breaking news
OUJAC
-
స్వామిగౌడ్ ను అడ్డుకున్న ఓయూ జేఏసీ
హైదరాబాద్: కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయొద్దని ఆందోళన వ్యక్తం చేస్తూ తెలంగాణ మండలి చైర్మన్ స్వామిగౌడ్ ను ఓయూజేఏసీ అడ్డుకుంది. పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీలో జరిగిన ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల విద్యా సదస్సుకు మండలి చైర్మన్ స్వామిగౌడ్, కోదండరాం, దేవీప్రసాద్, విఠల్ లు హాజరయ్యారు. ఈ సమావేశానికి నేతలు హాజరవుతున్నారని తెలుసుకున్న ఓయూ విద్యార్ధులు గేట్ వద్ద ఆందోళన చేపట్టారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయవద్దని నిరసన వ్యక్తం చేశారు. దాంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది. ఆందోళన చేపట్టిన ఓయూ విద్యార్థులను పోలీసులు చెదరగొట్టారు. -
'జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు అడ్డుకుంటాం'
హైదరాబాద్: సమైక్యాంధ్ర కోసం తెలుగుదేశం పార్టీ నేత నందమూరి హరి కృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన నేపధ్యంలో అతని కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమాలను తెలంగాణలో ఆడనివ్వం అని ఓయు విద్యార్థి జెఎసి హెచ్చరించింది. జూనియర్ ఎన్టీఆర్ సమైక్యావాదో, తెలంగాణవాదో స్పష్టం చేయాలని జెఎసి డిమాండ్ చేసింది. తన తండ్రి రాజీనామా వ్యవహారం జూనియర్ ఎన్టీఆర్ మెడకు చుట్టుకుంది. జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'రామయ్య వస్తావయ్యా' చిత్రం త్వరలో విడుదల కానున్న విషయం తెలిసిందే.