nri medical college
-
మెడికల్ కాలేజీపై ‘ముఖ్య’ నేత కన్ను!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘ముఖ్య’నేత కుటుంబ దోపిడీ పరంపర యథేచ్ఛగా కొనసాగుతోంది! అమరావతిని కామధేనువులా మార్చుకుని కేవలం రోడ్లు, మౌలిక సదుపాయాల కోసమే రూ.2 లక్షల కోట్లు ధారపోసి మొబిలైజేషన్ అడ్వాన్సుల రూపంలో తిరిగి వసూలు చేసుకుంటున్నా ఆశ తీరడం లేదు..! ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక, సిలికా, క్వార్ట్జ్, లేటరైట్ లాంటి ప్రకృతి వనరులను కొల్లగొడుతూ మైనింగ్ దోపిడీకి తెర తీశారు. మొన్న.. విశాఖ నడిబొడ్డున ముఖ్య నేత బంధువులకు రూ.5 వేల కోట్ల విలువైన భూముల పందేరం..! నిన్న.. ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ ముసుగులో కుటుంబ సంస్థకు రాయితీల రూపంలో దాదాపు రూ.వంద కోట్లు సంతర్పణ..! నేడు.. రాజధాని ప్రాంతంలో రూ.వేల కోట్ల విలువైన మెడికల్ కాలేజీపై కన్ను..! అధికారం అండతో కుటుంబం కోసం ముఖ్యనేత సాగిస్తున్న దోపిడీ పర్వం ఇలా ఉంది..!రంగంలోకి ఆ ముగ్గురు..పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే ఉదాత్త ఆశయంతో మూడు దశాబ్దాల క్రితం మంగళగిరిలో ఏర్పాటైన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీపై ముఖ్య నేత కన్ను పడింది. రాజధాని ప్రాంతంలో ఉన్న అత్యంత విలువైన ఆ కాలేజీని ఎలాగైనా సరే సొంతం చేసుకునేందుకు తెర వెనుక విస్తుగొలిపే రీతిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం ఆయన బినామీలను రంగంలోకి దించి అధికార బలంతో వ్యవహారాలను చక్కబెట్టేందుకు చక్రం తిప్పుతున్నారు. మెడికల్ కాలేజీని ముఖ్య నేత పరం చేసేందుకు రంగం సిద్ధం చేశారు. రాజధాని ప్రాంతంలోని మంగళగిరిలో జాతీయ రహదారికి ఆనుకుని 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ కాలేజీకి చుట్టుపక్కల కూడా మరికొన్ని విలువైన భూములున్నాయి. అవన్నీ కలిపితే దాని ఆస్తుల విలువ రూ.2 వేల కోట్లకుపైగా ఉంటుందని అంచనా. అధికారాన్ని అడ్డుపెట్టుకుని విలువైన కాలేజీ ఆస్తులను చేజిక్కించుకునేందుకు ముఖ్య నేత స్కెచ్ వేశారు. ఎన్ఆర్ఐ కాలేజీ యాజమాన్యంలోని రెండు గ్రూపుల మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే నెపంతో రంగంలోకి దిగిన ముఖ్య నేత బినామీలు ఏకంగా కాలేజీనే బిగ్‌బాస్ పరం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గుడిని, గుడిలో ‘లింగా’న్ని కూడా మింగేసే ఓ పారిశ్రామికవేత్తతోపాటు ఎన్ఆర్ఐ కాలేజీ వ్యవహారాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు దీని వెనుక ఉన్నట్లు తెలిసింది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించే మంత్రి కూడా వారికి తోడైనట్లు సమాచారం. ఇటీవల ముఖ్య నేతతో సంబంధాలు సన్నగిల్లడంతో ఈ డీల్ కుదర్చడం ద్వారా ఆయన్ను ప్రసన్నం చేసుకునేందుకు ఈ మంత్రి తాపత్రయపడుతున్నారు. ముఖ్య నేతకు రాజధానిలో అత్యంత విలువైన ఆస్తిని సమకూర్చిపెట్టడం ద్వారా తాము మరింత లబ్ధి పొందేందుకు ఈ ముగ్గురూ ఈ డీల్‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం యాజమాన్యంపై సామ దాన భేద దండోపాయాలను ప్రయోగిస్తున్నారు.