breaking news
Sati timmamamba
-
తిమ్మమ్మ కథ
అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న తిమ్మమ్మ మర్రిమాను కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. భవ్యశ్రీ ప్రధాన పాత్రలో బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో పెదరాసు సుబ్రమణ్యం నిర్మించిన ఈ చిత్రం నవంబరులో విడుదల కానుంది. ‘‘మర్రి మాను చరిత్రను ప్రేక్షకులకు చూపించాలనే సంకల్పంతో ఈ చిత్రం తీశాం’’ అని నిర్మాత అన్నారు. ఈ చిత్రానికి దర్శకత్వ పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్. -
తిమ్మమాంబ చరిత్ర తీయడం ఆనందంగా ఉంది
- హీరో బాలకృష్ణ ‘‘అనంతపురంలో తిమ్మమ్మ మర్రిమాను చరిత్రతో సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. ఓ మహిళ కథతో వస్తున్న ఈ చిత్రం మంచి విజయం సాధించాలి’’ అని హీరో బాలకృష్ణ అన్నారు. శ్రీ వెంకట్, భవ్యశ్రీ జంటగా బాలగొండ ఆంజనేయులు దర్శకత్వంలో ఎస్.ఎస్.ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై పెదరాసు సుబ్రమణ్యం నిర్మిస్తున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఈ చిత్రం పాటల సీడీని బాలకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ- ‘‘తెలుగు భాష, సంస్కృతి అంటే నాకెంతో ప్రేమ. ఎంతో ఘనమైన చరిత్ర ఉన్న తెలుగు జాతి మనది. తెలుగును మర్చిపోయి పరభాష మీద ప్రేమ పెరుగుతున్న ఈ రోజుల్లో మన చరిత్రకు సంబంధించిన సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది’’ అని అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ- ‘‘ఈ కథ రాశాక బాలకృష్ణగారు నటించిన ‘భైరవ ద్వీపం’ ప్రథమార్ధాన్ని చాలాసార్లు చూశాను. కానీ ఆ సినిమా అంత గొప్పగా ఈ సినిమా చేయలేకపోయాం. ఉన్నంతలో చక్కగా తెరకెక్కించాం. బాలకృష్ణగారి కోసం శివరావణ యుద్ధం అనే కథ తయారు చేశాను. ఆయన అంగీకరిస్తే, సినిమా చేయాలనుకుంటున్నా’’ అని చెప్పారు. ‘‘మా పూర్వీకులకు సంబంధించిన కథ ఇది. నియమ నిబంధన లతో ఈ చిత్రాన్ని రూపొందించాం. మొదట ఈ చిత్రాన్ని సీరియల్‌గా చేసి టెన్ ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేశాం. కానీ, స్లాట్ దొరక్క పోవడంతో మొత్తం ప్రదర్శించలేకపోయాం. అందుకే సినిమాగా తీర్చిదిద్దాం. అందరికీ నచ్చుతుందన్న నమ్మకం ఉంది’’ అని నిర్మాత అన్నారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు పల్లె రఘునాథ్‌రెడ్డి, పరిటాల సునీత తదితరులు పాల్గొన్నారు. -
చరిత్ర చెప్పే చెట్టు
అనంతపురం జిల్లా కదిరి ప్రాంతంలో వెలిసిన తిమ్మమ్మ మర్రిమాను చరిత్రను భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో రూపొందుతున్న చిత్రం ‘సతీ తిమ్మమాంబ’. ఎస్.ఎస్.ఎస్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై భవ్యశ్రీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రానికి బాలగొండ ఆంజనేయులు దర్శకుడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ‘‘600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ చెట్టు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ నెలాఖరులో పాటలను విడుదల చేయనున్నాం’’ అని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: బండారు దానయ్యకవి, దర్శకత్వం పర్యవేక్షణ: ఎస్.రామ్‌కుమార్.