breaking news
pedaavutapalli
-
పెదఅవుటపల్లి కాల్పుల కేసులో పురోగతి
-
పెదఅవుటపల్లి కాల్పుల కేసులో పురోగతి
విజయవాడ: కృష్ణా జిల్లా పెద అవుటపల్లి కాల్పుల కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో నలుగురు షూటర్లు, ముగ్గురు ప్రధాన నిందితును అరెస్ట్ చేశారు. వీరిని ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు. డీసీపీ ఇక్బాల్ ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీసుల సాయంతో కేసును ఛేదించారు. పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి మండలం పినకడిమి గ్రామానికి చెందిన గంధం నాగేశ్వరరావు, అతని కుమారులు గుంజుడు మారయ్య, పగిడి మారయ్యలను బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు కృష్ణా జిల్లా పెదఅవుటపల్లి గ్రామంలో జాతీయ రహదారిపై తుపాకులతో కాల్చిచంపారు. ఆరు నెలల క్రితం జరిగిన జేకే ప్యాలెస్ అధినేత భూతం దుర్గారావు హత్యకు ప్రతీకారంగానే ఈ ముగ్గురిని హతమార్చారని భావిస్తున్నారు.