breaking news
Sathuranga Vettai 2
-
ఇన్నుమ్ ఇరుక్కు!
ఏ ఇండస్ట్రీలో అయినా ప్రతి ఏడాది కొన్ని సీక్వెల్స్ వెండితెరపైకి వస్తూనే ఉంటాయి. కోలీవుడ్‌లో గత ఏడాది రజనీకాంత్ ‘2.0’, కమల్‌హాసన్ ‘విశ్వరూపం 2’, ధనుష్ ‘మారి 2’, విశాల్ ‘పందెంకోడి 2’ చిత్రాలతో పాటు ‘కలకలప్పు 2’, ‘గోలీ సోడా 2’, ‘తమిళ్ పడమ్ 2’ చిత్రాలు సీక్వెల్స్‌గా వచ్చి ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేశాయి. ‘ఇన్నుమ్ ఇరుక్కు’ (ఇంకా ఉంది) అంటూ తమిళంలో ఈ ఏడాది కూడా కొన్ని సీక్వెల్స్ వెండితెరపై వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో వాంగ పాక్కలామ్.. అదేనండీ.. రండి చూద్దాం. లోకనాయకుడు కమల్‌హాసన్ సీక్వెల్స్‌పై స్పెషల్ కేర్ తీసుకున్నట్లు అర్థమవుతోంది. గత ఏడాది ‘విశ్వరూపం 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కమల్ ‘ఇండియన్ 2’ షూటింగ్ పనుల్లో ఉన్నారిప్పుడు. 1996లో శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘ఇండియన్’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమాకు ఇది సీక్వెల్. సేమ్ కాంబినేషన్లో సెట్స్‌పైకి వెళ్లిన ఈ ‘ఇండియన్ 2’ సినిమాలో కాజల్ అగర్వాల్ కథా నాయికగా నటిస్తున్నారు. అలాగే 1992లో భరతన్ దర్శకత్వంలో కమల్‌హాసన్ హీరోగా నటించిన ‘దేవర్‌మగన్’ (తెలుగులో ‘క్షత్రియపుత్రుడు’) చిత్రానికి సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు కమల్‌హాసనే గత ఏడాది అక్టోబర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో స్వయంగా పేర్కొనడం జరిగింది. ఈ విధంగా సీక్వెల్స్‌పై ఫుల్ కాన్సట్రేట్ చేశారు కమల్. యువహీరో ‘జయం’ రవి కూడా ఓ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. తెలుగులో రామ్‌చరణ్ చేసిన హిట్ మూవీ ‘ధృవ(2016)’ తమిళంలో ‘జయం’ రవి హీరోగా నటించిన ‘తని ఒరువన్’ (2015)కు రీమేక్ అని తెలిసిందే. దీనికి మోహన్‌రాజా దర్శకత్వం వహించారు. ఇప్పుడు ‘తని ఒరువన్’ సినిమాకు సీక్వెల్ రూపొందుతోంది. సేమ్ మోహన్‌రాజా దర్శకత్వంలోనే ‘జయం’ రవి హీరోగా నటిస్తున్నారు. మొదటిపార్ట్ కన్నా మరింత మెరుగ్గా సినిమాను తెరకెక్కించేందుకు కష్టపడతామని మోహన్ రాజా పేర్కొన్నారు. ఇక తమన్నా, ప్రభుదేవా, సోనూ సూద్ ముఖ్య తారలుగా ఏఎల్. విజయ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేవి’ (తెలుగులో ‘అభినేత్రి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘దేవి 2’ చిత్రం రూపొందుతోంది. ఏఎల్. విజయ్ దర్శకత్వంలోనే తమన్నా, ప్రభుదేవా ముఖ్యతారలుగా నటిస్తున్నారు. నందితా శ్వేత, కోవై సరళ ముఖ్యపాత్రలు చేస్తున్నారీ సీక్వెల్లో. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలిసింది. తెలుగులో ‘అభినేత్రి 2’ పేరుతో విడుదల కావొచ్చు. మరోవైపు ఓ మల్టీస్టారర్ సీక్వెల్ విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఇది ఇప్పటి చిత్రానికి సీక్వెల్ కాదు. దురై దర్శకత్వంలో కమల్‌హాసన్, శ్రీప్రియ నటించిన నీయా (1979) చిత్రానికి సీక్వెల్‌గా ‘నీయా 2’ వస్తోంది. మల్టీస్టారర్ మూవీగా జై, వరలక్ష్మీ శరత్‌కుమార్, రాయ్‌లక్ష్మీ, క్యాథరీన్లతో ఈ చిత్రం రూపొందింది. ఆల్రెడీ ఫస్ట్‌లుక్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ‘నాగకన్య’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. నాలుగేళ్ల