breaking news
optical
-
అనంతపురంలో ‘పచ్చ’ రౌడీల బీభత్సం..
అనంతపురం: నగరం నడిబొడ్డున ఓ మైనార్టీ కుటుంబానికి చెందిన దుకాణంపై ‘పచ్చ’ రౌడీలు దాడికి తెగబడ్డారు. పదుల సంఖ్యలో చేరుకుని గంటకు పైగా హల్చల్ చేశారు. దుకాణంలో పని చేస్తున్న వారిని చితక బాదారు. వారు ప్రాణాలు అరచేత పట్టుకుని పరుగులు తీయగానే వెంట తెచ్చుకున్న తాళాలను దుకాణం నాలుగు షట్టర్లకు వేశారు. గట్టిగా కేకలు వేస్తూ వారు చేస్తున్న అరాచకం చూసి స్థానికులు హడలిపోయారు. ఇంత జరుగుతున్నా ఒక్క పోలీసు కూడా ఘటనా స్థలానికి చేరుకోకపోవడం గమనార్హం.సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా ఆప్టికల్ షాపు స్థలానికి సంబంధించి వివాదం కొంతకాలంగా నడుస్తోంది. ఈ విషయంపై సబ్ రిజిస్ట్రార్ రమణరావు తమకు అన్యాయం చేశారని, అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అతని బంధువు పేరును ప్రస్తావిస్తున్నారని ఇటీవల మీడియా ఎదుట బాధితురాలు బొనాల సుమయ వెల్లడించారు. ఈ క్రమంలోనే శనివారం దీనిపై విచారించాలని చెప్పడంతో డీఎస్పీ కార్యాలయానికి సుమయ దంపతులు వెళ్లారు. పోలీసులతో మాట్లాడిన అనంతరం సాయినగర్‌లోని దుకాణం వద్దకు చేరుకున్న వారు... కొద్దిసేపటి తర్వాత దుకాణం మూసివేసి ఇళ్లకు వెళ్లాలని తమ వద్ద పనిచేస్తున్న వారితో చెప్పి ఇంటికి వెళ్లారు.దుకాణం వద్ద అరాచకం..సుమయ దంపతులు ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే 30 మందికి పైగా ‘పచ్చ’ రౌడీలు సాయినగర్ 6వ క్రాస్‌లోని అస్రా దుకాణం వద్దకు చేరుకుని అరాచకం చేశారు. గట్టిగా కేకలు వేస్తూ భయోత్పాతం సృష్టించారు. దుకాణంలో పని చేస్తున్న కార్మికులపై దాడికి తెగబడ్డారు. వారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని పరుగు తీయగా.. దుకాణానికి తాళాలు వేసి వెళ్లిపోయారు. అనంతరం సుమయ భర్తకు ఫోన్ చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ‘ఎమ్మెల్యే పేరు ఎలా చెబుతావురా.. నా కొడకా’ అంటూ అసభ్యంగా దూషించారు.శనివారం రాత్రి పలువురు మైనార్టీలతో కలిసి బాధితులు సాయినగర్‌లోని తమ షాపు వద్దకు చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ఇంత దారుణమైన ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదన్నారు. జిల్లా కేంద్రంలో మెయిన్ సెంటర్లో ఉన్న దుకాణం వద్ద ఇంత అరాచకం సృష్టిస్తే ఒక్క పోలీసు కూడా రాలేదన్నారు. గుంటూరు ప్రవీణ్, బుక్కచెర్లకు చెందిన బెంచి లక్ష్మీనారాయణరెడ్డి అనే వ్యక్తులు తమకు పదులసార్లు ఫోన్లు చేసి ఇష్టారాజ్యంగా మాట్లాడారని వాపోయారు.తమకు వీరి నుంచి ప్రాణహాని ఉందన్నారు. తమ వద్ద పనిచేసే అమాయకులపై దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు జోక్యం చేసుకుని రక్షణ కల్పించాలని కోరారు. ఇదంతా చూస్తుంటే తాము బతికుండి చనిపోయినట్లుగా ఉందన్నారు. దుకాణంలో తాము ఉండి ఉంటే తమ ప్రాణాలు తీసేవారే కదా అని బోనాల సుమయ కన్నీళ్లు పెట్టుకున్నారు.దుండగులను తక్షణమే అరెస్టు చేయాలి..బాధితులకు మద్దతుగా నగరానికి చెందిన మైనార్టీలు సాయినగర్‌కు చేరుకున్నారు. వారు విలేకరులతో మాట్లాడుతూ తీవ్రస్థాయిలో స్పందించారు. గంటకు పైగా బహిరంగంగా దాడి చేస్తే పోలీసులకు కనపడలేదా అని ప్రశ్నించారు. దాడికి పాల్పడిన వారిని శిక్షించేంత వరకు మైనార్టీలంతా ఏకమై ఉద్యమిస్తామని తెలిపారు. నగరంలో శాంతిభద్రతలు ఉన్నాయా అని ప్రశ్నించారు. తక్షణం దుండగులను అరెస్టు చేయకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. -
నలుగురితో కలిసే వ్యక్తా కాదా? ఇట్టే చెప్పేయొచ్చు ఇలా..!
ఒకే చిత్రాన్ని ఒక్కో వ్యక్తి ఒక్కో దృష్టితో చూస్తాడట. అందరికి ఆ చిత్రం ఒకేలా అనిపించదు. చెప్పాలంటే అందరికీ ఒకటే ఎలా నచ్చదో అలానే మన దృష్టి కోణాల్లో కూడా చాలా భేదాలు ఉంటాయట. అవే మన భావోద్వేగ స్థితిని, ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తాయని చెబుతున్నారు మానసిక నిపుణులు. శాస్త్రీయంగా ఇవి కచ్చితమైనవి అనేందుకు ఆధారాలు లేకపోయినా..కొన్ని అధ్యయనాల్లో ఆ ఫలితాలు చాలా ఆలోచింపచేసేలా ఉన్నాయి. పైగా ఇలాంటి ఫజిల్ చిత్రాలు సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందడమే కాకుండా ఆకర్షణీయంగానూ, ఉత్సుకతను రేకెత్తించేలా ఉంటాయి. అలాంటి ఒక చిత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఇది మీరు ఎలాంటి స్వభావం గలవారో ఇట్టే చెప్పేస్తుందట. మరీ ఆ చిత్రం చెప్పే చిత్తరువు స్వభావం ఏంటో చూద్దామా..!.ఇక్కడ కనిపిస్తున్న చిత్రంలో మొట్టమొదటిసారిగా ఏం చూశారో చెప్పండి దాన్ని బట్టి అవతలి వారి స్వభావం ఈజీగా తెలుసుకోవచ్చు. View this post on Instagram A post shared by Recovery Trauma Ltd ♥️♥️♥️ (@recoverytraumaltd) మొదట జీబ్రాలు చూసినట్లయితే..మొదటగా జీబ్రాలనే చూస్తే..మీరు బహిర్ముఖుడని అర్థం. దీని అర్థం అందరితో స్నేహపూర్వకంగా ఉంటారని. ప్రజలతో మమేకం కావడానికే ఇష్టపడతారు. అంతేగాదు మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో ఉత్సాహంగా గడిపేందుకు ఎక్కువగా ఇష్టపడతారని అర్థం. అలాగే నచ్చిన హబీలో ముందుకు సాగడం, పార్టీలు చేసుకోవడం, కొత్త వ్యక్తులను కలవడం, స్నేహితులను చేసుకోవడం, వారితో గడిపే స్వభావం కలవారని చెబుతుందట. మొదట సింహాన్ని చూసినట్లయితేఅలాంటి వారు అంతర్ముఖులని అర్థం. ప్రజలతో అంత తేలిగ్గా కలవరు. వాళ్లు ప్రత్యేకంగా ఎంపిక చేసుకున్న వ్యక్తులతోనే కలిసి మెలుగుతారు. ఇంట్లోనే బంధువులు లేదా సన్నిహితులతో కలిసి సినిమాలు చూడటం, చదవడం, యోగా వంటి కార్యకలాపాల్లో పాల్గొనడం వంటివి చేస్తారు. ఈ వ్యక్తులు ఇతర వ్యక్తుల సహవాసాన్ని అంతగా కోరుకోరట.సరదాగా ఉండే ఈ దృశ్య పజిల్ మనకు అవతలి వ్యక్తుల స్వభావాన్ని ఇట్టే పసిగట్టేలా చేయడమే గాక అలాంటి వాళ్లతో ఎలా నడుచుకోవాలో తెలియజేస్తుంది కదూ..!. ఇంకెందుకు ఆలస్యం మీక్కూడా ఏం కనిపిస్తుందో చెక్‌చేసుకోండి మరి..!.(చదవండి: ఇజ్రాయెల్ ప్రధానికి భారత్ అంటే ఇంత ఇష్టమా..! ఇక్కడ ఫుడ్ తోపాటు అమితాబ్‌తో..) -
ఏ కన్నులు చూడని రెండు చిత్రాలు దాగున్నాయి!కనిపెట్టగలరా?
