breaking news
Prashant Ladd
-
బాధ్యతల్ని చేపట్టిన కార్పొరేటర్
భివండీ, న్యూస్‌లైన్: సమాజ్‌వాదీ పార్టీ కార్పొరేటర్ ప్రశాంత్ లాడ్ మంగళవారం భివండీ నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ (బీఎన్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవీ బాధ్యతలను చేపట్టారు. గత నెల 29వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటి చైర్మన్ ఎన్నికలలో ప్రశాంత్ గెలుపొందిన విషయం విదితమే. ఈ సందర్భంగా మాజీ మేయర్, కోణార్క్ వికాస్ ఆఘాడీ నాయకుడు విలాస్ పాటిల్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్ చౌగులే, తుషార్ చౌదరి, శిక్షణ్ మండలి సభాపతి గాజు గాజెంగితో పాటు కార్పొరేషన్ అధికారులు, అభిమానులు ఆయనను అభినందించారు. అనంతరం ప్రశాంత్ లాడ్ విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రహదారుల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందన్నారు. నిధుల కొరత సమస్య కారణంగా అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదన్నారు. ఈ విషయమై త్వరలో ఓ సమావేశం నిర్వహించి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
సభాపతిగా ప్రశాంత్ లాడ్ ఎన్నిక
భివండీ, న్యూస్‌లైన్: భివండీ నిజాంపూర్ మున్సిపల్ కార్పొరేషన్(బీఎన్‌ఎంసీ) స్థాయీ సమితి సభాపతి ఎన్నికల్లో సమాజ్‌వాది పార్టీ కార్పొరేటర్ ప్రశాంత్ లాడ్ విజయం సాధించారు. బీఎన్‌ఎంసీ స్థాయీ సమితిలో అధికార పక్షం-విరోధి పక్షంలో 8-8 మంది సభ్యులు ఉన్నారు. కోనార్క్ వికాస్ అగాడి, బీజేపీ, రాష్ట్రవాది కాంగ్రెస్ పార్టీ కలిసి సమాజ్‌వాది పార్టీకి చెందిన కార్పోరేటర్ ప్రశాంత్ లాడ్‌కు మద్దతు పలకాయి. కాగా, ఎన్నిక సమయంలో విరోధి పక్షంలోని కాంగ్రెస్ కార్పొరేటర్ సాజిద్ షేక్ గైరాజర్ కావడంతో బరిలో ఉన్న శివసేన పార్టీ అభ్యర్థి దిలీప్ గుల్వీ ఒక ఓటుతో పరాజయం పాలయ్యాడు. కార్పొరేషన్ ముఖ్య కార్యాలయంలో శనివారం ఉదయం 11 గంటలకు స్థాయీ సమితి సభాగృహంలో ఈ ఎన్నికలు నిర్వహించారు. ప్రశాంత్ లాడ్‌కు ఎన్నికల అధికారి ముంబై కలెక్టర్ ఎ. శైలా అధికార పత్రాన్ని అందజేశారు. అదే విధంగా వికాస్ గాడి మాజీ మేయర్ విలాస్ పాటిల్, సంతోష్ ఎం. శెట్టి. బీజేపీ పడమర ఎమ్మెల్యే మహేష్ చౌగులే, నిలేష్ చౌదరి కార్పొరేషన్ అధికారులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు.