breaking news
peratasi month
-
తిరుమల: తగ్గిన భక్తుల రద్దీ.. దర్శనానికి 3 గంటలే!
సాక్షి, తిరుపతి: తిరుమలలో.. అదీ శనివారం(నేడు) భక్తుల రద్దీ బాగా తగ్గింది. క్యూ భక్తుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. దర్శనం కోసం నేరుగా భక్తుల్ని అనుమతిస్తుండగా.. కేవలం మూడు గంటల సమయం పడుతోంది. పెరటాసి మాసం.. పైగా మూడో శనివారం అయినప్పటికీ భక్తుల రద్దీ తగ్గిపోవడం గమనార్హం. ఇదిలా ఉంటే.. తిరుమలలో శ్రీవారిని శుక్రవారం దర్శించుకున్న భక్తుల సంఖ్య 72,104. తలనీలాలు 25,044 మంది సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.80 కోట్లుగా తేలింది. మరోవైపు ఈ నెల 9వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరగబోయే ఈ భేటీలో పలు కీలక అంశాలతో పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలపైనా చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు 14వ తేదీన అంకురార్పణ జరుగుతుంది. 15 నుంచి 23 వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. -
వైష్ణవ ఆలయాల్లో భక్తుల కిటకిట
వరదయ్యపాళెం : పెరటాశి నెల వుూడో శనివారం సందర్భంగా పలువైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. పెద్దపాండూరు కొత్తహరిజనవాడలోని శ్రీవెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు వుూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. శనివారం ఉదయం నుంచి ఆలయంలో ప్రధాన అర్చకులు నిరంజనాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి స్వామి అవ్మువారుల ఉత్సవవుూర్తులను గ్రావుంలోని పురవీధుల్లో ఊరేగింపు చేపట్టారు. అలాగే పెద్దపాండూరులోని కోదండరావూలయం,వరదయ్యపాళెంలోని ప్రసన వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఫోటో రైటప్: 01ఎస్టివిడి24: