breaking news
rajarajeswara temple
-
జయ ఒక్క అడుగుతో ఆ ఆలయం ఫుల్లు ఫేమస్
కన్నూర్: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు జ్యోతిష్యంపై నమ్మకం కాస్తంత ఎక్కువే. ఆమె దైవాన్ని కూడా నమ్ముతారు. ఓ సందర్భంలో ప్రముఖ జ్యోతిష్యుడు పరప్పనాంగడి ఉన్నికృష్ణ పనిక్కర్ ఆమెను రాజరాజేశ్వర ఆలయ దర్శనానికి వెళితే మంచి జరుగుతుందని చెప్పారు. దీంతో 2001లో ముఖ్యమంత్రి జయలలిత ఆమె సన్నిహితురాలు శశికళ కన్నూర్ లోని తాలిపరాంబలోగల రాజరాజేశ్వర ఆలయానికి వెళ్లారు. వాస్తవానికి ఆలయ అధికారులు అత్తజ పూజకు ముందు మహిళలను ఆలయంలోకి అనుమతించరు. ఆమె సాయంత్రం పూట ఆలస్యంగా చేరుకున్నారు. అయితే, ఆలయ నిబంధనలు పక్కకు పెట్టి ఆరోజు ఆమె కోసం ఆలయాన్ని ప్రత్యేకంగా రాత్రి 9.30గంటలవరకు తెరిచి ఉంచారు. అంతేకాదు, ఆ ఆలయం లోపలికి వెళ్లే దారిలో ఉన్న చెక్క మెట్టు ప్రవేశానికి ఇబ్బందిగా ఉందని కొంతభాగం తొలగించారు. ఇది అప్పట్లో విమర్శలకు తావిచ్చింది. ఆలయ దర్శనం పూర్తి చేసుకొని తిరిగి వెళ్లే దారిలో డిన్నర్ కోసం ఆమె కాన్వాయ్ పప్పినిస్సెరీ వద్ద జాతీయ రహదారిపై ఓ గంటపాటు ఆగింది. దీంతో విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడి మరోసారి విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఆమె దర్శనం తర్వాత ఆ ఆలయం చాలా ఖ్యాతిని పొందింది. పెద్ద మొత్తంలో భక్తులు రావడమే కాకుండా పెద్ద పెద్ద రాజకీయ నాయకులు సైతం దర్శనానికి క్యూలు కట్టారు. తమిళనాడు మాత్రమే కాకుండా కర్ణాటక నుంచి కూడా ఈ ఆలయానికి భక్తులు పోటెత్తారు. -
వేములవాడకు పోటెత్తిన భక్తులు
కరీంనగర్ : కరీంనగర్ జిల్లా వేములవాడ రాజన్న దేవాలయానికి భక్తజనం పోటెత్తింది. సోమవారం తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో రెండు కిలోమీటర్ల బారలు తీరారు. దేవాలయ ప్రాంగణంలో సౌకర్యాలు సరిగా లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అధికారులు వెంటనే స్పందించి సౌకర్యాలు కల్పించాలని భక్తులు డిమాండ్ చేశారు (వేములవాడ)