breaking news
Proactive attitude
-
ఈ 5 లక్షణాలుంటే చాలు! మీరిక ‘చిరంజీవే’!
ఎంత వయసు వచ్చినా.. ‘చావు’ అంటే అందరికీ భయమే. అలనాటి పురాణ పురుషుల నుంచి ఈనాటి సామాన్య మానవుల దాకా మృత్యువు నుంచి దూరంగా పారిపోయి దీర్ఘాయుష్షుతో చిరంజీవిగా జీవించాలన్నఆరాటం ఈనాటిది కాదు. ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు, ప్రయోగాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో తాజా స్టడీ కీలక విషయాలను వెల్లడించింది. దాకా మృత్యువు నుంచి తప్పించుకొని, దీర్ఘాయుష్షుతో జీవించాలన్న ఆరాటం మామూలుది కాదు. ఈ క్రమంలో ఎక్కువ కాలం జీవించాలంటే ప్రోయాక్టివ్‌గా, హ్యాపీగా, థరోగా, రెస్పాన్సిబుల్‌గా, హెల్పింగ్ నేచర్‌తో ఉంటే చాలు.. దీర్ఘాయువు మీ సొంతం అంటోంది ఒక స్టడీ.జర్నల్ ఆఫ్ సైకోసోమాటిక్ రీసెర్చ్‌లో ప్రచురించబడిన ఈ అధ్యయనం ప్రకారం, చురుగ్గా ఉండటం, వ్యవస్థీకృతంగా ఉండటం బాధ్యతాయుతంగా ఉండటం వంటి నిర్దిష్ట వ్యక్తిత్వ లక్షణాలు అకాల మరణం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ‘పర్సనాలిటీ న్యూయెన్స్ అండ్ మోర్టాలిటీ రిస్క్: ఫోర్ లాంగిట్యూడినల్ శాంపిల్స్ రిపోర్ట్ ’ అనే శీర్షికతో ఈ స్టడీ కొన్ని విషయాలను తెలిపింది. పై లక్షణాలు బహిర్ముఖం లేదా మనస్సాక్షి వంటి విస్తృత వ్యక్తిత్వ వర్గాల వివరణ కంటే దీర్ఘాయువును మరింత ఖచ్చితంగా అంచనా వేస్తాయని తెలిపింది.. కష్టపడి పనిచేయడం లేదా సంతోషంగా ఉండటం వంటి లక్షణాలు ఆయుర్దాయాన్ని పెంచడంలో చాలా పెద్దపాత్ర పోషిస్తాయని పరిశోధకులు అంటున్నారు.అధ్యయనంలో ఏముందంటే!ఈ అధ్యయనం నాలుగు దీర్ఘకాలిక అధ్యయనాలలో వ్యక్తిత్వ డేటాను విశ్లేషించింది . ఈ లక్షణాలు మరణ ప్రమాదానికి ఎలా సంబంధం కలిగి ఉన్నాయో ట్రాక్ చేసింది. వయస్సు, లింగం,వైద్య పరిస్థితులకు అనుగుణంగా సర్దుబాటు చేసిన తర్వాత కూడా, తమను తాము చురుకుగా వర్ణించుకున్న వ్యక్తులు 21 శాతం తక్కువ మరణ ప్రమాదాన్ని కలిగి ఉన్నారని ఇది వెల్లడించింది.ఉల్లాసంగా, బాధ్యతాయుతంగా, హార్డ్ వర్కింగ్, క్షుణ్ణంగా (thorough)సహాయకారిగా ఉండటం లాంటి లక్షణాలు మన ఆయువును నిర్దేశిస్తాయని వెల్లడించింది. మరోవైపు, తరచుగా ఒత్తిడి, ఆందోళన, ప్రతికూల భావోద్వేగాలున్నవారి జీవితకాలం తక్కువగా ఉంటుందని స్పష్టం చేసింది.చదవండి: రెండేళ్ల శ్రమ ఒక మినిట్‌లో : భారీ కాయంనుంచి సన్నగా వైరల్వీడియో సాంప్రదాయకంగా, మనస్తత్వవేత్తలు కల్మషం లేకుండా ఉండటం, మనస్సాక్షికి అనుగుణంగా ఉండటం, బహిర్ముఖత్వం, అంగీకారయోగ్యత, న్యూరోటిసిజం అనే ఐదు విస్తృత లక్షణాల ద్వారా వ్యక్తిత్వాన్ని కొలుస్తారు. కానీఈ స్టడీ సహ రచయిత రెనే మోటస్ ప్రకారం, ఈ "బిగ్ ఫైవ్" ముఖ్యమైన వివరాలను కోల్పోవచ్చు. బదులుగా, కష్టపడి పనిచేయడం లేదా సహాయకారిగా ఉండటం వంటి స్వీయ-వర్ణనలు ఆరోగ్యం, ఆయువు ప్రభావాలను కలిగి ఉన్న నిర్దిష్ట ప్రవర్తనలను సంగ్రహిస్తాయి. ఈ అధ్యయనంలో, సూక్ష్మ నైపుణ్యాలు పెద్ద వర్గాల కంటే ఎక్కువగా అంచనా వేసేవిగా మారాయి.వ్యక్తిత్వం ఆరోగ్య ప్రమాదాలను ఎలా అంచనా వేయగలదు?ఒక రోజు ఆరోగ్య ప్రమాదాలను బాగా అంచనా వేయడానికి రక్తపోటు లేదా కొలెస్ట్రాల్ పరీక్షలతో పాటు వ్యక్తిత్వ-ఆధారిత సాధనాలను ఉపయోగించవచ్చని ఈ పరిశోధన వైద్యులు సూచించారు. ఉదాహరణకు, ఆందోళన చెందుతున్న లేదా అస్తవ్యస్తంగా గుర్తించే వ్యక్తి లక్ష్య జీవనశైలి,మానసిక ఆరోగ్య మద్దతు నుండి ప్రయోజనం పొందవచ్చు. సహ రచయిత పారాయిక్ ఓ'సుయిల్లియాభైన్ ఏమంటారంటే..వ్యక్తిత్వం అనేది కేవలం ఒక సాధారణ ప్రభావం కాదు, ఇది దీర్ఘకాలిక ఆరోగ్య ఫలితాలను రూపొందించే రోజువారీ ప్రవర్తనలను కూడా ప్రతిబింబిస్తుంది.ఎక్కువ కాలం జీవించడానికి మీరు ఏ లక్షణాలను పెంపొందించుకోవాలి?అధ్యయనం ప్రకారం ఎంత ఎక్కువ చురుగ్గా ఉంటే అంత ఎక్కువ ఆయుష్షు ఉంటుంది. ఇది చాలా కీలకం. అలాగే అకాల మరణం నుంచి తప్పించుకోవచ్చు. ఇక లైవ్లీగా, ఒకరిగా సాయం చేసే గుణం, క్రమశిక్షణగా, బాధ్యతాయుతంగా ఉండటం అనేది తరువాత వరుసలో ఉంటాయి. లక్షణాలే ఆరోగ్యకరమైన అలవాట్లు, బలమైన సామాజిక సంబంధాలు, ఒత్తిడిని ఎదుర్కోవడానికి సాయపడతాయి. ఫలితంగా ఇవన్నీ దీర్ఘాయువును పెంచుతాయి. అలా కాకుండా తీవ్ర ఒత్తిడి, ఆందోళనలతో ఉంటే గుండె జబ్బులు, ఇన్ఫ్లమేషన్, అనారోగ్యకరమైన లక్షణాలను ప్రేరేపించడం ద్వారా మరణాల ప్రమాదాన్ని పెంచుతాయి.ఎక్కువ కాలం జీవించడానికి వ్యక్తిత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, కానీ ఈ లక్షణాలతో ముడిపడి ఉన్న చిన్న రోజువారీ అలవాట్లను పెంపొందించుకోవడం సహాయపడుతుందని అధ్యయనం నొక్కి చెప్పింది. అంటే నిరంతరం చురుకుగా ఉండటం, నిబద్ధతగా ఉండటం, ఇతరులకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండటం, శారీరక , మానసిక శ్రేయస్సుకు మద్దతు ఇచ్చే సరళమైన, సాధించగల దశలు.ఇదీ చదవండి: కేఎఫ్సీలో కంపుకొట్టే చికెన్ బర్గర్? వీడియో చూస్తే వాంతులే! -
చైనాకి వంతపాడుతున్న రష్యా! ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యే!
Russia On Nancy Pelosi's Taiwan Visit: అగ్రరాజ్యం సెనేట్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటిస్తున్నారని వస్తున్న వార్తలు పెను వివాదానికి దారితీశాయి. ఒక పక్క తైవాన్‌లో అడుగుపెడితే ఊరుకునేదే లేదంటూ అమెరికాకు పదే పదే చైనా హెచ్చరిస్తోంది. పైగా దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇదిలా ఉంటే మరోవైపు రష్యా కూడా అమెరికా తీరుని తప్పుపట్టింది. చైనాకి వత్తాసు పలుకుతూ...అమెరికాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇది ముమ్మాటికి రెచ్చగొట్టే చర్యని తేల్చి చెప్పారు మాస్కో ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్. యూఎస్ సెనెట్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్‌ని సందర్శించడం వల్ల చైనాతో యుద్ధానికి దారితీస్తుందని హెచ్చరించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశం కూడా ఉందన్నారు. అయినా తైవాన్ తమది అని నొక్కి చెబుతూ పదేపదే హెచ్చరించినా... అమెరికా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. పైగా వాషింగ్టన్ వన్ చైనా సూత్రానికి కట్టుబడి ఉంటానంటూ ప్రతిజ్ఞ చేసి మరీ ఇలా యూఎస్ పెలోసి తైవాన్ పర్యటన ఖరారు చేయడం అంటే బీజింగ్‌కి విరుద్ధంగా వ్యవహరించడమేని నొక్కి చెప్పారు. మరోవైపు ఈ పెలోసీ పర్యటనను సీరియస్‌గా తీసుకున్న చైనా ఇప్పటికే తైవాన్‌కి సంబంధించిన సుమారు 35 ఆహర ఎగుమతులను నిషేధించింది. (చదవండి: చైనా వార్నింగ్‌తో అలర్ట్.. తైవాన్ చుట్టూ అమెరికా యుద్ధ నౌకల మోహరింపు) -
నాపై ఆంక్షలు లేవు
ప్రధాని క్రియాశీలంగా ఉండడం సమస్య కాదు: సుష్మ న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ తనపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని, ఆయన క్రియాశీలక వైఖరి తనకు ఏమాత్రం సమస్య కాదని విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టంచేశారు. తమ బృందంలో నంబర్ 1, నంబర్ 2 స్థానాల కోసం పోటీ లేదని, అందరం కలసికట్టుగా పనిచేస్తున్నట్టు చెప్పారు. ఆదివారమిక్కడ ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏడాది కాలంలో తమ ప్రభుత్వం విదేశాంగ విధానంలో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రధాని క్రియాశీలకంగా ఉండడం సమస్యగా భావిస్తున్నారా అని కొందరు విలేకరులు అడగ్గా.. సుష్మ పైవిధంగా సమాధానమిచ్చారు. బయటకు పెద్దగా కనిపించడం లేదని ప్రశ్నించగా.. ‘‘నా వైఖరికి తగ్గట్టుగానే ఉంటా. నా ప్రస్తుత ప్రొఫైల్.. లో ప్రొఫైల్‌కే సరిపోతుంది. నేను లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రతీరోజూ మాట్లాడాల్సి ఉంటుంది. ఇప్పుడు విదేశాంగ మంత్రిగా ఆ అవసరం పెద్దగా ఉండదు. విదేశాంగ మంత్రి మాట్లాడితే అది వ్యక్తిగత అభిప్రాయమో, పార్టీ అభిప్రాయంగానో చూడరు. ఒక దేశ వైఖరిగా చూస్తారు’’ అని బదులిచ్చారు. కాగా, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చిత్తశుద్ధితో పనిచేసి, హింసాయుత కార్యక్రమాలకు మద్దతు ఉపసంహరించుకున్నప్పుడే పాకిస్తాన్‌తో చర్చలు జరుపుతామని సుష్మా స్వరాజ్ తేల్చిచెప్పారు. ముంబై దాడుల సూత్రధారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


