breaking news
rising intolerance
-
సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో మార్చ్
-
సోనియా, రాహుల్ ఆధ్వర్యంలో మార్చ్
న్యూఢిల్లీ: దేశంలో పెరిగిపోతున్న మత విద్వేషాలకు నిరసనగా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ సహన యాత్ర చేపట్టింది. ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ మార్చ్ నిర్వహించారు. పార్లమెంట్ ఆవరణంలోని గాంధీ విగ్రహం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు మార్చ్ చేపట్టారు. ఇందులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు. సోనియా గాంధీ నాయకత్వంలో మన్మోహన్, రాహుల్ సహా 11 మంది కాంగ్రెస్ నేతలు.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి కేంద్ర ప్రభుత్వ పెద్దల మత అసహనంపై ఫిర్యాదు చేశారు. కాగా కాంగ్రెస్ మార్చ్‌కు వ్యతిరేకంగా సిక్కులు ఆందోళన చేపట్టారు. సిక్కుల ఊచకోతకు కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. విజయ్ చౌక్ వద్ద పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు.