breaking news
padagaya temple
-
పిఠాపురం జనసేనలో ‘కోడ్ చిచ్చు’
కాకినాడ, సాక్షి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Pawan Kalyan) ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల కోడ్ రచ్చ.. జనసేన పార్టీలో చిచ్చు రాజేసింది. స్థానిక జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్‌ను వేదిక మీదకు సిబ్బంది అనుమతించకపోవడంతో మొదలైన గొడవ.. అప్పటికే వేదిక మీద ఉన్న జనసేన కోఆర్డినేటర్ వైశాలి వివరణతో మరింత ముదిరింది. పాదగయ క్షేత్రంలో(Pada Gaya Temple) సోమవారం రాత్రి కుక్కటేశ్వర స్వామివారి దివ్యకల్యాణం జరిగింది. ఈవో జగన్మోహన్ ఆహ్వానం మేరకు జనసేన నేత మర్రెడ్డి శ్రీనివాస్ సతీసమేతంగా ఆలయానికి వచ్చారు. అప్పటికే కల్యాణ వేదికపై ఈవో దంపతులు కూర్చుని ఉన్నారు. అయితే మర్రెడ్డి దంపతులు స్టేజ్ ఎక్కబోతుండగా.. ఆలయ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉందని, కాబట్టి వేదిక ఎక్కేందుకు అనుమతించమని చెప్పారు. దీంతో ఆయన వర్గీయులు ఆలయంలో ఆందోళనకు దిగారు.ఈవో భార్య వైశాలి(EO Wife Vishali) స్థానిక జనసేన పార్టీ కోఆర్డినేటర్. దీంతో ఆమెను ఎలా కూర్చోనిచ్చారంటూ జనసేన నేతలు ఆలయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. అయితే తాను పార్టీపరంగా కాకుండా.. ఈవో భార్యగానే వేదిక మీద ఉన్నానంటూ ఆమె చెప్పారు. దీంతో ఆ వివాదం మరింత ముదిరింది. ఆ గొడవ జరుగుతుండగానే.. ఈవో దంపతులు లేచి స్వామివారి కల్యాణం మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో.. అపచారం జరిగిందంటూ భక్తులు చర్చించుకున్నారు. మరోవైపు మర్రెడ్డి దంపతులను ఆలయ సిబ్బంది అవమానించారంటూ కాసేపు హల్చల్ చేసి.. కాసేపు అయ్యాక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం జరిగింది. కుక్కుటేశ్వర స్వామి ప్రసాదంలో పురుగులు దర్శనమిచ్చాయి. పులిహోరాలో పురుగులు దర్శనమివ్వడంతో భక్తుడు షాక్ అయ్యారు. ప్రసాదంలో కనిపించిన పురుగులపై దేవస్ధానం అధికారులను భక్తులు నిలదీశారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో పాదగయాలో నాసిరకం వస్తువులతో ప్రసాదం తయారీ అవుతోంది.కాగా.. గత నెలలో హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసిన సంగతి తెలిసిందే. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం
కాకినాడ, సాక్షి: కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రంలో అపచారం చోటుచేసుకుంది. హోమగుండంలో స్వామివారు, అమ్మవార్ల ఫోటోలతో ముద్రించిన రసీదు పుస్తకాలు, విలువైన పత్రాలను సిబ్బంది దహనం చేసింది. తైల ద్రవ్యాలు వేయాల్సిన హోమ గుండంలో రసీదు పుస్తకాలు వేయడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్తీక పూజలు సందర్భంగా హోమ గుండాల్లో ప్రత్యేక హోమాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ ఘటనపై శాఖపరమైన విచారణకు ఆలయ ఈవో చర్యలు తీసుకున్నారు. సనాతన ధర్మం కోసం మాట్లాడుతున్న డీప్యూటీ పవన్ కల్యాణ్ నియోజకవర్గంలోని ఆలయంలో ఇలాంటి అపచారాలు జరగడంపై భక్తుల విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
పూజా సామగ్రిలో సగం వస్తువులు బి చివాట్లు పెట్టిన మహిళలు
-
పాదగయ క్షేత్రంలో ప్రహరీను కూల్చిన ఆధికారులు
-
పాదగయలో చిరంజీవి భార్య
పిఠాపురం : ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి భార్య సురేఖ తదితరులు బుధవారం పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని దర్శించుకున్నారు. వారికి ఈఓ చందక దారబాబు, సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. వారు శ్రీకుక్కుటేశ్వరస్వామిని, శ్రీపురుహూతికాఅమ్మవారిని, శ్రీరాజరాజేశ్వరీదేవిని, దత్తాత్రేయస్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. సురేఖ తదితరులు ద్రాక్షారామలో భీమేశ్వరస్వామిని కూడా దర్శించుకున్నారు. ఈ బృందంలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వంగా గీత, ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరరావు భార్య తదితరులున్నారు.