ఈ ఆప్టికల్ చిత్రాలు మన కంటికి నేరుగా కనపడిని చిత్రాలను వెతకి పట్టుకునేలా చేస్తుంది. ఒకరకంగా మన అంతర్ దృష్టి తట్టిలేపుతుంది. పైపైన చూసి నిర్ణయం తీసుకోకూడదనే విషయాన్ని నొక్కి చెబుతుంది. నెమ్మదిగా, తార్కికంగా మనసుపెట్టి చూస్తే అసలు చిత్రం బయటపడుతుంది. అప్పుడు మనం కూడా కనిపెట్టాశాం అని హ్యాపీగా ఫీలవుతాం. అలాగే మనకు ఎదురైన సమస్యలు కూడా అంతే. ఇలా జరిగితే కాస్త కష్టమే, పని అవ్వదు వంటి మాటలు తరుచుగా వింటుంటాం. అంతే సరిగ్గా మన విషయంలో అలా జరిగేటప్పటికీ..అందరూ అన్నారు కాబట్టి మనకు కూడా కష్టమే అని భావిస్తాం. ఇక ట్రై చేయను కూడా చెయ్యం. అసలు దాన్ని వేరేలా ఆలోచిస్తే ఏమవుతుంది. అని పరిపరి విధాలుగా ఆలోచించడానకి కూడా ట్రై చెయ్యం. నిజం చెప్పండి. ఇప్పటి వరకు మనం ఫేస్ చేసిన సమస్య నేరుగానే పరిష్కరించేశామా. మనం కాస్త ఆలోచించడమో లేదా ఎవ్వరికైనా ఇలా జరిగిందా?.. పెద్ద వాళ్లతో చర్చించి, అవసరమైతే వారి సాయం కూడా తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు యత్నించాం. ఔనా! మరి అలాంటప్పుడు సమస్య..సమస్య అంటూ కూర్చుంటే చిక్కుముడి వీడుతుందా. లేక పెడబొబ్బులు పెట్టి ఏడిస్తే తీరిపోతుందా చెప్పండి..దేనికైన ఓపికతో కూడిన సూక్ష్మబుద్ది దానికి కాస్త తెలివిని జోడిస్తే ఏ సమస్య అయినా చిటికెలో పరిష్కారమైపోతుంది. అలాగే ఇక్కడ ఆప్టికల్ చిత్రం చూస్తే ...అటు ఇటు కొరికేసిన ఆపిల్ పైకి కనిపిస్తుంది. నిజానికి ఇందులో ఇద్దరు చిన్నారులు ముఖాలు ఉన్నాయి. నేరుగా చూస్తే కనిపించదు. అలాగే మనం ఫేస్ చేసే సమస్యను కూడా నేరుగా సమస్య కోణంలో చూస్తే పరిష్కారం దొరకదు. బయటగా వచ్చి చూడాలి. ఉదహరణకు మన స్నేహితుడు లేదా మన బంధువో సమస్యలో ఉంటే ఉచిత సలహాలిచ్చేస్తాం. అదే మనమే ఆ సమస్య ఫేస్ చేస్తే ఇక అంతే. అందుకనే "సమస్యను సవాలుగా తీసుకుంటే అదినీకు దాసోహం అవుతుంది" అని ఊరికే అనలేదు పెద్దలు. అలానే ఇక్కడ ఈ బొమ్మలో ఇద్దరు చిన్నారులు ముఖాలను దాగి ఉన్నాయి కనిపెట్టయండి ఐదు సెకన్లో. కూల్‌గా! డేగ వంటి కన్నులతో వెతికి మరీ కనిపెట్టేయండి. ఇందాక నేను చెప్పినట్లే సమస్యలో కూర్చొకుండా అంటే ఇక్కడ కేవలం యాపిల్ని చూస్తే అర్థం కాదు. రెండు ముఖాలు అన్నాను కాబట్టి బయట దిశగా అంటే వాటిని తిన్న ఆకారం బాహ్య నుంచి ఏదైన ఆకృతి వస్తుందా అని చూడండి. ఈజీగా కనిపెట్టగలుగుతారు. ఇంకెందుకు ఆలస్యం తొందరగా కనిపెయండి గురు!. (చదవండి: ఒక్కరి మరణం తెచ్చిన కార్చిచ్చు..ఏకంగా 700 మందికి జైలు శిక్ష!) -
స్టెరిలైట్ టెక్ టర్న్అరౌండ్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ఆప్టికల్, డిజిటల్ సొల్యూషన్ల కంపెనీ స్టెరిలైట్ టెక్నాలజీస్ టర్న్అరౌండ్ ఫలితాలు సాధించింది. అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నష్టాలను వీడి రూ. 50 కోట్ల నికర లాభం ఆర్జించింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో వన్‌టైమ్ ప్రొవిజన్‌తో కలిపి రూ. 138 కోట్ల నికర నష్టం ప్రకటించింది. మొత్తం ఆదాయం 46 శాతం జంప్‌చేసి రూ. 1,882 కోట్లను తాకింది. మొత్తం ఆర్డర్‌బుక్ రూ. 12,054 కోట్లకు చేరినట్లు కంపెనీ వెల్లడించింది. వృద్ధి అవకాశాలపై దృష్టి పెట్టడం, నిర్వహణా సామర్థ్యాల మెరుగు, పెట్టుబడుల వ్యూహాత్మక కేటాయింపు వంటి అంశాలు పటిష్ట పనితీరుకు సహకరించినట్లు పేర్కొంది. ఫలితాల నేపథ్యంలో స్టెరిలైట్ టెక్ షేరు ఎన్ఎస్ఈలో దాదాపు 2.6 శాతం నష్టంతో రూ. 175 వద్ద ముగిసింది. -
హర్యానా గ్రామాల అనుసంధానం!
ఛండీగఢ్ః హర్యానా గ్రామాలు త్వరలో ఎలక్రానిక్ సేవలను అందుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానం కానున్నాయి. ప్రజలకు ఎలక్ట్రానిక్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సర్వీస్ పాయింట్ల ఏర్పాటుకు హర్యానా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. హర్యానాలో సంసద్ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలు అనుసంధానం కానున్నాయి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో ప్రజలకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంసద్ గ్రామ యోజన పథకం అమలుపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి ఎస్ దేశాయ్ ఈ విషయాలను అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని డెలివరీ పాయింట్లతో ప్రజలకు ఈ ప్రత్యేక అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 105 సేవలను, 3,387 సాధారణ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ సీఎస్ ద్వారా ప్రజలకు వీలైనంత అధిక ఇ-గవర్నెన్స్ సేవలను అందించాలని దేశాయ్ అధికారులను ఆదేశించారు. ఈ దిశలో పంచాయితీ శాఖ పురోగతిని సమీక్షించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సమన్వయ సహకారాన్ని అందిస్తాయని తెలిపారు.