objected
-
జడ్జీలు బోధనలు చేయరాదు
న్యూఢిల్లీ: కౌమార బాలికలు లైంగిక కోరికలను నియంత్రించుకోవాలని, బాలురు మహిళలను గౌరవించడం అలవర్చుకోవాలంటూ కలకత్తా హైకోర్టు చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. ఇటువంటి తీర్పు ఎంతో అభ్యంతరకరం, అవాంఛనీయమని పేర్కొంది. కలకత్తా హైకోర్టు న్యాయమూర్తుల వ్యాఖ్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం కౌమార వయస్కుల హక్కులను పూర్తి స్థాయిలో ఉల్లంఘించడమేనని జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ పంకజ్ మిత్తల్‌ల ధర్మాసనం పేర్కొంది. ‘సంబంధిత అప్పీల్లో న్యాయపరమైన అంశాలను పరిశీలించాలే తప్ప,న్యాయమూర్తులు తమ వ్యక్తిగత అభిప్రాయాలను వ్యక్తపరచరాదని, బోధనలు చేయరాదని ప్రాథమికంగా మేం భావిస్తున్నాం’అని తెలిపింది. ఈ అంశంపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి, సంబంధిత వర్గాలకు నోటీసులు జారీ చేసింది. సీనియర్ న్యాయవాది మాధవి దివాన్‌ను అమికస్ క్యూరీగాను, ఆమెకు సాయం అందించేందుకు న్యాయవాది లిజ్ మాథ్యూను నియమించింది. ‘ప్రతి కౌమార బాలిక లైంగిక కోరికలను నియంత్రించుకోవాలి. అలా కాకుండా, కేవలం రెండు నిమిషాల లైంగిక ఆనందాన్ని ఆస్వాదించడం కోసం లొంగిపోతే సమాజం దృష్టిలో ఆమె ఓడిపో యినట్లే’అని కలకత్తా హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన ఓ కేసు తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై శుక్రవారం సుప్రీంకోర్టు స్వయంగా విచారణ జరిపింది. -
జవాన్లకు ఆ పదం ఉపయోగించకూడదు! రాహల్‌కు కౌంటర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ భారత జవాన్లపై చేసిన వ్యాఖ్యలపై భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మన జవాన్లకు పిటై అనే పదాన్ని ఉపయోగించకూడదంటూ రాహుల్‌పై విరుచుకుపడ్డారు. "వారంతా అరుణాచల్‌ప్రదేశ్‌లో యాంగ్సేలో సుమారు 13 వేల అడుగుల ఎత్తులో నిలబడి పహారా కాస్తున్నారని అన్నారు. అలాంటి వారిని మనం గౌరవించాలి. వారి పట్ల అలాంటి పదాలను ఉపయోగించడం సరికాదు". అని జైశంకర్ లోక్‌సభలో అన్నారు. ఈ మేరకు విదేశాంగమంత్రి జై శంకర్ సోమవారం లోక్‌సభను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం చైనా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే.. భారత సైన్యాన్ని సరిహద్దులకు ఎవరూ పంపారు. ఈ ఘర్షణలను తలెత్తకుండా ఉండేలా చైనాపై ఎందుకు ఒత్తిడి చేస్తున్నాం. ఇరు దేశాల సంబంధాలు మాములుగా లేవని బహిరంగంగా ఎందుకు చెబుతున్నాం అని గట్టిగా ప్రశ్నించారు. రాజకీయంగా విభేదాలు వచ్చినా, విమర్శలు వచ్చినా మాకెలాంటి ఇబ్బంది లేదని తెగేసి చెప్పారు. ఈ మేరకు విదేశాంగ మంత్రి జైశంకర్ అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ సెక్టార్లో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణల నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత రాహుల్ రాజస్తాన్‌లోని జైపూర్‌లో భారత్ జోడో యాత్ర సందర్భంగా విలేకరుల సమావేశాంలో భారత్ చైనా ఘర్షణలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజింగ్ యుద్ధానికి రెడీ అవుతుంటే మోదీ పాలన నిద్రపోతుందంటూ ఎద్దేవా చేశారు. మన భూమిని చైనా లాక్కుందని, చైనా సైనికులు భారత ఆర్మీ సిబ్బందిని కొడుతున్నారంటూ వ్యాఖ్యలు చూశారు. దీంతో బీజేపీ నేతలు ఆయన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే గాక ఆయన్ను పార్టీ నుంచి బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. (చదవండి: షాకింగ్ ఘటన: దొంగతనం చేశాడని..కదులుతున్న రైలు నుంచి తోసేసి..) -
సత్తా చూసి ఎంపిక చేయండి
సాక్షి, హైదరాబాద్: బల్క్‌డ్రగ్స్ పార్కుల ఏర్పాటు విషయంలో కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాలపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పార్కు ల ఏర్పాటులో కేవలం భూముల ధరలనే కాకుండా ఆయా రాష్ట్రాల్లో ఔషధాల రంగంలో ఉన్న మౌలిక వసతులు, అనువైన వాతావరణాన్ని కూడా లెక్కలోకి తీసుకోవాలని కోరుతోంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), ఇతర కీలక ముడి పదార్థాలను దేశీయంగా ఉత్పత్తి చేసేందుకు మూడు కొత్త బల్క్ డ్రగ్స్ పార్కులను(బీడీపీ) ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పార్కులను ఎక్కడ ఏర్పాటు చేయాలో సూచించాలని కేంద్ర ఎరువులు, రసాయనాల మంత్రిత్వ శాఖ పరిధిలోని ఫార్మాస్యూటికల్స్ విభాగానికి(డీఓపీ) కేంద్రం బాధ్యత అప్పగిం చింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూలై 27న బీడీపీల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేస్తూ, ఆసక్తి కలి గిన రాష్ట్రాలు దరఖాస్తు చేసుకోవాలని సూచిం చింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాల ఎంపికకు సంబంధించిన మార్గదర్శకాలను కూడా కేంద్రం విడుదల చేసింది. కేంద్ర పథకంలో భాగంగా ఒక్కో బీడీపీకి గరిష్టంగా రూ.వెయ్యి కోట్ల గ్రాంట్ ఇన్ ఎయిడ్‌తో పాటు 75 శాతం మేర ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది. అలాగే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు ఇస్తామని ప్రకటించింది. బీడీపీల ఏర్పాటుకు ఆసక్తి చూపే రాష్ట్రాలు అక్టోబర్ 15వ తేదీలోగా తమ ప్రతిపాదనలు అందజేసేందుకు డీఓపీ తుది గడువు విధిం చింది. దీంతో తెలంగాణ, ఏపీ, గుజరాత్, తమిళనాడు, పంజాబ్ ఆసక్తి చూపుతూ ప్రతిపాదనలు అందజేశాయి. మార్గదర్శకాలపై అభ్యంతరం బీడీపీలకు అవసరమైన భూమి ధరలు, విద్యుత్ రాయితీలు, ఇతర ప్రోత్సాహకాల వివరాలు సమర్పిస్తే, చాలెంజ్ మోడ్‌లో అర్హత కలిగిన రాష్ట్రాలను ఎంపిక చేస్తామని డీఓపీ ప్రకటించింది. ప్రాజెక్టు మేనేజ్మెంట్ ఏజెన్సీ.. రాష్ట్రాలు అందజేసే ప్రతిపాదనలను మదింపు చేసిన తర్వాత, ఏజెన్సీ చేసే సిఫారసు మేరకు ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామని వెల్లడించింది. కాగా, కనీసం ఒక్క బీడీపీని అయినా సాధించాలనే పట్టుదలతో ఉన్న తెలంగాణ, బీడీపీల ఎంపిక కోసం రూపొందించిన మార్గదర్శకాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. కేవలం భూమి ధరలు, రాయితీలు, ప్రోత్సాహకాలే కాకుండా ఇతర అంశాలు కూడా ఫార్మాపరిశ్రమ అభివృద్ధికి దోహదం చేస్తాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఇటీవల కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి సదానంద గౌడకు లేఖ రాశారు. బీడీపీల ఏర్పాటులో ప్రణాళిక, పర్యావరణ అనుమతులు వంటి అంశాలను కూడా ఎంపిక సమయంలో పరిగణనలోకి తీసుకోవాలని, ఈ విషయంలో ఆయా రాష్ట్రాల శక్తిసామర్థ్యాలను లెక్కలోకి తీసుకోవాలని తెలంగాణ కోరుతోంది. అలాగే ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల తయారీకి రాష్ట్రంలో ఉన్న అనువైన వాతావరణాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరింది. ప్రధాననగరాలకు దూరంగా 3 వందల కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాంతాల్లో భూమి ధరలు సహజంగానే తక్కువగా ఉంటాయనేది రాష్ట్రం వాదన. ఇలాంటి చోటకు నైపుణ్యం కలిగిన వారిని రప్పించడం, ఉద్యోగుల రవాణా, నివాసం తదితరాలు ఇబ్బందికరంగా ఉంటాయని, అలాగే అంతర్జాతీయ పెట్టుబడులు రావడం కష్టమని కేంద్ర మంత్రికి రాసినలేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. చైనా కీలకం.. భారత బల్క్‌డ్రగ్స్ తయారీ, ఎగుమతి రంగంలో తెలంగాణ కేంద్ర బిందువుగా ఉంది. బల్క్‌డ్రగ్స్ తయారీలో కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్లు (ఏపీఐ), ముడి పదార్థాల కోసం చైనాపై ఆధారపడాల్సి వస్తోంది. వివిధ కారణాలతో ఏపీఐల రవాణాలో అంతరాయం ఏర్పడుతుండగా, కోవిడ్ నేపథ్యంలో ఏపీఐ, ఇతర కీలక ముడి పదార్థాల ధరలు 20 శాతం మేర పెరిగాయి. ఉత్పత్తి, రవాణా వ్యయం పెరగడంతో పాటు లాభాలపై ఏపీఐ దిగుమతులు ప్రభావం చూపుతున్నాయి. -
జపాన్ తరహా నిరసనను అడ్డుకున్న పోలీసులు
విజయవాడ సెంట్రల్ : జపాన్ తరహా నిరసనలు తెలిపేందుకు ప్రయత్నించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ప్రత్యేక హోదా సాధనలో భాగంగా బుధవారం మహిళా, సిటీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద చీపుర్లతో ఊడ్చి నిరసన తెలిపే కార్యక్రమాన్ని చేపట్టారు. ఆంధ్రరత్న భవన్ వద్ద ప్రారంభమైన ర్యాలీని పోలీసులు చుట్టుముట్టారు. ఆందోళన చేస్తున్న నాయకుల్ని ఈడ్చిపారేశారు. మహిళా కార్యకర్తలపై పోలీసులు అమానుషంగా ప్రవర్తించడం వివాదాస్పదమైంది. ఈ క్రమంలో నాయకులు, పోలీసులకు మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకున్నాయి. పరిస్థితి విషమించడంతో ఆందోళన కారులను పోలీసులు జీపులో ఎక్కించి కంకిపాడు, గవర్నర్‌పేట పోలీస్స్టేషన్లకు తరలించారు. తొలుత పోలీసుల తీరును నిరసిస్తూ మహిళా కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నాకు ఉపక్రమించారు. మహిళా కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ పోలీసుల వైఖరిని ఖండించారు. సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లాది విష్ణు మాట్లాడుతూ సీఎం చంద్రబాబు చెప్పిన పద్ధతిలోనే తాము ఆందోళన చేపట్టామన్నారు. అయినప్పటికీ అరెస్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు సీఎంగా ఉన్నంతకాలం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాదన్నారు. ఏపీసీసీ నాయకులు మీసాల రాజేశ్వరరావు, పరసా రాజీవ్ రతన్, మీసాల రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముహూర్తం మంచిదేనా?