గోదావరిలో పడి ఇసుక కార్మికుడి మృతి
కొవ్వూరు : గోదావరిలో ఇసుక సేకరణకు పడవపై పనిచేసే ఓ వ్యక్తి పడవ చెక్క విరిగిపోవడంతో నదిలో పడిపోయాడు. దీంతో అతను మృతిచెందాడు. ఈ ఘటన ఔరంగాబాద్ ర్యాంపులో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. విజ్జేశ్వరం గ్రామానికి చెందిన బొంబోతుల త్రిముర్తులు(33) ఇసుక సేకరణకు తోటి కూలీలతో కలిసి శుక్రవారం పడవపై వెళ్లాడు. ప్రమాదవశాత్తు పడవ చెక్క విరిగిపోవడంతో నదిలో పడిపోయాడు. సహకార్మికులు అతడిని వెలికితీసి కొవ్వూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. పట్టణ ఎసై ్స ఎస్.ఎస్.ఎస్.పవన్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.