breaking news
sagar road
-
క్షణాల్లో బూడిదైన కారు.. చూస్తుండగానే ఘోరం!
-
బీజేపీ ఆందోళన: భారీగా ట్రాఫిక్ జాం
రంగారెడ్డి: అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని ఇంజాపూర్ వద్ద బజరంగ్దల్, బీజేపీ కార్యకర్తల ఆందోళనతో భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. స్థానికంగా ఉన్న రామచంద్ర డోంగ్రేజ్ మహారాజ్ గోశాలకు చెందిన షెడ్డును ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా.. శుక్రవారం సాయంత్రం రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో ఆందోళనకు దిగిన బీజేపీ నేతలు ఈ రోజు రోడ్డుపై బైఠాయించారు. దీంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళన కారులను అడ్డుకోగా.. నిరసనకారులు పోలీసులకు ఎదురు తిరిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం నెలకొంది. -
డివైడర్ను ఢీకొన్న బైక్.. వ్యక్తికి తీవ్ర గాయాలు
తుర్కయాంజల్ (హైదరాబాద్): సాగర్ రోడ్డులో ఆదివారం రాత్రి ఓ బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడ్ని స్థానికంగా ఓ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పటేల్గూడకు చెందిన రాజిరెడ్డి (45) తుర్కయాంజల్ వైపు వెళుతుండగా.. వెలుగు తక్కువగా ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.


