breaking news
NTR Medical University
-
జుట్టు పట్టుకొని ఈడ్చేసి.. కాళ్లతో తొక్కేసి
లబ్బీపేట(విజయవాడ తూర్పు): పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువ వైద్యులతో చంద్రబాబు ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తోంది. ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎదుట ధర్నా చేస్తున్న వారిపై మరోసారి పోలీసులను ఉసిగొల్పింది. దీంతో యువ వైద్యులను పోలీసులు కాళ్లతో తొక్కేసి.. జట్టు పట్టుకొని ఈడ్చేశారు. నేరతుల కంటే దారుణంగా.. వారిని బలవంతంగా ట్రక్కుల్లోకి ఎత్తిపడేశారు. వారికి అండగా నిలిచిన విద్యార్థి సంఘాల నాయకులను సైతం అరెస్ట్ చేసి రాత్రి వరకు నిర్భందించారు. మూకుమ్మడిగా మీద పడి లాక్కెళ్లారు.. విదేశాల్లో మెడికల్ కోర్సులు పూర్తి చేసిన వందలాది మంది యువ వైద్యులు పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోసం కొంత కాలంగా ఆందోళన చేస్తున్నారు. మంత్రులను సైతం కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. అయినా ఎలాంటి ఫలితం లేకపోవడంతో నాలుగు రోజులుగా విజయవాడలో ఏపీ మెడికల్ కౌన్సిల్ కార్యాలయం ఉన్న హెల్త్ యూనివర్సిటీ ఎదుట నిరసన తెలుపుతున్నారు. గురువారం కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారికి వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ.రవిచంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.వినోద్‌కుమార్, కార్యదర్శి ఐ.రాజేశ్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ఏబీవీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపి తదితరులు మద్దతు తెలిపారు.ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డి.శ్రీహరిరావు కారును అడ్డుకొని తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఇంతలో సెంట్రల్ ఏసీపీ దామోదర్, మాచవరం సీఐ ప్రకాష్ తో పాటు పెద్ద సంఖ్యలో పోలీసులు హెల్త్ యూనివర్సిటీ వద్దకు చేరుకున్నారు. మూకుమ్మడిగా వైద్య విద్యార్థులపై పడి.. వారిని ఈడ్చేశారు. మహిళా వైద్యులని కూడా చూడకుండా జుట్టు పట్టుకొని లాక్కెళ్లి ట్రక్కుల్లో పడేశారు.దీంతో పలువురు గాయపడ్డారు. అనంతరం వారిని ఎంజీ రోడ్డులోని ఏఆర్ గ్రౌండ్‌కు తరలించారు. పోలీస్ లు తమ పట్ల కర్కశంగా వ్యవహరించారని యువ వైద్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రిజిస్ట్రేషన్ చేయలేకపోతే.. చంపేయండి అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. యువ వైద్యుల జీవితాలతో సర్కార్ చెలగాటం.. వైఎస్సార్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ యువ వైద్యులను పరామర్శించారు. వారి సమస్య పరిష్కారమయ్యే వరకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య మాట్లాడుతూ.. యువ వైద్యుల జీవితాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
ఎంబీబీఎస్ మాప్–అప్ రౌండ్–2 కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేట్ అన్ ఎయిడెడ్ నాన్–మైనారిటీ/మైనారిటీ వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ యాజమాన్య కోటా (బీ, సీ (ఎన్ఆర్ఐ) సీట్ల భర్తీలో భాగంగా మాప్–అప్ రౌండ్–2 కౌన్సెలింగ్‌కు ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆదివారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం మధ్యాహ్నం 1 గంటలోపు విద్యార్థులు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించారు. ఎంచుకున్న ఆప్షన్ల ఆధారంగా సీటు కేటాయించిన కళాశాలలో చేరకపోతే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మూడేళ్లపాటు యూనివర్సిటీ నుంచి డీబార్ చేస్తామని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. కాగా బీ కేటగిరి సీట్లు 65, సీ కేటగిరీ సీట్లు 37 అందుబాటులో ఉన్నాయి. -
వారం రోజుల్లో ఆ మొత్తాన్ని చెల్లించండి
సాక్షి, అమరావతి: ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం సందర్భంగా షామియానాలతో పాటు ఇతర ఏర్పాట్లు చేసినందుకు కాంట్రాక్టర్‌కు చెల్లించాల్సిన వివాదరహిత మొత్తాన్ని వారం రోజుల్లో చెల్లించాలని హైకోర్టు సోమవారం విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ (వీసీ)ను ఆదేశించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని యూనివర్సిటీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ ఉత్తర్వులు జారీచేశారు. కాంట్రాక్టర్‌కు ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మంజూరు చేసిన డిప్యూటీ ఇంజనీర్‌పై చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి అధికారుల విషయంలో మెమో జారీచేస్తే సరిపోదని, వారిని సస్పెండ్ చేయాలని వ్యాఖ్యానించారు. స్నాతకోత్సవం సందర్భంగా చేసిన ఏర్పాట్లుకు సంబంధించిన బిల్లులు చెల్లించడం లేదంటూ లక్ష్మీనర్సింహ షామియానా సప్లయిర్స్ యజమాని వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ ఈ వ్యవహారంలో వివరణ ఇచ్చేందుకు స్వయంగా కోర్టుకు రావాలని విశ్వవిద్యాలయం వీసీ, రిజిస్ట్రార్లను ఆదేశించారు. ఈ ఆదేశాల మేరకు వీసీ శ్యాంప్రసాద్, రిజిస్ట్రార్ శంకర్ సోమవారం కోర్టుకు హాజరై వివరణ ఇచ్చారు. వారి న్యాయవాది జి.విజయ్‌కుమార్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్‌కు చెల్లించాల్సింది రూ.3.5 లక్షలు మాత్రమేనన్నారు. అయితే డిప్యూటీ ఇంజనీర్ రూ.18 లక్షలు చెల్లించాలంటూ బిల్లులు ధ్రువీకరించారని తెలిపారు. వాస్తవానికి డిప్యూటీ ఇంజనీర్ స్నాతకోత్సవం రోజున సెలవులో ఉన్నారని, దురుద్దేశంతో బిల్లులు ధ్రువీకరించినందుకు డిప్యూటీ ఇంజనీర్‌కు మెమో జారీచేశామని తెలిపారు. వాస్తవంగా చెల్లించాల్సిన రూ.3.5 లక్షలను చెల్లించేందుకు సిద్ధమని వీసీ చెప్పారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి ఆ రూ.3.5 లక్షల బిల్లును వారం రోజుల్లో పిటిషనర్‌కు చెల్లించాలని వీసీని ఆదేశించారు. తదుపరి విచారణను జూన్ 14కి వాయిదా వేశారు. -
క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించొద్దు
ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరానికి క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వారి కోసం క్రీడల కోటాలో నాలుగు సీట్లను పక్కన పెట్టి మిగిలిన సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో మెరిట్ జాబితా రూపకల్పలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన జి.తన్మయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది.