breaking news
Paramourrelation ship
-
అక్రమ సంబంధం.. కుమార్తె హత్య
సాక్షి, బెంగళూరు : అక్రమ సంబంధం పెట్టుకున్న యువకుడిని పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశంతో రెండేళ్ల కుమార్తెను కర్కశంగా హత్య చేసిందో తల్లి. బెంగళూరులో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు చెబుతున్న వివరాలివి. బెంగళూరులోని అవడదెనహళ్లి ప్రాంతంలో నివసిస్తున్న నివేదితకు వివాహం మూడేళ్ల కిందట వివాహం జరిగింది. ఈ క్రమంలో వారికి రెండేళ్ల కిందట అన్నపూర్ణ అనే పాప కూడా పుట్టింది. సంసారం బాగా సాగుతున్న దశలో నివేదితకు సమీప బంధువు అయిన సతీష్‌తో పరిచయం ఏర్పడింది ఈ పరిచయం చనువుగా మారి.. ఆపై అక్రమసంబంధానికి దారి తీసింది. అక్రమ సంబంధాన్ని సక్రమంగా మార్చుకోవాలన్న ఆలోచనతో ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే భర్త విడాకులు ఇవ్వడన్న కారణంతో.. ఇద్దరూ ఎక్కడికైనా వెళ్లిపోవాలని అనుకున్నారు. ఇందుకు రెండేళ్ల కుమార్తెను అడ్డుగా వస్తోందని ఇద్దరూ భావించారు. ఈ నేపథ్యంలో చిన్నారిని హత్య చేసి అడ్డు తొలగించుకోవాలని నివేదిత, సతీష్ భావించారు. అనుకోకుండా.. రెండు రోజుల కిందట అనారోగ్యంతో రెండేళ్ల అన్నపూర్ణను తండ్రి ఆసుపత్రిలో చేర్చారు. ఈ పరిస్థితిని అనుకూలంగా మార్చుకుని.. ఎవరూ లేని సమయంలో చిన్నారిని ఆసుపత్రిని బయటకు తీసుకెళ్లి.. నివేదిత, ఆమె ప్రియుడు హత్య చేశారు. కుటుంబ సభ్యులతో మాత్రం చిన్నారిని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పారు. దీనిపై అన్నపూర్ణ తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా.. నిందితులను గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని తమ శైలిలో విచారణ చేయగా నిజాలు అన్నీ చెప్పారు. -
అడ్డు తొలగించుకునేందుకే హత్య
► వివాహేతర సంబంధమేకారణం ► ఇద్దరు నిందితుల అరెస్టు ► 8 రోజుల్లో కేసును ఛేదించిన పోలీసులు కోస్గి(కరీంనగర్) : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ఓ యువకుడిని ఇద్దరు వ్యక్తులు కలిసి చంపేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఎట్టకేలకు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాం డ్కు తరలించారు. ఈ వివరాలను సోమవారం కోస్గి పోలీస్‌స్టేషన్‌లో కొడంగల్ సీఐ విశ్వప్రసాద్ వెల్లడించారు. బొంరాస్‌పేట మండలం దుద్యాలకు చెందిన సురేష్ (32)కు ముగ్గురు భార్యలు. కాగా మొదటి ఇద్దరితో తెగతెంపులు చేసుకుని రంగారెడ్డి జిల్లా యాలాల మండలం జక్కపల్లికి చెందిన బసంతను మూడో పెళ్లి చేసుకున్నాడు. ఈమెకు అదే మండలం సంగెం వాసి రవీందర్‌తో వివాహేతర సంబంధం ఉండేది. భర్తకు ఈ విషయం తెలిసినప్పటికీ అతడితో స్నేహం కొనసాగించాడు. నెల రోజుల క్రితం బసంత కాన్పు కోసం స్వగ్రామానికి వెళ్లింది. ఈ నేపథ్యంలో తన బైక్‌ను ఫైనాన్స్ వారు తీసుకెళ్లారని, రూ.25 వేలు కావాలని రవీందర్‌కు ఫోన్ చేశా డు. డబ్బులు లేవని చెప్పడంతో వివాహేతర సంబంధం ప్రస్తావిస్తూ భార్యను వదిలిపెడతానని, కేసు పెడతానని బెదిరింపులకు దిగాడు. దీంతో ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి అదే గ్రామానికి చెందిన బాబాయి హన్మంతు తో కలిసి రవీందర్ పథకం పన్నాడు. ఇందులోభాగంగానే గత నెల 26 వ తేదీ రాత్రి 11 గంట లకు ఫోన్ చేసి రప్పించి బైక్‌పై ఎక్కించుకుని కోస్గికి వచ్చి మద్యం తాగి తోగాపూర్ సమీపంలోకి తీసుకెళ్లి గొడవకు దిగారు. మాటామాట పెరగడంతో కర్రలతో తీవ్రంగా కొట్టి చంపేసి పారిపోయారు. తీగలాగితే డొంక కదిలింది ఇలా... మరుసటిరోజు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సంఘటన స్థలంలో దొరికిన సెల్‌ఫోన్, మద్యం బాటిల్, ధ్వంసమైన బైక్ ఆధారంగా ఎనిమిది రోజుల్లోనే మిస్టరీ ఛేదించారు. సురేష్ సెల్ ఫోన్లో నంబర్ల ఆధారంగా విచారణ జరిపి చివరకు ఇద్దరు నిందితులను సోమవారం పట్టుకున్నారు. ఎస్ఐ మల్లారెడ్డి, కానిస్టేబుళ్లు రాజునాయక్, శ్రీనివాస్, చంద్రశేఖర్‌లను సీఐ అభినందించారు.