parakala prabakar
-
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
పరకాలకు చెవిరెడ్డి సవాల్!
తిరుపతి: ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కిరాయి మనిషని వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర రెడ్డి విమర్శించారు. భార్య పేరు చెప్పుకొని పదవి పొందారన్నారు. గతంలో చంద్రబాబుపై చేసిన ఆరోపణలకు ఇప్పుడు పరకాల కట్టుబడి ఉన్నారా? అని అడిగారు. డబ్బు కోసం పాలకొల్లులో ఒక వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసులో పరకాల జైలుకు వెళ్లారన్నారు. వైఎస్ఆర్ సిపిని ఎదుర్కోలేక పరకాల శిఖండిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తన తండ్రి వృద్ధాప్య పింఛన్‌పై బహిరంగ చర్చకు పరకాల సిద్ధమేనా? అని చెవిరెడ్డి సవాల్ విసిరారు. తన తండ్రి పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు ఆధారాలు ఉన్నాయా? అని అడిగారు. తన తండ్రి ఎక్కడైనా ఒక రూపాయి పెన్షన్ తీసుకున్నట్లు చెప్పగలరా? అని అడిగారు. తన తండ్రికి పెన్షన్ మంజూరులో ఆయన ప్రమేయంలేదని సంబంధిత అధికారులు రాతపూర్వకంగా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది ఖచ్చితంగా తన తండ్రి పేరుతో సృష్టించిన దొంగ కార్డని ఆయన అన్నారు. ఇవన్నీ చంద్రబాబు సొంత నియోజకవర్గం నుంచి గెలిచినందువల్ల ఈర్ష్య, అసూయలతో చేస్తున్న కుట్రలు, కుతంత్రాలే అన్నారు. తాను పోరాటాల ద్వారా రాజకీయంగా ఎదిగానని చెప్పారు. పరకాల ప్రభాకర్లాగా పైరవీలతో రాజకీయాలు చేసేవాడిని కాదని చెవిరెడ్డి చెప్పారు. ** -
67 లక్షల మందికి రేషన్ కట్: పరకాల
హైదరాబాద్: ఏపీలో 67 లక్షల మంది తెల్లకార్డుదారులకు రేషన్ నిలిపేస్తున్నట్లు ప్రభుత్వ సలహా దారు పరకాల ప్రభాకర్ బుధవారం ప్రకటించారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్‌కార్డుల్ని ఆధార్‌తో సరిపోల్చి చూసే ప్రక్రియ 98 శాతం వరకు పూర్తయిందని, ఫోటోలు, చిరునామాలు సరిపోలక 67 లక్షల తెల్లకార్డులు తిరస్కరణకు గురైనట్లు చెప్పారు. ప్రజా పంపిణీ వ్యవస్థలో ముఖ్యమైన సంస్కరణలు తెచ్చేందుకు చంద్రబాబునాయుడు సర్కారు నిర్ణయించిందని తెలిపారు. దీన్లో భాగంగా పారదర్శకత కోసం, బోగస్, దుబారా అరికట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 27,176 ఈ-పాస్ మిషన్లు కొనుగోలు చేసినట్లు చెప్పారు. రెండు నెలల్లో ఈ మిషన్ల ద్వారా ఈ-పాస్ కార్డులు జారీ చేసి రేషన్ సరుకులు అందించనున్నట్లు వివరించారు. ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని.. సమర్ధిస్తున్నారా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తండ్రి సుబ్రహ్మణ్యం రెడ్డి పేరిట తెల్ల రేషన్‌కార్డు (ఏపీ 102600500742) ఉందని, పింఛను కూడా పొందడాన్ని తనిఖీ సభ్యులు గుర్తించారని పరకాల ప్రభా కర్ అన్నారు. ఆర్ధికంగా స్థితిమంతుడైన ఎమ్మెల్యే తండ్రి పింఛను పొందడాన్ని ప్రతిపక్ష నేత సమర్ధిస్తారా? అని పరకాల ప్రశ్నించారు.


