breaking news
Post cards Movement
-
ఉద్యోగాలు సాధించేదాకా ఉద్యమం ఆపేది లేదు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల సమస్య పరిష్కారమయ్యేదాకా వెనుదిరిగేది లేదని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. తెలంగాణ జేఏసీ నిర్వహిస్తున్న నిరుద్యోగుల పోస్టుకార్డుల ఉద్యమంలో శుక్రవారం ఆయన పాల్గొన్నారు. హైదరాబాద్ జేఏసీ నిర్వహించిన ఈ ఉద్యమంలో మాట్లాడుతూ.. నిరుద్యోగ సమస్యల పరిష్కారం కోసం సభకు, ర్యాలీకి ప్రభుత్వం అనుమతించకుండా నిర్బంధం విధించిం దన్నారు. ఎన్ని నిర్బంధాలు విధించినా నిరుద్యోగుల పక్షాన పోరాడి తీరుతామన్నారు. నిరుద్యోగ సమస్యపై రౌండ్‌టేబుల్, అఖిలపక్ష భేటీలు నిర్వహించామని, ఇప్పుడు పోస్టుకార్డుల ఉద్యమం సాగుతోందన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలి.. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను ప్రకటించాలని, కేలండర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో స్థానికులకు రిజర్వేషన్లు కల్పించాలని, నిరుద్యోగులకు భృతిఇవ్వా ల న్నారు. ఈ డిమాండ్ల పరిష్కారానికి విద్యార్థులు, నిరుద్యోగులను సమీకరించి పోరాడుతామన్నారు. పోటీ పరీక్షల కోసం ప్రభుత్వమే కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలన్నారు. గ్రంథాలయాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం నుంచి సానుకూల ప్రకటన రాకుంటే ఉద్య మం తప్పదని హెచ్చరించారు. ఉద్యోగం గాని, లేదా నిరుద్యోగ భృతి గాని ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకుంటే తీవ్రమైన పోరా టాలకు ప్రభుత్వం సిద్ధం కావాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జేఏసీ అధ్యక్షుడు మాదు సత్యంగౌడ్, జేఏసీ నేతలు గోపాలశర్మ, భైరి రమేశ్, నిజ్జన రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు. సమావేశం ముగిశాక ఎర్రమంజిల్‌లోని పోస్టుడబ్బాలో స్వయంగా రాసిన పోస్టుకార్డును సీఎం కేసీఆర్‌కు కోదండరాం పోస్టు చేశారు. -
రేపట్నుంచి జిల్లా కోర్టుల్లో విధుల బహిష్కరణ!
హైదరాబాద్: రేపటి నుంచి జిల్లా కోర్టుల్లో విధులు బహిష్కరించాలని సోమవారం తెలంగాణ న్యాయవాదుల జేఏసీ తీర్మానించింది. మొత్తం నాలుగు రోజుల పాటు ఉద్యమ కార్యాచరణను న్యాయవాదుల జేఏసీ ప్రకటించింది. ఈ నెల 14న అన్ని కోర్టుల బహిష్కరణ,రిలే నిరాహారదీక్షలు, ఆందోళనలు కొనసాగించాలని తెలంగాణ న్యాయవాదులు తీర్మానించారు. అదేవిధంగా 15న మౌన ప్రదర్శన, 16న వంటావార్పు, 17న పోస్ట్ కార్డుల ఉద్యమం, 18న మరోసారి కార్యాచరణ ప్రకటిస్తామని న్యాయవాదుల జేఏసీ వెల్లడించింది. -
విభజనకు వ్యతిరేకంగా పోస్టుకార్డుల ఉద్యమం
కడప: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ జిల్లాలో పోస్టు కార్డుల ఉద్యమం చేపట్టారు. రాజంపేటలో వైఎస్ఆర్ సిపి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఉద్యమానికి ఎమ్మెల్యేలు అమర్నాథ రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. వైఎస్ఆర్ సిపి నేతలు సమైక్యాంధ్ర ఉద్యమంలో చురుకుగా పాల్గొంటున్న విషయం తెలిసిందే. యుపిఏ చైర్పర్సన్ సోనియా గాంధీకి కనువిప్పు కలిగేలా ప్రతి ఒక్కరూ పోస్టుకార్డు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.