breaking news
Petro
-
ఇక కొలంబియా వంతు!
వాషింగ్టన్: లాటిన్ అమెరికాలో దుమారం రేపేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయించుకున్నట్టు కన్పిస్తోంది. ‘తర్వాత నీ వంతే కావచ్చు, జాగ్రత్త!’ అని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రోకు ట్రంప్ ఓ బూతు మాట ప్రయోగించి మరీ వార్నింగ్ ఇచ్చారు. ఆదివారం ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ‘‘గుస్తావో పెట్రో విచ్చలవిడిగా కొకైన్ తయారు చేయిస్తున్నారు. దాన్ని నేరుగా అమెరికాలోకి తరలిస్తున్నారు. కాబట్టి ఆయన కూడా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం వచ్చింది’’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ అంతటితో ఆగలేదు. మెక్సికో, క్యూబా దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. అవి కూడా విచ్చలవిడిగా మాదకద్రవ్యాలు తయారు చేస్తూ అమెరికాలోకి సరఫరా చేస్తున్నాయంటూ మండిపడ్డారు. ‘‘ పలు నేరగాళ్ల ముఠాలకూ ఆ దేశాలు ఆశ్రయమిస్తున్నాయి. తీరు మార్చుకోకుంటే వాటికీ వెనిజువెలా గతే పడుతుంది’’ అంటూ అల్టిమేటమిచ్చారు. అవసరమైతే ఆ దేశాల్లోని డ్రగ్ ల్యాబ్స్‌పై దాడులకు వెనుకడుగు వేయబోనని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికా ఖండాల్లో తమ దేశ ఆధిపత్యాన్ని ఎవరూ వేలెత్తి చూపేందుకు కూడా వీల్లేకుండా చేస్తామన్నారు. ‘‘మా చుట్టూ మంచి మిత్రులుండాలి. స్థిరత్వం, శక్తియుక్తులుండాలి. వెనిజువెలాలో అమితమైన శక్తిసామర్థ్యాలున్నాయి. వాటిని కాపాడాల్సిన అవసరముంది. మా ప్రయోజనాలు తీరాలంటే అవి కావాలి’’ అంటూ కుండబద్దలు కొట్టారు. వెనెజువెలాలో మా సైన్యం..వెనిజువెలా చమురు కంపెనీలపై తమ నిషేధం ఇకపై కూడా కొనసాగుతుందని ట్రంప్ తెలిపారు. ‘‘వెనిజువెలాలో మా సైనిక మోహరింపులు కొనసాగుతాయి. అక్కడ మా డిమాండ్లు పూర్తిగా నెరవేరేదాకా, మేం పూర్తిగా సంతృప్తి చెందేదాకా అక్కణ్నుంచి వైదొలగేదే లేదు’’ అని స్పష్టం చేశారు.సైన్యంతో మేం సిద్ధం: పెట్రోట్రంప్ బెదిరింపులపై కొలంబియా అధ్యక్షుడు పెట్రో తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యలను లాటిన్ అమెరికా సార్వభౌమత్వంపైనే దాడిగా ఆయన అభివర్ణించారు. ‘‘ఇది కచ్చితంగా మానవతా సంక్షోభానికి దారి తీయగల పరిణామం. ట్రంప్ తీరు చూసి మేమిప్పటికే అప్రమత్తమయ్యాం. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు వెనిజువెలా సరిహద్దుల్లో సైన్యాన్ని మోహరిస్తున్నాం’’ అని ఆయన ప్రకటించారు. మదురోకు పెట్రో అత్యంత సన్నిహితుడు.క్యూబా పని పడతాంరూబియో సంకేతంవెనిజువెలా తర్వాత ఇక క్యూబాయే తమ లక్ష్యం కావచ్చని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంకేతాలిచ్చారు. ‘నేనే గనక క్యూబా ప్రభుత్వంలో ఉంటే, ఆ దేశ రాజధాని హవానాలో నివసిస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతో కొంత ఆందోళన చెంది తీరతా’ అంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో అమెరికా మరో సార్వభౌమ దేశంపై సైనిక చర్యకు దిగనుందన్న అనుమా నాలు బలపడుతున్నాయి. మెక్సికోకు ట్రంప్ శనివారం హెచ్చరికలు జారీ చేయడం తెలిసిందే. ‘‘మెక్సికో విషయంలో కూడా ఏదో ఒకటి చేయాల్సిందే. అధ్యక్షురాలు క్లాడియా షేన్బాం మంచి వ్యక్తే. కానీ దేశాన్ని ఆమె పాలించడం లేదు. డ్రగ్ ముఠాలే నడుపుతున్నాయి’’ అని ఆరోపించారు. -
ధరల స్పీడ్ కట్టడికి కేంద్రం చర్యలు దోహదం
ముంబై: పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గింపు నిర్ణయం ద్రవ్యోల్బణం కట్టడి విషయంలో సానుకూల అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఆహార ద్రవ్యోల్బణం ప్రస్తుతం కట్టడిలోనే ఉన్నప్పటికీ, మొత్తంగా అన్ని విభాగాలూ చూస్తే, ద్రవ్యోల్బణం పెరుగుదల కనబడుతోందని ఆయన అన్నారు. అయితే సరఫరాల సమస్య భారత్‌లో ద్రవ్యోల్బణం తీవ్రతకు కారణమని వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. పప్పు దినుసులు, వంట నూనెల వంటి నిత్యావసరాల విషయంలో సరఫరాల సమస్యలను తొలగించంతోపాటు, పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం ఇటీవల తగ్గించడం ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. ద్రవ్యోల్బణం కదలికలను ఆర్బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తోందని పేర్కొన్నారు. బిజినెస్ స్టాండర్డ్ నిర్వహించిన బీఎఫ్ఎస్ఐ సదస్సులో ఆయన ఈ మేరకు ఒక కీలక ప్రసంగం చేశారు. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలుచేసే వడ్డీరేటు– రెపో (ప్రస్తుతం 4 శాతం) నిర్ణయానికి కీలకమైన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం మధ్య ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తోంది. రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా ఉంటుందన్నది ఆర్బీఐ అంచనా. దీనివల్ల సామాన్యునిపై ధరల భారం తీవ్రత తగ్గుతుంది. దీనికితోడు తక్కువ స్థాయిలో వడ్డీరేట్లు కొనసాగడం వల్ల వ్యవస్థలో వినియోగం పెరుగుదలకు, డిమాండ్ పునరుద్ధర ణకు దోహదపడుతుంది. ఇక రిటైల్ ద్రవ్యోల్బణం రెండు, మూడు, నాలుగు త్రైమాసికాల్లో వరుసగా 5.1 శాతం, 4.5 శాతం, 5.8 శాతంగా నమోదవుతుందన్నది ఆర్బీఐ అంచనా. 2022–23 క్యూ1లో 5.2 శాతం నమోదవుతుందని భావిస్తోంది. క్రిప్టో కరెన్సీలపై ఆందోళన బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీలపై గవర్నర్ మరోసారి తన ‘‘తీవ్ర ఆందోళన’’ను వ్యక్తం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వం కోణంలో పరిశీలిస్తే, రెగ్యులేటర్‌గా తమకు క్రిప్టో కరెన్సీలపై ఆందోళన ఉందని వివరించారు. క్రిప్టో మార్కెట్లో పాల్గొనే వారి సంఖ్యను భారీగా పెంచి చూపిస్తున్నారని ఆయన ఈ సందర్భంగా అన్నారు. అయితే పరిమాణం పరంగా సంఖ్య పెరుగుతోందని మాత్రం అంగీకరించారు. క్రిప్టో మార్కెట్లో ఎక్కువ మంది పెట్టుబడిదారులు రూ. 1,000 లేదా రూ. 2,000 వంటి కనీస మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టారని గవర్నర్ తెలిపారు. క్రిప్టోకరెన్సీలపై కేంద్ర ప్రభుత్వానికి ఆర్బీఐ సవివరమైన నివేదికను సమర్పించిందని, ఇది ప్రభుత్వ క్రియాశీల పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. క్రిప్టో ఇండస్ట్రీని రెగ్యులేట్ చేయాలని ప్రభుత్వ నిర్ణయించినట్లయితే, ఆ విధులను ఆర్బీఐ నిర్వహి స్తుందా? అన్న ప్రశ్నపై వ్యాఖ్యానించడానికి గవర్నర్ నిరాకరించారు. ఈ ఏడాది మేల్లో కూడా దాస్ క్రిప్టో కరెన్సీ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ద్రవ్య స్థిరత్వానికి ప్రతికూలమని పేర్కొన్నారు. ప్రభుత్వం, ఆర్బీఐ ఫైనాన్షియల్ స్థిరత్వానికి కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. క్రిప్టో కరెన్సీని నిబంధనలతో అనుమతించాలని కేంద్రం భావిస్తోందని వార్తలు వస్తున్నాయి. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న శీతాకాల సమావేశాల్లోనే బిల్లు పెట్టడానికి కసరత్తు జరుగు తోందని ఈ వార్తల కథనం. ఈ నేపథ్యంలో క్రిప్టో కరెన్సీలపై దాస్ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యత నెలకొంది. -
బీజేపీ నేతలు నీతులు చెప్పడం విడ్డూరం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో అమలవుతున్నాయని రాష్ట్ర సమాచారశాఖ మంత్రి పేర్ని నాని అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఆంధ్రప్రదేశ్ ఆదర్శంగా నిలుస్తోందన్నారు. రాకెట్ కంటే వేగంగా పెట్రోల్, డీజీల్ ధరలను కేంద్రం పెంచుతోందన్నారు. బీజేపీ నేతలు తమకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రజలపై జాలి, దయ లేకుండా ధరలు పెంచుతున్నారు. రూ.70 పెట్రోల్‌ను రూ.110కి తీసుకెళ్లారు. ఇప్పుడు 5 రూపాయలు తగ్గించి గొప్పలు చెబుతున్నారని మంత్రి మండిపడ్డారు. చదవండి: అలాంటి ఫలితాలే రానున్నాయి: కాసు మహేష్‌రెడ్డి అక్టోబర్‌లో ధర ఎంత ఉంది? నవంబర్‌లో ఎంత ఉంది. కేంద్రం చేస్తున్న దోపిడీ ప్రజలకు తెలియదా? బీజేపీ నేతలకు చిత్తశుద్ధి ఉంటే ఢిల్లీలో ధర్నా చేయాలి. రూ.5 కాదు రూ.25 తగ్గించాలని మోదీని డిమాండ్ చేయాలి. సెస్ రూపంలో కేంద్రం 2.85 లక్షల కోట్లు వసూలు చేసింది. బీజేపీ నేతలు ధర్నా చేస్తే నేను కూడా ఢిల్లీ వస్తా. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో కేంద్రం కళ్లు తెరిచింది. ప్రజలపై జాలితో 5 రూపాయలు తగ్గించారు. కేంద్రం వసూలు చేస్తున్న పన్నులు ఎలా ఖర్చు చేస్తున్నారు. ఏపీలో అమలవుతున్న కార్యక్రమాలు ఎక్కడైనా ఉన్నాయా. సంక్షేమ పథకాలపై ఏపీ చేస్తున్న వ్యయం మీకు కనిపించలేదా?. గ్యాస్ ధర ఎంత ఉండేది.? ఇప్పుడు ఎంత చేశారు.? అంటూ పేర్ని నాని ప్రశ్నించారు. చదవండి: Kuppam Municipality: కుప్పంలో టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి.. సీఎం జగన్ పాలనను ప్రజలు నిండు మనసుతో ఆశీర్వదిస్తున్నారు. వరుస ఎన్నికల్లో వస్తున్న ఫలితాలే ప్రజాదరణకు నిదర్శనం. ప్రభుత్వంపై బురదజల్లేందుకే టీడీపీ పరిమితమవుతోంది. బీజేపీ,టీడీపీల తప్పుడు విమర్శలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మంత్రి పేర్ని నాని అన్నారు. -
షాకింగ్: పెట్రోలు పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు
-
ఆదివారం పెట్రో డీలర్ల సమావేశం
మంగళగిరి రూరల్(గుంటూరు జిల్లా): గుంటూరు జిల్లా మంగళగిరి మండలం చినకాకానిలోని హాయ్‌ల్యాండ్‌లో ఆదివారం ఉదయం 10 గంటలకు రాష్ట్ర పెట్రోలియం డీలర్ల సంఘం సమావేశం నిర్వహించనున్నట్లు సంఘం అధ్యక్షుడు రావి గోపాలకృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పరిటాల సునీత పాల్గొంటారని పేర్కొన్నారు. -
పెట్రో ధరల పెంపుపై నిరసన
ఆదిలాబాద్ మున్సిపాలిటీ/మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ :పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ జిల్లాలో ఆదివారం నిరసనలు వెల్లువెత్తాయి. కేంద్ర ప్రభుత్వ తీరుపై నాయకులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ ఎదుట జాతీయ రహదారిపై సీపీఎం ఆధ్వర్యంలో కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ప్రభుత్వం చమురు సంస్థలకు తొత్తుగా వ్యవహరిస్తోందని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశా రు. లీటరు పెట్రోల్‌కు రూ.2.35 పైసలు, డీజిల్‌పై 50 పైసలు పెంచడం సరికాదని, ఈ నిర్ణయూన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లంక రాఘవులు డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డి.మల్లేశ్, డివిజన్ కార్యదర్శి పోశెట్టి, నాయకులు నరేశ్, కిరణ్, సచిన్ పాల్గొన్నారు. మంచిర్యాలలో.. మంచిర్యాల బస్టాండ్ కూడలిలో భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. పార్టీ రాష్ట్ర కో కన్వీనర్ కె.జయరావు మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ధరలను అదుపు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు. పదేపదే ధరలు పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తున్నారని మండిపడ్డారు. నాయకులు మధు, మల్లయ్య, ఇక్బాల్, దుర్గయ్య, మొహినోద్దీన్, రామస్వామి, శ్రీ కాంత్, శ్రీనివాస్, శివకుమార్, మొగిలియాదవ్ పాల్గొన్నారు.


