‘వన్ బై ఫోర్’.. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టదు: వెంకటేశ్ పెద్దపాలెం
వెంకటేశ్ పెద్దపాలెం హీరోగా, అపర్ణ మల్లిక్, హీనా సోని హీరోయిన్లుగా నటించిన యాక్షన్, క్రైమ్ డ్రామా చిత్రం ‘వన్ బై ఫోర్’. ‘బాహుబలి’ పళని దర్శకత్వంలో రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ పెద్దపాలెం మాట్లాడుతూ– ‘‘నాది మదనపల్లి అని గర్వంగా చెప్పుకుంటున్నాను. టంగ్ స్లిప్ అనే పాయింట్‌తో ఈ క్రైమ్ డ్రామా సినిమా తీశాం. రాజమౌళి గారి స్టైల్లో ఈ మూవీని తీశారు. ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టించుకుండా సినిమా తెరకెక్కించారు. డిసెంబర్ 12న వంద శాతం మేం హిట్ కొట్టబోతోన్నామ’ని అన్నారు. ‘‘తెలుగులో సినిమా ప్రేమికులు ఎక్కువగా ఉంటారు. అందుకే ఇక్కడ సినిమాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు రంజన రాజేష్. ‘‘మా సినిమా బాగా వచ్చింది’’ అని రోహిత్ రాందాస్, దర్శకుడు పళని తెలిపారు. అపర్ణ మల్లిక్, హీనా సోని, కొరియోగ్రాఫర్ సాగర్ వేలూరు మాట్లాడారు.