breaking news
pulivendula farmers
-
బాబు నీళ్లిస్తే ట్యాంకర్లతో నీరు తరలించే ఖర్మెందుకు?
-
సాగుకు అనుమానమే
సాక్షి, కడప : ఎన్నో ఏళ్ల నాటి నిబంధనలు..ఇదేమని అడిగే పాలకపక్ష నేతలే కరువయ్యారు. అవసరం కొండంత అయితే వచ్చే నీరు మాత్రం గోరంతే. దీంతో ప్రతిసారి పులివెందుల రైతు కుదేలవుతున్నాడు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం రావాల్సిన నీరు కూడా సక్రమంగా రాని పరిస్థితుల్లో అన్నదాతలు పంటపొలాలను బీళ్లుగా వదిలేస్తున్నారు. ఒక్కసారి కాదు, రెండుసార్లు కాదు ఏళ్ల తరబడి నీరు కాలువకు సక్రమంగా అందని పరిస్థితి ఒక ఎత్తయితే, మహానేత వైఎస్సార్ పుణ్యమా అని దాదాపు 80శాతం ఆధునీకరణ పనులు పూర్తి చేసుకున్న కాలువల్లో సైతం ప్రస్తుత టీడీపీ సర్కార్ నీటిని పారించలేకపోతోంది. తక్కువ నీటిని కేటాయించడం, వాటినీ కేవలం తాగునీటికే పరిమితం చేయడంతో సాగుకు నీరు రాక దాదాపు ఐదారేళ్లుగా పులివెందుల ప్రాంత రైతులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. చివరకు కన్నబిడ్డల్లా పెంచుకున్న తోటల్లోని చెట్లను సైతం నరికేస్తున్నారంటే అక్కడి రైతుల పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఈసారి కూడా పీబీసీకి నీరు కేటాయించినా కేవలం తాగునీటికే తప్ప సాగునీటికి అందే పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. సాగుపై నీలినీడలు పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి జిల్లాలో సుమారు 55వేల ఎకరాల ఆయకట్టుతోపాటు అనంతపురం జిల్లాలో ఐదు వేల ఎకరాలను కలుపుకొని దాదాపు 60 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టుకు నీరందించే విషయమై పాలకుల్లో చిత్తశుద్ధి కనిపించడం లేదు. అరకొరగా వచ్చిన నీరంతా తాగునీటి అవసరాలకే సరిపోతుండడంతో సాగుకు అందించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది కూడా 1.197 టీఎంసీ నీటిని అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశంలో కేటాయించినా, ఒక టీఎంసీ కూడా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చిన నీరంతా తాగునీటికే సరిపోతే ఇక సాగునీటి సంగతి ఏంటన్నది అర్థం కావడం లేదు. ఐదారేళ్లుగా ఆయకట్టు పరిస్థితి ఇంతే పీబీసీ పరిధిలో ఐదారేళ్లుగా రైతన్నలు విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వర్షాలు లేక, సాగు నీరు రాక, భూగర్భజలాలు అడుగంటి అయోమయ పరిస్థితుల్లో చెట్లను కొట్టేసుకుంటున్నారు. దాదాపు ఐదారేళ్లుగా పీబీసీకి నీరిచ్చిన దాఖలాలు లేవు. దీంతో వేలాదిమంది రైతులు పంట పొలాలు సాగు చేయలేక బీళ్లుగా వదిలేస్తున్నారు. కొంతమంది రాజకీయ నేతలు మాత్రం ఏదో ఇచ్చినట్లు, దాంతోనే పొలాలన్నీ కాపాడినట్లు గొప్పలు చెప్పుకుంటూ ప్రచార ఆర్భాటం చేస్తున్నారు. అయితే ఆది నుంచి కూడా వైఎస్సార్సీపీ నేతలు పీబీసీ నీటి కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారు. తుంగభద్ర నీరు రాదు...కృష్ణా నీటిపై ఆశలట! అమ్మ పెట్టదు...అడుక్కోనివ్వదు అన్న చందంగా ఉంది ప్రభుత్వ తీరు. పీబీసీకి 4.4 టీఎంసీల నీటి కోటా ఉన్నా అరకొరగా ఒకటి, రెండు టీఎంసీలు మాత్రమే కేటాయించడం, అది కూడా లాసెస్ పోను కేవలం తాగునీటి అవసరాలు అంతంతమాత్రమే సరిపోతున్నాయి. అధికారంలో ఉన్న టీడీపీ సర్కారు రావాల్సిన నీటి కోటాను ఇప్పించరు గానీ..సుదూరం నుంచి కృష్ణా నీటిని తీసుకొస్తానని పులివెందుల ప్రాంత టీడీపీ నేతలు చెబుతుండటం విడ్డూరంగా ఉందని రైతులు పేర్కొంటున్నారు. ఎందుకంటే అన్నీ సక్రమంగా ఉన్నా గండికోటకే కృష్ణా నుంచి నీరు రాని పరిస్థితి ఉంది. ఇక కోటా లేని పీబీసీకి ఎలా కృష్ణా నీరు ఇస్తారన్నది కూడా అనుమానమే. అయితే సంబంధిత అధికారులు కూడా కృష్ణా నీరు రావచ్చని పులివెందుల ప్రాంత రైతులకు చెబుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఉన్న నీరు రాకపోగా, లేని, రాని నీరు ఎలా వస్తుందని పలువురు రైతులు ప్రశ్నిస్తున్నారు. మిడ్ పెన్నార్ వద్ద నీటి విడుదల – నేడు సీబీఆర్‌కు నీరు ఈనెల 16న చిత్రావతి బ్యాలెన్సింVŠ రిజర్వాయర్‌కు పీబీసీ కోటా కింద నీటిని విడుదల చేశారు. అనంతపురం జిల్లాలోని మిడ్ పెన్నార్ రిజర్వాయర్ వద్ద 200 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేశారు. అక్కడి నుంచి అనంతపురం జిల్లాలోని సుమారు 65 కిలోమీటర్లు వస్తే అక్కడ తుంపెర డీప్ కట్కు చేరుకుని అక్కడి నుంచి మరో 30 కిలోమీటర్లు వస్తే చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు చేరుతుంది. అయితే ఒకటి, రెండు రోజుల్లో 200 నుంచి 300 క్యూసెక్కుల వరకు వదులుతున్నారు. రానున్న కాలంలో 400 క్యూసెక్కుల వరకు నీటిని పెంచి వదులుతామని పీబీసీ అధికారులు పేర్కొంటున్నారు. పీబీసీ నీటికి సంబంధించి ఐదేళ్ల నీటి విడుదల, సీబీఆర్ చేరిన నీటి వివరాలు –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– సంవత్సరం మిడ్ పెన్నార్ వద్ద విడుదల సీబీఆర్‌కు చేరిన నీరు . (టీఎంసీలలో) (టీఎంసీలలో) ––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– 2011–12 0.963 0.620 2012–13 2.116 1.190 2013–14 3.223 2.040 2014–15 3.141 2.702 2015–16 2.794 1.805 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– -
మంత్రి గంటాకు చేదు అనుభవం
పులివెందుల: ఏపీ రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం పులివెందులలోని చింతారామంలో రెండో విడత రుణమాఫీ పత్రాల అందజేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తమకు రుణమాఫీ వర్తించలేదంటూ మంత్రి గంటాను నిలదీశారు.