క్రితం హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘చతురంగ వేటై్ట’. ఈ సినిమా ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో తెలుగులో ఈ ఏడాది విడుదలైంది. సత్యదేవ్ హీరోగా నటించారు. ఇప్పుడు త్రిష, అరవింద్ స్వామి హీరోహీరోయిన్లుగా ‘చతురంగ వేటై్ట 2’ సినిమా సెట్స్‌పై ఉంది. ప్రముఖ కమెడియన్ వడివేలు నటించిన ‘ఇమ్సై అరసన్ 23 ఆమ్ పులికేశి’ (తెలుగులో ‘హింసించే రాజు 23వ పులకేశి’) చిత్రానికి సీక్వెల్‌గా ‘ఇమ్సై అరసన్ 24 ఆమ్ పులికేశి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. సీక్వెల్లో కూడా వడివేలునే తీసుకున్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్స్ వచ్చి ఆ స్థానంలో యోగిబాబు నటిస్తారని టాక్. మరి.. హింసించే రాజు ఎవరో త్వరలో తెలుస్తుంది. ఈ సినిమాలే కాకుండా కొన్ని చిన్న సినిమాల సీక్వెల్స్ కూడా సెట్స్‌పై ఉన్నాయి. ఇప్పటివరకు స్పష్టమైన అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ కొన్ని హిట్ సినిమాలకు సీక్వెల్స్‌ను తెరకెక్కించాలని ఆలోచన చేస్తున్నారట కొంతమంది కోలీవుడ్ దర్శక–నిర్మాతలు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా వచ్చిన ‘తుపాకీ’ (2012) చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు మురుగదాస్ ఈ మధ్య ఓ సందర్భంలో పేర్కొన్నారని కోలీవుడ్‌లో వార్తలు వచ్చాయి. అయితే ఫస్ట్ పార్ట్‌లో విజయ్ నటించగా, సీక్వెల్లో మాత్రం అజిత్ హీరోగా నటిస్తారట. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా నటించిన చిత్రం ‘పుదుపేటై్ట’ (2006). ఈ సినిమా సీక్వెల్ ఆలోచన ఉన్నట్లు ఓ అభిమాని ప్రశ్నకు ధనుష్ సమాధానంగా చెప్పారు ఇటీవల జరిగిన ఓ అవార్డు వేడుకలో. విశాల్,ధనుష్ అభివృద్ధి చెందిన నేటి సాంకేతిక పరిజ్ఞానంతో ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘ఇరంబు దురై’ (2018). (తెలుగులో ‘అభిమన్యుడు’). పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు హింట్స్ ఇస్తున్నారు విశాల్. 2017లో వచ్చిన హారర్ మూవీ ‘గృహం’ సిద్ధార్థ్‌కు మంచి హిట్ అందించింది. ఈ సినిమాకు సీక్వెల్ తీసే ఆలోచనలో ఉన్నారట. అలాగే నయనతార కలెక్టర్‌గా నటించిన ‘అరమ్’ (తెలుగులో ‘కర్తవ్యం’), సూర్య కెరీర్‌కు మంచి మైలేజ్‌ను తీసుకొచ్చిన ‘కాక్క కాక్క’ (తెలుగులో ‘ఘర్షణ’) సినిమాలకు సీక్వెల్స్ రానున్నాయని కోలీవుడ్‌లో కొత్తగా కథనాలు వస్తున్నాయి. ‘గోల్మాల్, రేస్, ధూమ్, క్రిష్’ చిత్రాల సీక్వెల్స్ ఫ్రాంచైజ్‌లుగా మారాయి బాలీవుడ్లో. ఈ ట్రెండ్ మెల్లిగా సౌత్‌కి వస్తున్నట్లు అర్థం అవుతోంది. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో ఇప్పటికే ‘సింగం’ (తెలుగులో ‘యముడు’) సిరీస్‌లో మూడు సినిమాలు వచ్చాయి. మరో రెండేళ్లలోపు ‘సింగం 4’ అనౌన్స్మెంట్ వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రాఘవ లారెన్స్ దర్శకత్వంలో వచ్చిన ‘కాంచన’ సిరీస్ ఇలాంటిదే. ‘ముని’ పేరుతో మొదలైన ఈ హారర్ సిరీస్‌లో ఫోర్త్ పార్ట్‌గా ‘కాంచన 3’ ఈ ఏడాది ఏప్రిల్‌లో రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాఘవ లారెన్స్ రాఘవ లారెన్స్‌తో పాటు, వేదిక, ఓవియా నటించారు. విశాల్ కెరీర్‌కు మాస్ ఇమేజ్ను తీసుకువచ్చిన చిత్రం ‘పందెం కోడి (2005)’. ఈ సినిమా సీక్వెల్ ‘పందెంకోడి 2’ గతేడాది విడుదల అయ్యింది. ‘పందెంకోడి 3’ సినిమా 2020లో సెట్స్‌పైకి తీసుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు విశాల్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. అలాగే గౌతమ్ మీనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ‘ధృవనక్షత్రం’ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను ఓ సిరీస్‌లా కొనసాగించే ఆలోచనలో ఉన్నారట టీమ్. భవిష్యత్‌లో ఈ సిరీస్‌ల ట్రెండ్ మరింత ముందుకు వెళ్తుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. -
జోడీ కుదిరింది
ఓ పదేళ్ల క్రితం అందంగా ఉన్న కుర్రాళ్లను అరవింద్ స్వామిలా ఉన్నావనేవారు. ‘దళపతి’, ‘రోజా’, ‘బొంబాయి’ వంటి డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆ తర్వాత వ్యాపారంపై దృష్టి సారించిన అరవింద్ స్వామి దశాబ్దం తర్వాత మణిరత్నం ‘కడలి’తో రీ-ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత ‘తని ఒరువన్’లో విలన్‌గా అందర్నీ మెప్పించారు. ఆ సినిమా తెలుగు రీమేక్ రామ్‌చరణ్ ‘ధృవ’లోనూ ఆయనే విలన్‌గా నటిస్తున్నారు. ఇప్పుడు అరవింద్ స్వామి హీరోగా రీ-ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యారు. ‘సదురంగ వెట్టై’ అనే తమిళ సినిమా సీక్వెల్లో ఆయన హీరోగా నటించనున్నారు. అరవింద్ స్వామికి జోడీగా త్రిషను ఎంపిక చేశారు. 2014లో విడుదలైన ‘సదురంగ వెట్టై’తో హెచ్.వినోద్ దర్శకుడిగా పరిచయమయ్యారు. సీక్వెల్‌కి ఆయనే కథ, స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. ‘సలీమ్’ ఫేమ్ నిర్మల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. టెక్నాలజీ ఉపయోగించి ఓ ఘరానా మోసగాడు ఏం చేశాడనే కథాంశంతో ఈ థ్రిల్లర్ మూవీ తెరకెక్కనుందట. త్వరలో షూటింగ్ మొదలు కానుంది. -
చతురంగ వేట్టై-2లో సూర్య
చతురంగ వేట్టై-2 చిత్రంలో నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. నటుడు మనోబాల నిర్మించిన చిత్రం చతురంగ వేట్టై. కొత్త దర్శకుడు వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటరాజ్ హీరోగా నటించారు. తిరుపతి బ్రదర్స్ సంస్థ విడుదల చేసిన ఈ చిత్రం మంచి విజయం సాధించడమేగాక విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో హీరోగా నటించేందుకు సూర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రస్తుతం ఆయన వెంకట ప్రభు దర్శకత్వంలో మాస్ చిత్రాన్ని పూర్తిచేసి విక్రమ్ కుమార్ దర్శకత్వంలో 24 చిత్రంతో పాటు సుశీంద్రన్ దర్శకత్వంలో హైక్యూ చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాలను తన టూడీ పిక్చర్స్ పతాకంపై సొంతంగా నిర్మించడం విశేషం. చతురంగ వేట్టై - 2 చిత్రాన్ని సూర్యనే నిర్మించాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. సూర్యతో అంజాన్ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దర్శకుడు లింగుస్వామి నష్టాలను చవిచూశారు. చతురంగ వేట్టై చిత్రాన్ని తానే నిర్మిస్తానని కోరడంతో సూర్య ఒకే అన్నట్టు తెలిసింది. వినోద్ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని లింగుస్వామి తన తిరుపతి బ్రదర్స్ పతాకంపై నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు త్వరలో వెలువడనున్నాయి.