హర్యానాలో సంసద్ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలు అనుసంధానం కానున్నాయి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో ప్రజలకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఛండీగఢ్ః హర్యానా గ్రామాలు త్వరలో ఎలక్రానిక్ సేవలను అందుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానం కానున్నాయి. ప్రజలకు ఎలక్ట్రానిక్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సర్వీస్ పాయింట్ల ఏర్పాటుకు హర్యానా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది.
హర్యానాలో సంసద్ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలు అనుసంధానం కానున్నాయి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో ప్రజలకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంసద్ గ్రామ యోజన పథకం అమలుపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి ఎస్ దేశాయ్ ఈ విషయాలను అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని డెలివరీ పాయింట్లతో ప్రజలకు ఈ ప్రత్యేక అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 105 సేవలను, 3,387 సాధారణ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ సీఎస్ ద్వారా ప్రజలకు వీలైనంత అధిక ఇ-గవర్నెన్స్ సేవలను అందించాలని దేశాయ్ అధికారులను ఆదేశించారు. ఈ దిశలో పంచాయితీ శాఖ పురోగతిని సమీక్షించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సమన్వయ సహకారాన్ని అందిస్తాయని తెలిపారు.