ఖాన్ ఉదయ్గఢ్ను జయించడానికి, అదే రాజ్యానికి చెందిన రణదేవ బిల్లాను తొత్తుగా మార్చుకొని వస్తున్నాడు. రణదేవ బిల్లాకు రాజ్యం కాదు పిల్ల కావాలి. షేర్ఖాన్కి రాజ్యం కావాలి. ‘‘యువరాణిని విడిపిస్తానని మాటిచ్చా. దాన్ని తీసుకొచ్చి వీడి ఒళ్లో పెట్టి నా కాళ్లకు సలాం కొట్టు... పో... నిన్ను ప్రాణాలతో వదిలేస్తా’’ గర్జించాడు షేర్‌ఖాన్. ‘అలాగే మహారాజా’ అనే భయమేదీ వినిపించలేదు. భయాన్ని భయపెట్టే మాటొకటి కాలభైరవుడి నోటి నుంచి దూసుకొచ్చింది... ‘‘నేను నీకు మాటిస్తున్నాను షేర్‌ఖాన్. ఆ రాజద్రోహిని నాకు అప్పజెప్పు. నిన్నూ నీ సైన్యాన్ని ప్రాణాలతో వదిలిపెడతా’’ ఈ మాటకు తోక తొక్కిన తాచులా లేచాడు షేర్‌ఖాన్. ‘‘నాకు ప్రాణభిక్షపెడతావా? ఖుదా హు మై.. నీ ఒంట్లో రోషం ఉంటే, నీ కళ్లలో నిజం ఉంటే నా మనుషుల్ని వందమందిని పంపిస్తా. నీ ఒంటి మీద చేయిపడకుండా ఆపు. ఈ రాజ్యాన్ని ఆ రాణిని నీకు అప్పగిస్తా’’ అని ఆఫర్ ఇచ్చాడు షేర్‌ఖాన్. ‘‘వెన్ను చూపని వీరుల్ని ఎన్నుకొని మరీ పంపించు షేర్‌ఖాన్’’ అని ధైర్యంగా బదులిచ్చాడు కాలభైరవ. ‘‘వాళ్లను చూస్తేనే నువ్వు సగం ఛస్తావురా’’ బెదిరింపు ఖడ్గం విసిరాడు షేర్‌ఖాన్. దాన్ని వేలిగోరుతో దూరంగా నెట్టి ‘‘ఎక్కువైనా ఫరవాలేదు. లెక్క తక్కువ కాకుండా చూసుకో’’ సవాలుకు సవాలు విసిరాడు కాలభైరవ. ‘‘ఆ వందలో ఒక్కడు మిగిలినా నువ్వు ఓడిపోయినట్లే’’ కవ్వించాడు షేర్‌ఖాన్. ‘‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ వందమందిని ఒకేసారి పంపించు’’ కాలభైరవుడి దమ్ముకు, ధైర్యానికి భైరవకోన నలుదిక్కులు ప్రతిధ్వనించాయి. ఒక్కడు కాదు... నిజంగానే వందమంది ఒకేసారి కాలభైరవుడి మీది వచ్చారు. మాటల్లో పొగరు మాత్రమే కాదు... చేతల్లో దమ్ము కూడా ఉందని నిరూపిస్తున్నాడు భైరవ. షురూ... ఒక్కటి... పది... ఇరవై మూడు... కుత్తుకలు తెగిపడుతున్నాయి. ‘పిచ్చేసే మారు’’ అరుస్తున్నాడు షేర్. ఇరవై తొమ్మిది... ముప్పై.. నిమిషాల వ్యవధిలోనే కౌంట్ పూర్తయింది. వంద శిరస్సులు... ఒక్క యోధుడికి వందనం చెబుతున్నాయి ‘‘చాలా షేర్‌ఖాన్... ఇంకో వందిమందిని పంపిస్తావా?’’ భైరవుడు అడుగుతున్నాడు. ఆ ఎర్రటి నేలపై షేర్‌ఖాన్ తెల్లటి ముఖం వేశాడు. ఒక్క చిత్రం వెయ్యి పదాలను చెబుతుంది అంటారు. ‘మగధీరా’ సినిమాలో ‘ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్... డైలాగులో మాత్రం ఒక్కో పదం రోమాలు నిక్కబొడుచుకునేలా వందల చిత్రాలను చూపించి పంచ్శాస్త్ర పవర్ ఏమిటో రుజువు చేసింది. సినిమా: మగధీర డైలాగ్: ఒక్కొక్కడిని కాదు షేర్‌ఖాన్ -
సాయం కోసం వెళ్లి మృత్యులోగిలికి..
శంషాబాద్: ఔటర్ రింగురోడ్డుపై ఆగి ఉన్న ఓ కంటెయినర్‌ను లారీ ఢీకొనడంతో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ప్రమాదంలో మరో నలుగురికి గాయాలయ్యా యి. ఆర్జీఐఏ ఠాణా ఎస్ఐ హరిప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. రాళ్లగూడ సమీపంలో ఔటర్ రింగురోడ్డుపై ఉదయం 6.30 గంటల సమయంలో ఓ కంటెయినర్ మరమ్మతుకు గురవడంతో రోడ్డుపై నిలిపారు. అదే సమయంలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వైపు వస్తున్న ఓ లారీని సాయం కోసం కంటైనర్ డ్రైవర్ ఆపాడు. వాహనం చెడిపోయింది.. పనిముట్లు ఇవ్వాలని కోరాడు. దీంతో లారీ డ్రైవర్ షేర్‌ఖాన్(45), క్లీనర్ ఇస్మాయిల్ఖాన్(27)లు తమ లారీని కొద్ది ముందుకు తీసుకెళ్లి ఆపారు. అనంతరం కిందికి దిగి పనిముట్లతో కంటెయినర్‌కు మరమ్మ తు చేయసాగారు. అదే దారిలో శంషాబాద్ వైపు వస్తున్న మరో లా రీ వెనుక నుంచి కంటెయినర్‌ను వేగంగా ఢీకొంది. దీంతో కంటె యినర్ బోల్తాపడింది. దానికి మరమ్మతు చేస్తున్న షేర్‌ఖాన్ అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ప్రమాదంలో ఇస్మాయిల్ఖాన్కు తీవ్ర గాయాలయ్యాయి. కంటెయినర్‌కు సంబంధించిన డ్రైవర్‌తో పాటు క్లీనర్‌కు కూడా గాయాలయ్యాయి. కంటెయినర్‌ను ఢీకొన్న లారీ డ్రైవర్ వెంకటరమణ కాలికి స్వల్పగాయాలయ్యాయి. పోలీసు లు షేర్‌ఖాన్ మృతదేహానికి స్థానిక క్లస్టర్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. మృతుడు నగరంలోని బోరబండ వాసి అని పోలీసులు తెలిపారు. ఈమేరకు ఆర్జీఐఏ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.