breaking news
Randhir singh
-
ఇరాన్, ఇజ్రాయెల్ నుంచి 4,400 మంది వెనక్కి: కేంద్రం
న్యూఢిల్లీ: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్, ఇజ్రాయెల్‌ల నుంచి 4,400 మంది భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చినట్లు విదేశాంగ శాఖ శుక్రవారం తెలిపింది. ఆపరేషన్ సిందూలో భాగంగా ఈ నెల 18వ తేదీ నుంచి వీరి కోసం 19 ప్రత్యేక విమాన సర్వీసులను నడిపినట్లు వెల్లడించింది. ఇరాన్ నుంచి ఆర్మీనియా రాజధాని ఎరెవాన్ చేరుకున్న 173 మంది భారతీయులతో కూడిన ప్రత్యేక విమానం తాజాగా గురువారం రాత్రి ఢిల్లీకి చేరుకుందని పేర్కొంది. అక్కడి క్షేత్ర స్థాయి పరిస్థితులను అంచనా వేశాక తదుపరి కార్యాచరణపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ శుక్రవారం మీడియాకు వివరించారు. మొత్తమ్మీద ఇరాన్లో 10 వేల మంది, ఇజ్రాయెల్‌లో 40 వేల మంది భారతీయులు ఉన్నారన్నారు. భారతీయులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడంలో సహకరించిన ఈజిప్టు, జోర్డాన్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈనెల 20న గగనతలాన్ని భారతీయుల కోసం తెరిచిన ఇరాన్‌తోపాటు తుర్క్మెనిస్తాన్, ఆర్మీనియా ప్రభుత్వాలకు సైతం ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈనెల 13వ తేదీ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్ మద్య ఉద్రిక్తతలు మొదలుకాగా, 22న అమెరికా ఇరాన్ అణు వసతులపై దాడులకు దిగడంతో తీవ్ర రూపం దాల్చడం తెల్సిందే. -
ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ అధ్యక్షుడిగా రణ్‌దీర్ సింగ్
న్యూఢిల్లీ: భారత సీనియర్ షూటర్ రణ్‌దీర్ సింగ్ ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన 44వ ఓసీఏ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. తద్వారా ఈ పదవి చేపట్టిన తొలి భారతీయుడిగా రణ్«దీర్ సింగ్ నిలిచారు. 2028 వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఐదు ఒలింపిక్స్ క్రీడల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించిన 77 ఏళ్ల రణ్«దీర్ సింగ్ గతంలో కొన్నాళ్ల పాటు ఓసీఏ తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించారు. ఆసియాలోని 45 దేశాల ప్రతినిధుల్లో 44 మంది రణ్‌దీర్‌కు మద్దతిచ్చారు. రణ్«దీర్ సింగ్ 2001 నుంచి 2014 వరకు ఐఓసీలో సభ్యుడిగా వ్యవహరించారు. ‘ఓసీఏ జనరల్ అసెంబ్లీ సమావేశం భారత్‌లో జరగడం సంతోషాన్నిచ్చింది. అధ్యక్షుడిగా ఎన్నికయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. దేశంలో క్రీడా సంస్కృతి పెరుగుతోంది. మౌలిక సదుపాయాల కల్పన బాగుండటం వల్లే అంతర్జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు వస్తున్నాయి’ అని రణ్‌దీర్ పేర్కొన్నారు. -
నగోయాలో కలుద్దాం!
హాంగ్జౌ: గత 16 రోజులుగా క్రీడాభిమానులను ఆద్యంతం అలరించిన ఆసియా క్రీడా సంరంభానికి ఆదివారం తెర పడింది. సెప్టెంబర్ 23న చైనాలోని హాంగ్జౌ నగరంలో అట్టహాసంగా ప్రారంభమైన 19వ ఆసియా క్రీడలు అక్టోబర్ 8న అంతే ఘనంగా ముగిశాయి. 80 వేల మంది ప్రేక్షకుల సామర్థ్యం కలిగిన ‘బిగ్ లోటస్’ స్టేడియంలో 75 నిమిషాలపాటు ముగింపు వేడుకలు జరిగాయి. 45 దేశాలకు చెందిన క్రీడాకారులు మైదానంలోకి రాగా... చైనా సాంస్కృతిక వారసత్వాన్ని తెలియజేస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైనా ప్రీమియర్ లీ కియాంగ్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ (ఓసీఏ) తాత్కాలిక అధ్యక్షుడు, భారత మాజీ దిగ్గజ షూటర్ రణ్‌ధీర్ సింగ్ 19వ ఆసియా క్రీడలు ముగిశాయని అధికారికంగా ప్రకటించారు. ‘గత 16 రోజుల్లో మనమంతా ఎన్నో చిరస్మరణీయ ఘట్టాలను తిలకించాం. హాంగ్జౌకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అద్భుతంగా ఆతిథ్యం ఇచ్చి న హాంగ్జౌను ఆసియానే కాకుండా మొత్తం ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది. ఈ సందర్భంగా చైనా ప్రభుత్వానికి, చైనా ఒలింపిక్ కమిటీకి, నగర ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’ అని రణ్‌దీర్ సింగ్ వ్యాఖ్యానించారు. తదుపరి 20వ ఆసియా క్రీడలు 2026లో సెపె్టంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు జపాన్‌లోని ఐచి రాష్ట్ర రాజధాని నగోయా నగరంలో జరుగుతాయి. ముగింపు వేడుకల్లో ఐచి రాష్ట్ర గవర్నర్ ఒమురా హిడెకి, నగోయా నగర డిప్యూటీ మేయర్ నకాటా హిడియో ఆసియా క్రీడల జ్యోతితోపాటు ఆసియా ఒలింపిక్ కౌన్సిల్ పతాకాన్ని అందుకున్నారు. ♦ ముగింపు వేడుకల్లో భారత బృందానికి స్వర్ణ పతకం నెగ్గిన పురుషుల హాకీ జట్టు గోల్‌కీపర్ శ్రీజేశ్ పతాకధారిగా వ్యవహరించాడు. చాలా మంది భారత క్రీడాకారులు ఇప్పటికే స్వదేశానికి చేరుకోగా, ముగింపు వేడుకల్లో వంద మంది వరకు క్రీడాకారులు, అధికారులు పాల్గొన్నారు. ♦ మొత్తం 45 దేశాల నుంచి 40 క్రీడాంశాల్లో 12,407 మంది క్రీడాకారులు హాంగ్జౌలో పోటీపడ్డారని నిర్వాహకులు తెలిపారు. ♦ మూడోసారి ఆసియా క్రీడలకు ఆతిథ్యమిచ్చి న చైనా మరోసారి తమ ఆధిపత్యం చాటుకొని హాంగ్జౌలోనూ ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. చైనా 201 స్వర్ణాలు, 111 రజతాలు, 71 కాంస్యాలతో మొత్తం 383 పతకాలు సాధించి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. 188 పతకాలతో జపాన్ రెండో స్థానంలో, 190 పతకాలతో దక్షిణ కొరియా మూడో స్థానంలో, 107 పతకాలతో భారత్ నాలుగో స్థానంలో నిలిచాయి. ఓవరాల్‌గా దక్షిణ కొరియా కంటే జపాన్ రెండు తక్కువ పతకాలు గెలిచినా... కొరియాకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు గెలిచినందుకు జపాన్ రెండో ర్యాంక్‌లో నిలిచింది. ♦ హాంగ్జౌ ఆసియా క్రీడల్లో 13 కొత్త ప్రపంచ రికార్డులు, 26 ఆసియా రికార్డులు, 97 ఆసియా క్రీడల రికార్డులు నమోదయ్యాయి. 41 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో మొత్తం 45 దేశాలు పాల్గొన్నాయి. ఇందులో 41 దేశాలు కనీసం ఒక్క పతకమైనా సాధించాయి. 4 హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక్క పతకం కూడా నెగ్గని దేశాలు (భూటాన్, ఈస్ట్ తిమోర్, మాల్దీవులు, యెమెన్). 2 తొలిసారి బ్రూనై, ఒమన్ దేశాలు ఆసియా క్రీడల చరిత్రలో రజత పతకాలు గెలిచాయి. 4 ఒకే ఆసియా క్రీడల్లో 100 పతకాల మైలురాయిని దాటిన నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా ముందే ఈ జాబితాలో ఉన్నాయి. 11 వరుసగా పదకొండోసారి ఆసియా క్రీడల పతకాల పట్టికలో చైనా ‘టాప్’ ర్యాంక్‌లో నిలిచింది. తొలిసారి చైనా 1982 న్యూఢిల్లీ ఆసియా క్రీడల్లో తొలి స్థానం దక్కించుకుంది. అప్పటి నుంచి చైనా పతకాల పట్టికలో తన నంబర్‌వన్ ర్యాంక్‌ను నిలబెట్టుకుంటోంది. 201 తాజా ఆసియా క్రీడల్లో చైనా గెలిచిన స్వర్ణ పతకాలు. ఈ క్రీడల చరిత్రలో తొలిసారి పసిడి పతకాల్లో 200 మైలురాయిని దాటిన తొలి దేశంగా చైనా నిలిచింది. 2010 గ్వాంగ్జౌ ఆసియా క్రీడల్లో చైనా అత్యధికంగా 199 స్వర్ణ పతకాలు గెలిచింది. 9 వరుసగా తొమ్మిదోసారి ఆసియా క్రీడల్లో చైనా 100 అంతకంటే ఎక్కువ స్వర్ణ పతకాలు సాధించింది. 1990 బీజింగ్ ఆసియా క్రీడల్లో చైనా స్వర్ణాల్లో తొలిసారి ‘సెంచరీ’ నమోదు చేసింది. -
ఐఓసీలో రణ్‌ధీర్‌కు గౌరవ సభ్యత్వం
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) మాజీ ప్రధాన కార్యదర్శి రణ్‌ధీర్ సింగ్‌కు అంతర్జాతీయ ఒలింపిక్ మండలి (ఐఓసీ)లో గౌరవ సభ్యత్వం లభించింది. అశ్వినీ కుమార్ తర్వాత ఈ అవకాశం లభించిన రెండో వ్యక్తి రణ్‌ధీర్ కావడం విశేషం. 13 ఏళ్ల పాటు ఐఓసీలో పూర్తి స్థాయి సభ్యుడిగా పని చేసిన రణ్‌ధీర్‌ను గౌరవిస్తూ మొనాకోలో జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందులో రణ్‌ధీర్ కూడా పాల్గొన్నారు. ఐఓఏ తరఫున అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ దీనికి హాజరయ్యారు. -
ఐఎస్ఎస్ఎఫ్ సభ్యుడిగా రణ్‌ధీర్
న్యూఢిల్లీ: భారత రైఫిల్ సంఘం అధ్యక్షుడు రణ్‌ధీర్ సింగ్... అంతర్జాతీయ షూటింగ్ సమాఖ్య (ఐఎస్ఎస్ఎఫ్) ఎగ్జిక్యూటివ్ కమిటీలో సభ్యుడిగా ఎంపికయ్యారు. భారత్ నుంచి ఈ పదవి చేపట్టిన తొలి వ్యక్తిగా ఆయన చరిత్ర సృష్టించారు. మ్యూనిచ్‌లో జరిగిన సాధారణ సర్వసభ్య సమావేశంలో రణ్‌ధీర్‌కు 25 ఓట్లకు గాను 22 ఓట్లు పడ్డాయి. ఐఎస్ఎస్ఎఫ్ అడ్మినిస్ట్రేటివ్ కౌన్సిల్లో కూడా రణ్‌ధీర్ సభ్యుడిగా చోటు దక్కించుకున్నారు. మొత్తం 293 ఓట్లలో 145 ఓట్లు సాధించారు.