breaking news
S. J. Surya
-
ఆ ముగ్గురి కలయికలో హార్రర్ చిత్రం
ఒక ఆసక్తికరమైన వార్త కోలీవుడ్‌లో తాజాగా హల్ చల్ చేస్తోంది. ముగ్గురు సంచలన దర్శకుల కలయికలో ఒక హార్రర్ చిత్రం తెరకెక్కనుందన్నదే వార్త. దర్శకుడు సెల్వరాఘవన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పలు విజయవంతమైన చిత్రాల సృష్టికర్త ఈయన. అదే విధంగా దర్శకుడు గౌతమ్‌మీనన్, ఎస్జే.సూర్య పలు సంచలన విజయాలను నమోదు చేసుకున్నవారే. అలాంటి ఈ ముగ్గురి కలయికలో ఒక చిత్రం రూపొందితే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. సెల్వరాఘవన్ దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందుతున్న ఖాన్ చిత్రం ఆర్థిక సమస్యల కారణంగా నిలిచిపోయింది. అదే విధంగా గౌతమ్‌మీనన్ దర్శక నిర్మాతగా శింబు కథానాయకుడు తెరకెక్కుతున్న అచ్చం ఎంబదు మడమయడా చిత్రం నిర్మాణం శింబు బీప్ సాంగ్ ఇతర సమస్యల కారణంగా నత్త నడకన నడుస్తోంది. ఇక ఎస్ఏ.సూర్య దర్శకత్వంలో విజయ్ హీరోగా చిత్రం తెరకెక్కనుందన్న ప్రచారం జరిగినా, అది తెర రూపం దాల్చలేదు. ఇక సెల్వరాఘవన్ తన సోదరుడు ధనుష్ హీరోగా ఒక హారర్ చిత్రం చేయనున్నారనే ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితిలో ఆ ముగ్గురు దర్శకులు కలిసి చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారన్నది విశేషమే. ఈ దర్శక త్రయంలో సెల్వరాఘవన్ దర్శకుడుగా గౌతమ్‌మీనన్ నిర్మాణంలో ఎస్జే.సూర్య కథానాయకుడిగా ఈ చిత్రం తయారు కానుందని సమాచారం. ఇది ధనుష్‌తో చేయాలనుకున్న హార్రర్ కథతో తెరకెక్కనున్న చిత్రం అని కోలీవుడ్ వర్గాల సమాచారం.ఈ చిత్రంలో నటించనున్న నాయకి, ఇతర నట వర్గం, సాంకేతిక బృందం వివరాలను త్వరలో దర్శకనిర్మాతలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
సుబ్బురాజ్ చిత్రంలో ఎస్జే సూర్య
కథా నాయకుడిగా మారిన దర్శకుల్లో ఎస్‌జె సూర్య ఒకరు. ఖుషి వంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన ఈయన ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. అయితే నటుడిగా కొన్ని చిత్రాలు నిరాశ పరచడంతో కొంత గ్యాప్ తీసుకున్న ఎస్‌జె సూర్య తాజాగా ఇసై చిత్రంతో తానేమిటో మరోసారి నిరూపించుకున్నారు. ఇందులో ఆయన హీరో, దర్శకుడిగానే కాకుండా అదనంగా సంగీత దర్శకుడిగా కూడా అవతారమెత్తి తన సత్తా చాటుకున్నారు. ఇసై చిత్రం నిర్మాణంలో జాప్యం జరిగినా విడుదలానంతరం మంచి ప్రజాదరణ పొందింది. దీంతో ఎస్ జె సూర్యకు మళ్లీ అవకావాలు వస్తున్నాయి. తాజాగా జిగర్తండా వంటి మంచి విజయవంతమైన చిత్రాన్ని తెరకెక్కించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ తాజా చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఎస్ జె సూర్యను వరించింది. ఈ విషయాన్ని దర్శకుడు స్పష్టం చేశారు. అయితే తన తాజా చిత్ర వివరాలను వెల్లడించడానికి ఇంకా చాలా టైమ్ ఉందని ఆయన అంటున్నారు. ఈ చిత్రంలోనే యువ నటులు విజయ్ సేతుపతి, బాబి సింహా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు అనధికార సమాచారం. ఇదే కనుక నిజం అయితే ఇదో చిన్న మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతాన్ని అందిస్తున్నారు.