breaking news
Rajya Sabha berth
-
కేంద్ర మంత్రి, సీనియర్లకు హ్యాండ్ ఇచ్చిన బీజేపీ
సీనియర్ నేతలు, కేంద్ర మంత్రి, మాజీ మంత్రులకు బీజేపీ అధిష్టానం షాక్ ఇచ్చింది. తాజాగా బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితాను విడదల చేసిన విషయం తెలిసిందే. 18 మంది అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటించింది. కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్‌కు మరోసారి అవకాశం ఇచ్చారు. మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయల్‌కు అవకాశం కల్పించారు. ఇక, జూన్ 10న మొత్తం 57 స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఇదిలా ఉండగా.. బీజేపీ కొంత మంది సీనియర్లుకు షాక్ ఇచ్చింది. జార్ఖండ్ ప్రతినిధిగా రాజ్యసభలో ఉన్న కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ, కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు అధిష్టానం హ్యాండ్ ఇచ్చింది. వీరితో పాటు ఓపీ మాథుర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి దుష్యంత్ గౌతమ్, వినయ్ సహస్త్రబుద్ధే వంటి సీనియర్లకు రాజ్యసభ సీటు ఇవ్వలేదు. ఇక, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కోసం గోరఖ్‌పూర్ సీటును వదులుకున్న రాధా మోహన్ అగర్వాల్‌ను రాజ్యసభకు ఎంపికయ్యారు. బీజేపీ అభ్యర్థులు వీరే: నిర్మల సీతారామన్, జగ్గేశ్- కర్ణాటక పీయూష్, అనిల్ సుఖ్‌దేవ్-మహారాష్ట్ర సతీష్ చంద్ర, శంభు శరణ్-బిహార్ కృష్ణలాల్-హర్యానా కవితా పటిదార్-మధ్య ప్రదేశ్ గణశ్యామ్-రాజస్థాన్ లక్ష్మికాంత్ వాజ్‌పేయి, రాధామోహన్, సురేంద్రసింగ్, బాబురామ్, దర్శణ సింగ్, సింగీత యాదవ్, లక్ష్మణ్- ఉత్తరప్రదేశ్ కల్పన సైని- ఉత్తరాఖండ్. ఇది కూడా చదవండి: యూపీ నుంచి నామినేషన్ వేయనున్న బీజేపీ నేత -
ఏపీ నుంచి నిర్మలా సీతారామన్‌కు రాజ్యసభ బెర్తు!
న్యూఢిల్లీ: కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్, సమాచార శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌లకు రాజ్యసభ బెర్తులు దక్కనున్నాయి. మధ్యప్రదేశ్ నుంచి జవదేకర్లను రాజ్యసభకు పంపాలని బీజేపీ నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి నిర్మలకు అవకాశం కల్పించవచ్చని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం వీరిద్దరూ పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యులు కారు. బీజేపీ అధికార ప్రతినిధులుగా వ్యవహరించిన నిర్మల, జవదేకర్ లోక్సఎన్నికల్లో పోటీ చేయలేదు. అయినా ప్రధాని నరేంద్ర మోడీ తన కేబినెట్లో వీరిద్దరికీ స్వతంత్ర హోదాతో కీలక శాఖలు అప్పగించారు. రాజ్యసభ సభ్యుడు, మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరణించడంతో ఆంధ్రప్రదేశ్ నుంచి ఓ స్థానం ఖాళీ అయింది. ఇటీవలి శాసన సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ మిత్రపక్షం తెలుగుదేశం పార్టీ.. ఈ సీటును బీజేపీకి ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో నిర్మలకు అవకాశం రావచ్చని భావిస్తున్నారు. తమిళనాడుకు చెందిన నిర్మల ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పరకాల ప్రభాకర్‌ను పెళ్లి చేసుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక రాజ్యసభ స్థానానికి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.