breaking news
Ruin building
-
ఉజ్వల చరిత.. వీక్షించేదెలా?
సాక్షి, కృష్ణా : ఇక్ష్వాకుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం శిథిలాలు ఇంకా పదిలంగా ఉన్నాయి. క్రీస్తు శకం 3వ శతాబ్దం నాటి వైభవాన్ని ఈ శిథిలాలు చాటిచెబుతున్నాయి. నాగార్జునసాగర్‌లోని విజయపురిసౌత్‌కు 8కిలోమీటర్ల దూరంలోని అనుపులో ఈ విశ్వ విద్యాలయం ఉంది. ప్రతి రోజూ నాగార్జున సాగర్‌కు వందలమంది సందర్శకులు వస్తున్నా ఈ ఆనవాళ్ల గురించి ఎవరికీ తెలియదు. కనీసం లాంచీ స్టేషన్ సమీపంలో నైనా దీనిగురించి వివరాలు తెలిపే బోర్డులు లేకపోవడం విచారకరం. సాగర్ నుంచి బెల్లంకొండవారిపాలెం మీదుగా మాచర్ల వైపునకు ఉన్న రహదారికి కిలోమీటరు దూరం లోపల ఈ ప్రదేశం ఉంది. ఇదే శ్రీపర్వత విహారంగా ప్రసిద్ధి పొందింది. ఈ విద్యాపీఠంలో ఆనాడు వివిధ దేశాల విద్యార్థులు విద్యనభ్యసించారు. మహాయాన బౌద్ధమత ప్రచారంలో ఈ విశ్వవిద్యాలయం ప్రధాన భూమిక నిర్వహించింది. కృష్ణానది లోయలో కేంద్ర పురావస్తు శాఖ 3700 చదరపు హెక్టార్లలో జరిపిన తవ్వకాలలో ఈ విశ్వ విద్యాలయం శిథిలాలు బయటపడ్డాయి. తరువాత కాలంలో ఈ శిథిలాలను పాత అనుపు వద్ద పునర్నిర్మించారు. 1976కు ముందు ఈ పాత అనుపు నుంచే పర్యాటకశాఖ లాంచీ సర్వీసులు నాగార్జునకొండకు నడిపేవారు. దీంతో అనుపును పర్యాటకులు సందర్శించటానికి సౌకర్యంగా ఉండేది. ఆ తరువాత విజయపురిసౌత్(రైట్‌బ్యాంక్)కి లాంచీస్టేషన్‌ను మార్చటంతో పాత అనుపు వద్దకు పర్యాటకులు వెళ్లాల్సిన అవసరం రాలేదు. దీంతో ఆ ప్రదేశం నిరాదరణకు గురైంది. దీనిని సందర్శించాలనే ఆపేక్ష ఉన్నా తగిన ప్రయాణ సౌకర్యం లేకపోవడంతో సాగర్‌కు వచ్చిన పర్యాటకులు దీనిని చూడకుండానే వెళ్లిపోతున్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రస్థానం ఆచార్య నాగార్జునుడు క్రీ.శ.3వ శతాబ్దంలో ఇక్కడ కృష్ణానదీ లోయలో విశ్వవిద్యాలయాన్ని నిర్మించాడు. చారిత్రక ఆధారాలను బట్టి ఈ విహారం ఐదు అంతస్తులు కలిగి ఉన్నట్టు తెలుస్తోంది. దీనిని పర్వత విహారమని కూడా పిలిచేవారు. ప్రతి అంతస్తులోనూ బుద్ధుని స్వర్ణ ప్రతిమ శిథిలాలు ఆనాటి శిల్పకళకు నిదర్శనంగా నిలిచాయి. బౌద్ధమతానికి చెందిన అనేక గ్రంథాలు రెండవ అంతస్తులో ఉండేవి. చైనా, జపాన్, శ్రీలంక, భూటాన్ తదితర వివిధ దేశాలకు చెందిన విద్యార్థులు ఇక్కడ విద్యనభ్యసించేవారు. ఇక్కడ రసాయన, వృక్ష, ఖనిజ, వైద్య విద్యలను బోధించేవారు. ఇక్కడే ఆచార్య నాగార్జునుడు అపరామృతం కనుగొన్నట్లు ఆధారాలున్నాయి. క్రీ.శ.7వ శతాబ్దంలో హ్యూయాన్‌స్సాంగ్, ఇత్సింగ్ ఈ విద్యాలయాన్ని సందర్శించి కొంత కాలం గడిపి మహాయాన బౌద్ధమతం గురించి అధ్యయనం చేశారని చరిత్ర పుటలు చెబుతున్నాయి. నాగార్జునుడి మరణానంతరం కూడా ఈ విశ్వ విద్యాలయం కొన్ని శతాబ్దాల పాటు వర్థిల్లినట్లు ఆదారాలున్నాయి. ఇంత ప్రసిద్ధి చెందిన విశ్వ విద్యాలయం ఆనవాళ్లను సందర్శించేందుకు రవాణా సౌకర్యం లేకపోవటం విచారకరం. కనీసం శని, ఆదివారాల్లోనైనా మాచర్ల డిపో బస్సులను అనుపు ప్రాంతానికి నడిపితే పర్యాటకులు దీనిని సందర్శించటానికి వీలవుతుందని విహార యాత్రికులు కోరుతున్నారు. కనీసం టూరిజం పరిధిలో ఉన్న మినీ బస్సులనైనా ఇక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందని పర్యాటకులు కోరుతున్నారు. -
130 మందికి ఒకే స్నానపు గది
♦ చాలాచోట్ల కనీస సౌకర్యాలూ కరువే ♦ శిథిల భవనాల్లోనే కొనసాగింపు ♦ పెచ్చులూడుతున్న పైకప్పులు ♦ తలుపులే లేని గదులెన్నో.. ♦ బోధన్ బీసీ హాస్టల్లో 130 మందికి ఒకటే స్నానపు గది ♦ వసతి గృహాలపై పర్యవేక్షణ కరువు ♦ ఇన్చార్జి వార్డెన్లతో ఇబ్బందులు బోధన్ పట్టణంలోని ఓ పెంకుటింట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ కొనసాగుతోంది. ఇక్కడ నాలుగు గదులు, తలుపులు లేని ఓ రేకుల షెడ్డూ ఉన్నాయి. ఇందులో 130 మంది విద్యార్థులు ఉంటున్నారు. నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. స్నానపు గది ఒకటే ఉంది. అందరూ అదే గదిలో స్నానం చేయాలి. సంక్షేమ హాస్టళ్ల దుస్థితిపై కథనం.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పూర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పిస్తున్నామని పాలకులు పేర్కొంటున్నా.. క్షేత్రస్థాయిలో వాటి ఫలాలు కనిపించడం లేదు. విద్యార్థులకు ఇక్కట్లు తప్పడం లేదు. సంక్షేమ హాస్టళ్లలో ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయి. బోధన్‌లో ఎస్సీ బాలుర (ఎ), (బి), ఇంటిగ్రేటెడ్ బాలికల వసతి గృహం, బీసీ బాలుర కళాశాల, ఎస్సీ బాలుర కళాశాల, బీసీ మహిళా కళాశాల, ఎస్సీ మహిళా కళాశాల హాస్టల్స్, ఎస్టీ హాస్టల్, బెగ్గర్స్ హాస్టల్స్లున్నాయి. ఈ సంక్షేమ హాస్టల్స్‌లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పలు హాస్టల్స్‌లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్టీ బాలుర హాస్టల్లో.. పట్టణంలోని ఎస్టీ బాలుర హాస్టల్లో 90 మంది విద్యార్థులున్నారు. హాస్టల్ భవనంలో పలు గదుల పైకప్పు పెచ్చులూడి పడుతోంది. బాత్రూం, మరుగుదొడ్డి గదులు 20 ఉండగా.. ఇందులో కొన్నింటి తలుపులు విరిగిపోయాయి. బీసీ బాలుర కళాశాల హాస్టల్లో.. పట్టణంలోని రాకాసీపేట్ ప్రాంతంలో అద్దె ఇంట్లో బీసీ బాలుర కళాశాల హాస్టల్ ఉంది. పట్టణంలోని వివిధ కళాశాలలు, కోటగిరి మండలంలోని పాలిటెక్నిక్ కళాశాలలో చదివేవారు 130 మంది ఈ హాస్టల్లో ఉంటున్నారు. పురాతన కాలం నాటి నాలుగు గదుల పెంకుటిళ్లు, రేకులషెడ్డులో హాస్టల్ కొనసాగుతోంది. రేకుల షెడ్డుకు తలుపు లేదు. వర్షం కురిస్తే పైకప్పులోంచి నీరు ఊరుస్తుంది. చలికి విద్యార్థులు వణకాల్సిందే.. ఈ హాస్టల్లో 130 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ నాలుగు మరుగుదొడ్లు ఉన్నా.. రెండే పనిచేస్తున్నాయి. ఒకే స్నానపు గది ఉండడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. చిరు జల్లులకే హాస్టల్ పరిసరాలు చిత్తడిగా మారుతున్నాయి. పెంకుటిళ్లు కావడంతో పైకప్పులు ఊరుస్తున్నాయి. రేకుల షెడ్డుకు తలుపులు లేకపోవడంతో చలికి వణుకుతున్నారు. ఏ సమయంలో ఏ పురుగు వస్తుందోనని భయపడుతున్నారు. హాస్టల్ వార్డెన్ చక్రధర్‌కు కళాశాల హాస్టల్‌తో పాటు బీసీ బాలుర హాస్టల్, చందూరు బీసీ బాలుర హాస్టల్ నిర్వహణ బాధ్యతలు ఇచ్చారు. మూడు హాస్టళ్లకు ఒకే వార్డెన్ ఉండడంతో పర్యవేక్షణ లోపించింది. శిథిలావస్థలో బీసీ బాలుర హాస్టల్.. పట్టణంలోని మున్సిపల్ కార్యాలయానికి సమీపంలో ఉన్న బీసీ బాలుర హాస్టల్ భవనంలో 100 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ హాస్టల్ భవనం దశాబ్దాల క్రితం నిర్మితమైంది. ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. పైకప్పు పెచ్చులూడిపోతోంది. వర్షం కురిస్తే నీరు గదుల్లోకి చేరుతోంది. హాస్టల్లో 9 గదులుండగా.. ఇందులో మూడింటిని ఆఫీసు, కిచెన్, స్టోర్ రూంలకు కేటాయించారు. మిగిలిన ఆరు ఇరుకు గదుల్లో విద్యార్థులు ఉంటున్నారు. పై కప్పు పెచ్చులూడుతుండడంతో విద్యార్థులు భయాందోళనలకు గురి అవుతున్నారు. ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్లో.. రాకాసీసేట్ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బాలుర (ఎ) 100 మంది విద్యార్థులున్నారు. పాఠశాల భవనంలో హాస్టల్ ఉంది. నాలుగు గదులు మాత్రమే ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లాను బీసీ బాలుర కళాశాల అద్దె రేకుల షెడ్డు లో కొనసాగుతోంది. ఇక్కడ సౌకర్యవంతంగా లేదు. హాస్టల్ భవనం దుస్థితిని జిల్లా స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. బీసీ సంక్షేమ శాఖలో నిధుల లేమి ఉందని అధికారులు అంటున్నారు. విద్యార్థులు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంటున్నాం. - చక్రధర్, వార్డెన్, బీసీ బాలుర కళాశాల హాస్టల్ వార్డెన్, బోధన్ దుప్పట్లు, పెట్టెలు ఇవ్వలేదు హాస్టల్లో సరైన వసతులు లేవు. మ్యాట్లు మాత్రమే ఇచ్చా రు. దుప్పట్లు ఇంకా ఇవ్వలేదు. పాత పెట్టెలే వాడుకుంటున్నాం. హాస్టల్లో నాలుగు గదులున్నాయి. ఒక్కోదాంట్లో 25 మంది విద్యార్థులం ఉంటున్నాం. దీంతో ఇబ్బందిగా ఉంది. - శ్రీకాంత్, ఎస్సీ బాలుర(ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్ ఇరుకు గదులతోనే ఇబ్బంది పాఠశాలలు పునఃప్రారంభమై నెల దాటింది. ఇప్పటి వరకు మాకు యూనిఫాంలు ఇవ్వలేదు. హాస్టల్లో వంద మంది ఉన్నారు. భోజనం బాగానే ఉంది. కానీ ఇరుకు గదులతోనే ఇబ్బం దులు పడుతున్నాం. హాస్టల్‌కు సొంత భవనం నిర్మిస్తే సమస్య తీరుతుంది. - శ్రీనివాస్, ఎస్సీ బాలుర (ఎ) హాస్టల్ విద్యార్థి, బోధన్