ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే! | Parakala Prabhakar Again Raise Doubts On AP 2024 Election Polling | Sakshi
Sakshi News home page

ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!

May 2 2026 1:58 PM | Updated on May 2 2026 2:28 PM

Parakala Prabhakar Again Raise Doubts On AP 2024 Election Polling

సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 

2024లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..

సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్‌ అన్నారు. 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement