-
‘లయన్’ రెడీ
‘‘బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా ఒక పండగే. కచ్చితంగా అందరి అంచనాలనూ అందుకునే స్థాయిలో ఈ చిత్రం రూపొందింది. ఇటీవల విడుదలైన పాటలకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు చెప్పారు. బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే కాంబినేషన్లో సత్యదేవా దర్శకత్వంలో, జవ్వాజి రామాంజనేయులు సమర్పణలో ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై రూపొందుతోన్న ‘లయన్’ చిత్రం మే 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు సత్యదేవా మాట్లాడుతూ -‘‘బాలకృష్ణ గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలుసు. అందరి ఆకాంక్షలనూ ఈ సినిమా నెరవేరుస్తుంది’’ అన్నారు. బాలకృష్ణ ఇందులో రిస్కు చేసి ఓ ఫైట్ చేశారని అలీ చెప్పారు. నటుడు సమీర్, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ మాట్లాడారు. -
అడవుల్లో... అడ్డంకుల్ని అధిగమించి...
ఇటీవల దక్కిన ‘లెజెండ్’ ఘన విజయంతో ఊపు మీదున్న హీరో నందమూరి బాలకృష్ణ రెట్టించిన ఉత్సాహంతో తన తాజా చిత్రం షూటింగ్లో పాల్గొంటున్నారు. ఎస్.ఎల్.వి. సినిమా పతాకంపై సత్యదేవ దర్శకత్వంలో ఈ చిత్రం నిర్మాణమవుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ తూర్పుగోదావరి జిల్లాలోని రంపచోడవరం, మారేడుమిల్లి తదితర ఏజెన్సీ ప్రాంతాలలో దిగ్విజయంగా జరిగింది. ‘‘నిజానికి, ఏజెన్సీలో భారీ వర్షాలు కురిసి, ఈ చిత్ర షూటింగ్‌కు అంతరాయం తలెత్తింది. 7 రోజులనుకున్న షెడ్యూల్ 13 రోజుల దాకా విస్తరించింది. అయినప్పటికీ, కష్టనష్టాలకు వెరవకుండా ముందుకెళ్ళి, ముందుగా అనుకున్న సన్నివేశాలను అనుకున్నట్లుగా చిత్రీకరించి, ఈ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేశాం’’ అని నిర్మాత రుద్రపాటి రమణారావు ‘సాక్షి’కి చెప్పారు. ఎత్తై భారీ వృక్షాల మధ్య, అటవీ ప్రాంతంలో జరిగిన ఈ షెడ్యూల్లో కొన్ని పోరాట దృశ్యాలనూ, కథానుగుణంగా కొన్ని టాకీ సన్నివేశాలనూ చిత్రీకరించారు. ఈ ఏజెన్సీ షెడ్యూల్లో హీరో బాలకృష్ణ, హీరోయిన్ త్రిషతో పాటు చలపతిరావు, గీత, చిత్రలేఖ, శ్రావణ్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ‘‘దాదాపు 30 మంది ఫైటర్లతో ప్రధాన పోరాట సన్నివేశాలు తీశాం. వర్షాలు అడ్డంకి సృష్టించినప్పటికీ వెనుదిరిగి రాకుండా, ఓ కొత్త నిర్మాత ఇలా హైదరాబాద్ నుంచి తీసుకువెళ్ళిన 250 మంది యూనిట్‌తో అక్కడే బస చేసి, అనుకున్న రీతిలో మొత్తం షూటింగ్ పూర్తి చేయడం అరుదైన విషయం’’ అని ఫైట్ మాస్టర్లు రామ్-లక్ష్మణ్ చెప్పారు. రాజమండ్రికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో, సెల్‌ఫోన్ సిగ్నల్స్ కూడా అందని లొకేషన్లో ప్రకృతి పరిసరాల మధ్య తీసిన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని దర్శక, నిర్మాతలు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. వెంకట ప్రసాద్ ఛాయాగ్రహణం, రవీందర్ కళాదర్శకత్వం నిర్వహిస్తున్న ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించాల్సి ఉంది. ‘‘రేపటి నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్‌లోని ఔటర్ రింగ్‌రోడ్, తదితరప్రాంతాల్లో పది రోజుల పాటు కొన్ని ప్రధాన పోరాట సన్నివేశాలు చిత్రీకరించనున్నాం’’ అని కార్యనిర్వాహక నిర్మాత కొమ్మినేని వెంకటేశ్వరరావు తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్‌లో ఉన్నా: నటి
- హీట్‌వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్‌తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement