breaking news
paying money
-
ముచ్చట్లు పెట్టుకుంటే మూడినట్లే
ముచ్చట్లన్నాక ముగింపు ఉండాలి, కానీ బెంగళూరు కేఫ్‌లలో కూర్చునే ‘జ్ఞానులకి’కాలజ్ఞానమే ఉండదు. కప్పు కాఫీ ఆర్డర్ ఇచ్చి, ఆ ఆవిరి ఆరిపోయేలోపే ప్రపంచ సమస్యలన్నీ పరిష్కరించేద్దామని ఫిక్స్ అయిపోతారు. స్టార్టప్ చర్చలకు, ఆఫీస్ మీటింగ్‌లకు అడ్డాగా మార్చేస్తారు. ఇలాంటి ‘మీటింగ్’రాయుళ్లకి చుక్కలు చూపిస్తూ ఒక కేఫ్ యజమాని అదిరిపోయే చెక్ పెట్టాడు. శోభిత్ బక్లీవాల్ అనే వ్యక్తి ‘ఎక్స్’లో ఈ నోటీసు ఫొటోను షేర్ చేశారు.నోటీసు సారాంశం ఏమనగా..‘మీటింగ్స్ నాట్ అలౌడ్..’.. అంటే ఇకపై అక్కడ ‘స్టార్టప్ ఐడియాల’గురించి తీవ్ర చర్చోపచర్చలు పెట్టుకోవడానికి వీల్లేదు. ఒకవేళ మీ ముచ్చట్లు గంట దాటితే.. నిమిషానికి ఒక లెక్క కాదు, ఏకంగా గంటకు రూ.1000 వదిలించుకోవలసిందే.. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా సెటైర్లు పేలుతున్నాయి. కేఫ్‌కి వెళ్లేది కాఫీ తాగడానికి కాదు, నెట్ ఫ్రీగా వస్తుందని ల్యాప్‌టాప్ ఓపెన్ చేసి ‘యూనికార్న్’కంపెనీలు పెట్టేయడానికి! గంటల తరబడి టేబుల్ ఆక్రమించేసి, పాపం యజమాని కళ్లల్లో నీళ్లు తెప్పిస్తుంటారు. రాజకీయాలు, సినిమాలు, ఆఫీస్ గాసిప్స్.. వీటన్నింటినీ ఒక చిన్న కాఫీ కప్పు సాక్షిగా గంటల తరబడి తెగ చర్చించేసుకోవడం వీరికి అలవాటు. ఇప్పుడు ఆ ముచ్చట్లు సాగాలంటే.. ముచ్చట తీరాలంటే.. వెయ్యి రూపాయలు వదలాల్సిందే.కప్పు కాఫీ.. కబుర్లు బోలెడుకొందరికైతే ఆ కేఫ్ టేబులే వాళ్ల ఆఫీస్ డెస్్క.. ఆర్డర్ ఇచ్చేది చిన్న సమోసా, కానీ బిల్డప్ మాత్రం బిల్‌గేట్స్ రేంజ్లో ఉంటుంది. దీనిపై నెటిజన్లు విపరీతంగా స్పందిస్తున్నారు. ‘గంటకు వెయ్యి అంటే.. ఆ బిల్లు చూశాక ముచ్చట్లు పెట్టుకునే వారికి గుండె ఆగిపోవడం ఖాయం!’.. అని ఒకరంటే.. ‘పాపం కేఫ్ యజమాని ఎంత కసి మీద ఉన్నాడో.. ఆ వెయ్యి రూపాయల చార్జి చూస్తేనే అర్థమవుతోంది!’.. అని ఇంకొకరు నవ్వుకున్నారు. మొత్తానికి, ఆ కేఫ్‌కి వెళ్లేవారు ఇకపై ‘వాచ్’చూసుకుంటూ ముచ్చట్లు పెట్టుకోవాలి. లేదంటే కాఫీ కంటే ఎక్కువ బిల్లు ముచ్చట్లకే కట్టాల్సి వస్తుంది సుమా.. -
బట్టలు ఫుల్.. బిల్లు నిల్..
విమానంలో వెంట తీసుకెళ్లే బ్యాగేజీ.. పరిమితికి మించి బరువుందని, అందుకు అదనపు రుసుము చెల్లించాలని ఎయిర్పోర్ట్ అధికారులు తేల్చిచెప్పారు. దీంతో.. ఫొటోలో భలేగా పోజిస్తున్న ఈ అమ్మాయికి వెంటనే ఓ ఐడియా తళుక్కున మెరిసింది. వెంటనే బరువుగా ఉన్న లగేజీ బ్యాగ్‌ను తెరచి అందులో ఉన్న తన డ్రెస్‌లు అన్నింటినీ ఒకదానిపై మరోటి తొడుక్కుంది. ఇలా దాదాపు మూడు కేజీల బరువున్న డ్రెస్‌లను అదనంగా వేసుకుంది. ఎయిర్పోర్ట్ అధికారులకు కట్టాల్సిన ‘అదనపు బరువు బిల్లు’ను తప్పించుకుంది. ఫిలిప్పీన్స్ దేశంలోని ఓ ఎయిర్‌పోర్ట్‌లో జరిగిందీ ఘటన. -
నష్టపోయిన 24 గంటల్లోనే పరిహారం..
మెదక్(సిద్దిపేట): వర్షాలతో నష్టపోయిన బాధితులకు 24 గంటల్లోనే పరిహారాన్ని అందిస్తున్నామని, ఏ ప్రభుత్వం చేయని తరహాలో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఇది ఒక రికార్డు అని మంత్రి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా సిద్దిపేట మండలం, పట్టణంలో కురిసిన వర్షానికి నష్టపోయిన బాధితులకు శనివారం రాత్రి సిద్దిపేటలో జరిగిన కార్యక్రమంలో రూ. 3,200 చొప్పున 48వేల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే తమ ధ్యేయమన్నారు. దళితుల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్నంగా దళిత కుటుంబాల్లో వివాహాలకు చేయూతనిచ్చేందుకు కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేల మందికి రూ.51వేల చొప్పున ఆర్థిక సహాయం అందించామన్నారు. దళిత లక్ష్మి పథకానికి నిర్ణీత పరిమితి, గడువు లేదని ఎంత మందికైనా, అర్హులు ఎక్కడున్నా పథకం అమలు చేస్తామన్నారు.


