breaking news
connected
-
ఇక ‘స్మార్ట్’ మహీంద్రా!
న్యూఢిల్లీ: వాహనాల వ్యాపార విభాగంలో శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇకపై కనెక్టెడ్ వాహనాలు, పెట్రోల్ ఇంజిన్లు, ఎలక్ట్రిక్ వాహనాలపై (ఈవీ) మరింతగా దృష్టి పెట్టాలని మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్ఎం) నిర్ణయించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన ఈవీ విధానం కింద తమ ఎలక్ట్రిక్ వాహనాల ప్రాజెక్టుపై రూ.500 కోట్లు వెచ్చించనున్నట్లు కంపెనీ తెలిపింది. ఎస్‌యూవీలైన కేయూవీ 100, ఎక్స్‌యూవీ300 వాహనాల్లో ఎలక్ట్రిక్ వెర్షన్లు కూడా రూపొందిస్తున్నట్లు 2018–19 వార్షిక నివేదికలో ఎంఅండ్ఎం వివరించింది. గతంలో మాదిరి సరైన ధరతో సరైన ఉత్పత్తిని ప్రవేశపెడితే సరిపోదని.. మార్కెట్లో నెగ్గుకురావాలంటే మరింతగా కృషి చేయాల్సి ఉంటుందని తెలిపింది. ‘పర్యావరణ కాలుష్యం, రహదారులపై భద్రత వంటి అంశాలపై జాగ్రత్తలు పెరుగుతున్న నేపథ్యంలో ఇంధనాల వినియోగం, వాహనాల కొనుగోలు తీరు తెన్నులు మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆటోమోటివ్ పరిశ్రమపై ఇవి చాలా పెద్ద ప్రభావమే చూపిస్తాయి‘ అని ఎంఅండ్ఎం పేర్కొంది. అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోర్డ్‌తో కలిసి కనెక్టెడ్ వాహనాలను రూపొందించనున్నట్లు వివరించింది. ఇంటర్నెట్, బ్లూటూత్ తదితర టెక్నాలజీల ద్వారా నియంత్రించగలిగే వాహనాలు ఈ కోవకు చెందుతాయి. నిలకడగా వృద్ధి సాధించే లక్ష్యంతో ఉత్పత్తుల పోర్ట్‌ఫోలియోను పటిష్టపర్చుకోవడం, ప్రస్తుత ఉత్పత్తుల్లో కొత్త వేరియంట్లు ప్రవేశపెట్టడం, పరిశోధన.. అభివృద్ధి సామర్థ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెడుతున్నట్లు వివరించింది. 2018–19లో మహీంద్రా ఎలక్ట్రిక్ మొబిలిటీ (ఎంఈఎంఎల్) మొత్తం 10,276 ఎలక్ట్రిక్ వాహనాలు విక్రయించింది. అంత క్రితం ఆర్థిక సంవత్సరం 4,026 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనల ఆహ్వానం న్యూఢిల్లీ: దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రధాన ఆధారమైన చార్జింగ్ సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఫేమ్–2 పథకం కింద దేశవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి కలిగిన సంస్థల నుంచి ప్రతిపాదనలు ఆహ్వానించింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రూ.లక్ష జనాభా కంటే ఎక్కువ మంది ఉన్న పట్టణాలు, ప్రభుత్వం నోటిఫై చేసిన స్మార్ట్‌సిటీలు, మెట్రో నగరాలకు అనుసంధానమైన శాటిలైట్ పట్టణాలకు ఈ ప్రతిపాదనలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ ఆహ్వానం పలికింది. తొలి విడత కింద 1,000 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ఆసక్తి వ్యక్తీకరణ తెలియజేయాలని కోరింది. ఆ తర్వాత రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు వీటిని మంజూరు చేయనున్నట్టు తెలిపింది. -
హర్యానా గ్రామాల అనుసంధానం!
ఛండీగఢ్ః హర్యానా గ్రామాలు త్వరలో ఎలక్రానిక్ సేవలను అందుకోనున్నాయి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో అనుసంధానం కానున్నాయి. ప్రజలకు ఎలక్ట్రానిక్ సౌకర్యాలు అందించడమే లక్ష్యంగా సర్వీస్ పాయింట్ల ఏర్పాటుకు హర్యానా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పథకంలో భాగంగా ఈ కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నట్లు ఓ అధికారిక ప్రకటన ద్వారా తెలుస్తోంది. హర్యానాలో సంసద్ గ్రామ యోజన పథకం ద్వారా గ్రామాలు అనుసంధానం కానున్నాయి. నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ తో ప్రజలకు ప్రత్యేక సదుపాయాన్ని కల్పించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. సంసద్ గ్రామ యోజన పథకం అమలుపై జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డి ఎస్ దేశాయ్ ఈ విషయాలను అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించారు. రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లోని డెలివరీ పాయింట్లతో ప్రజలకు ఈ ప్రత్యేక అందించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 105 సేవలను, 3,387 సాధారణ సేవా కేంద్రాల ద్వారా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎస్ సీఎస్ ద్వారా ప్రజలకు వీలైనంత అధిక ఇ-గవర్నెన్స్ సేవలను అందించాలని దేశాయ్ అధికారులను ఆదేశించారు. ఈ దిశలో పంచాయితీ శాఖ పురోగతిని సమీక్షించేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్ మెంట్, భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ సమన్వయ సహకారాన్ని అందిస్తాయని తెలిపారు.