త్వరలో ముఖ్య నేత ట్రస్టు చేతుల్లోకి.. త్వరలో దీనిపై ఒప్పందం చేసుకుని కోర్టు వ్యవహారాలను క్లియర్ చేసేందుకు మంతనాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎన్ఆర్ఐ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌ను అధికారికంగా ముఖ్య నేత పార్టీ ట్రస్టు పేరు మీదకు బదలాయించాలని యత్నిస్తున్నారు. లాంఛనాలు పూర్తయి సంస్థ మొత్తం పూర్తిగా తమ చేతుల్లోకి వచ్చాక హైదరాబాద్‌లోని ట్రస్టు ద్వారా నడిపిస్తున్న కార్పొరేట్ ఆస్పత్రి తరహాలో ఎన్ఆర్ఐ కాలేజీ, ఆస్పత్రిని నిర్వహించేందుకు ముఖ్య నేత పథకం సిద్ధం చేసినట్లు సమాచారం.న్యాయ వివాదాలు..2003లో కృష్ణా, గుంటూరుకు చెందిన పలువురు ఎన్ఆర్ఐ వైద్యులు తమ ప్రాంతంలో పేదలకు మంచి వైద్యం, వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మంగళగిరి ప్రాంతంలో 50 ఎకరాలు కొనుగోలు చేసి ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్‌ను స్థాపించారు. మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఛైర్మన్ ముక్కామల అప్పారావుకు నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. అయితే అప్పారావుకు వ్యతిరేకంగా ఉన్న నిమ్మగడ్డ ఉపేంద్ర వర్గానికి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న టీడీపీ నేత ఒకరు మద్దతు పలికి కాలేజీ వ్యవహారాలను తన చెప్పు చేతుల్లో పెట్టుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో 2021లో ముక్కామల అప్పారావు కాలేజీని మేఘా ఇంజినీరింగ్ కంపెనీకి విక్రయించారు. దీనిపై రెండు గ్రూపులు పరస్పరం కేసులు పెట్టి కోర్టు మెట్లు ఎక్కాయి. దీంతో మేనేజ్మెంట్ కమిటీ స్థానంలో ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారికి కోర్టు తాత్కాలికంగా కాలేజీ నిర్వహణ బాధ్యతలు అప్పగించింది. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఆర్బిట్రేషన్‌కు పంపగా నిజమైన సభ్యులు ఎవరో ఏప్రిల్ 30వ తేదీలోగా తేల్చాలని ఆర్బిట్రేషన్ జడ్జి తీర్పు ఇచ్చారు.5న జనరల్‌బాడీ సమావేశం.. రూ.250 కోట్ల కార్పస్ ఫండ్‌పై ముఖ్యనేత కన్నుఈ నెల 5వ తేదీన ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ మేనేజ్మెంట్ జనరల్‌బాడీ సమావేశం జరగనుంది. అందులో 30 మంది ఉండగా సగం మంది ముఖ్య నేత బినామీలకు అనుకూలంగా మారిపోయినట్లు తెలిసింది. మిగిలిన 15 మంది వ్యతిరేకంగా ఉండడంతో వారిపై తీవ్ర స్థాయిలో అధికార బలం ప్రయోగిస్తున్నట్లు తెలిసింది. ఎలాగైనా వారిని లొంగదీసుకునేందుకు భారీ లాబీయింగ్, ప్రలోభాలు, బెదిరింపుల పర్వం సాగుతోంది. రాజధాని వ్యవహారాలు పర్యవేక్షించే ఒక మంత్రి శుక్రవారం ముక్కామల అప్పారావు ఇంటికెళ్లి ఆయనతో మంతనాలు జరిపారు. ఎలాగైనా సరే వ్యతిరేకంగా ఉన్న వారిని బుజ్జగించి ముఖ్య నేతకు కాలేజీని బహుమానంగా ఇవ్వాలని బినామీ పారిశ్రామికవేత్త తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 5వ తేదీన జరిగే జనరల్ బాడీ సమావేశంలో డైరెక్టర్లను ఎన్నుకునేందుకు సభ్యులుగా ఉన్న 30 మందికి నోటీసులు ఇవ్వనున్నారు. ఆ తర్వాత ఈనెల 30వ తేదీలోపు డైరెక్టర్లను ఎన్నుకోనున్నారు. నెలాఖరులోపు బోర్డు ఏర్పాటు కానుండడంతో డైరెక్టర్లుగా తమకు అనుకూలమైన వారు ఉండేలా చూడడం, ఆ తర్వాత వెంటనే కాలేజీని సొంతం చేసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాలేజీ స్థలం విలువైనది కావడంతోపాటు దాని పేరు మీద రూ.250 కోట్ల వరకూ కార్పస్ ఉండడంతో వెంటనే ఆ సొమ్మును నొక్కేయవచ్చని ముఖ్య నేత భావిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే రాజధాని ప్రాంతంలోని అత్యంత విలువైన వేలాది ఎకరాల భూములను ముఖ్య నేత తన బినామీల ద్వారా గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏకంగా ఎన్ఆర్ఐ మెడికల్ సైన్సెస్‌పై కన్నేసినట్లు స్పష్టమవుతోంది. -
విశాఖలో మెడికో ఆత్మహత్య
సాక్షి, విశాఖపట్నం: నగరంలో మెడికో శ్రీరామ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి వేధింపులు తాళలేక విద్యార్థి ఆత్మహత్యకి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. సంఘటన స్థలానికి చేరుకున్న భీమిలి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.మెడికల్ కళాశాల వద్ద మెడికోలు ఆందోళన చేపట్టారు. కళాశాల డీన్ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్ రెడ్డి వేధింపులు తాళలేకే శ్రీరామ్ ఆత్మహత్య చేసుకున్నాడని నిరసనకు దిగారు. చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్న శ్రీరామ్ బంధువులు ఆరోపిస్తున్నారు.బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యమరో ఘటనలో తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా చిలుకూరులోని గేట్ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థిని ఇవాళ తెల్లవారుజామున భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మంచిర్యాల జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థిని కృష్ణవేణిగా గుర్తించారు. ఉగాది పండగకు ఇంటికి వెళ్లి నిన్న(శుక్రవారం) సాయంత్రం తల్లితో కలిసి కళాశాలకు విద్యార్థిని వచ్చింది.తల్లితో కలిసి రాత్రి హాస్టల్లో ఉన్న మృతురాలు కృష్ణవేణి.. తెల్లవారుజామున కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
NRI మెడికల్ కళాశాల సోదాలపై ఈడీ ప్రకటన
-
మంగళగిరి ఎన్నారై కళాశాలలో కీచక ప్రొఫెసర్ అరెస్ట్
సాక్షి, అమరావతి/మంగళగిరి: నా మాట వినకుంటే ప్రాక్టికల్ మార్కుల్లో కోత వేస్తానంటూ వైద్య విద్యార్థినులను బెదిరించి, లైంగిక వేధింపులకు పాల్పడిన కీచక ప్రొఫెసర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో రేడియాలజీ విభాగం ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తుమ్మల నాగేశ్వరరావు వైద్య విద్యార్థినుల్ని లైంగిక వేధింపులకు గురిచేసిన వైనం ఇటీవల వెలుగు చూడడం తెలిసిందే. ప్రొఫెసర్‌పై ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోకపోవడంతో వైద్య విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి తమ గోడు విన్నవించారు. దీనిపై వీసీ చర్యలకు ఉప్రకమించారు. రంగంలోకి దిగిన మంగళగిరి రూరల్ పోలీసులు కీచక ప్రొఫెసర్‌పై కేసు నమోదు చేయడమేగాక గురువారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి కోర్టులో హాజరు పరచగా అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్వీవీఎన్ లక్ష్మి.. అతనికి 14 రోజులపాటు రిమాండ్ విధించారు. ఫిర్యాదు చేసినా యాజమాన్యం పట్టించుకోలేదు.. డా.నాగేశ్వరరావు గత కొన్నేళ్లుగా ఎన్ఆర్ఐ వైద్యకళాశాలలోని రేడియాలజీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఇదే కళాశాలలో చదువుతున్న రేడియాలజీ పీజీ వైద్య విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, మాట్లాడటం, రకరకాలుగా వేధించడం చేశారు. వేధింపులు తట్టుకోలేక విద్యార్థినులు ఎన్ఆర్ఐ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. ఎంసీఐ నిబంధనల మేరకు ప్రతి వైద్య కళాశాలలోనూ ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి, అక్కడకు వచ్చిన ఫిర్యాదుల మేరకు ఆయా అధ్యాపకులపై చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ కళాశాల యాజమాన్యం ప్రొఫెసర్‌పై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో విద్యార్థినులు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేశారు. వీసీ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఎన్ఆర్ఐ కళాశాలకెళ్లి విచారణ జరిపి ప్రొఫెనర్ వేధింపులు నిజమేనని తేల్చింది. దీనిపై యాజమాన్యాన్ని వీసీ వివరణ కోరగా... ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేసి వెళ్లిపోయారని, ఆయన రాజీనామాను ఆమోదించామని బదులిచ్చారు. దీనిపై వీసీ.. రాజీనామా చేసి వెళ్లిపోతే వదిలేస్తారా, పోలీసు కేసు నమోదు చేయరా అంటూ నిలదీశారు. కళాశాల అంతర్గత విచారణలోనూ ప్రొఫెసర్ వేధించినట్టు నిర్ధారించాక పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. విద్యార్థినులు జిల్లా ఎస్పీని తాజాగా కలసి ఫిర్యాదు అందజేయడమేగాక ప్రొఫెసర్ తీరుపై వీడియోలతోసహా ఆధారాలను సమర్పించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఎస్పీని ఆదేశించడంతో మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేయడమేగాక నాగేశ్వరరావును అదుపులోకి తీసుకున్నారు. ప్రొఫెసర్ వేధింపులపై ఎథికల్ కమిటీకి సిఫార్సు ప్రొఫెసర్ నాగేశ్వరరావు వేధింపులపై రెండు కమిటీలు వేయగా వేధింపులు నిజమేనని అవి రెండూ తేల్చాయి. దీంతో భారతీయ వైద్యమండలి ఎథికల్ కమిటీకి ఈయన విషయాన్ని సిఫార్సు చేస్తున్నా. వైద్య విద్యార్థినుల స్టేట్‌మెంటుతోపాటు విచారణ కమిటీ నివేదికనూ పంపిస్తాం. ఎథికల్ కమిటీ విచారణ జరిపి ఆయన ఎంసీఐ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తుందా.. ప్రాక్టీస్ చేయకుండా చర్యలు తీసుకుంటుందా అన్నది వేచిచూడాలి. –డా.కె.వెంకటేష్, వైస్ చాన్స్‌లర్ (ఇన్చార్జి), ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ -
'అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా ఏపీ'
మంగళగిరి (గుంటూరు) : అంతర్జాతీయ పర్యాటక మెడికల్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దాల్సిన అవసరముందని కేంద్రపట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలంలోని చినకాకాని ఎన్ఆర్ఐ మెడికల్ కళాశాలలో శనివారం పదో వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 'తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యతో పాటు నాణ్యమైన వైద్యం అందిచేందుకు నేటి యువత పరిశోధనారంగంపై దృష్టి సారించాలి. నేటి యువత అబ్రాడ్ వెళ్లి సంపాదించి తిరిగి మాతృస్థలానికి వచ్చి సేవలు చేయాలి. కన్నతల్లి, జన్మభూమిని మరవరాదు. భారతదేశం విజ్ఞాన గని. నేటి యువతకు ఎన్నో ఆధునిక అవకాశాలు అందుబాటులో ఉన్నందున వాటిని అందిపుచ్చుకుని దేశాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టించాలి' అని వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ట్రం విడిపోవడంతో వైద్యరంగంలో మనం తీవ్రంగా నష్టపోయామని, దానిని పూడ్చుకునేందుకు ఆరోగ్య రాజధానిని నిర్మిస్తున్నామని రాష్ట్ర వైద్య మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. -
పోలీసుల అదుపులో మాయలేడి!
మంగళగిరి: చినకాకానిలోని ఎన్నారై మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ సీట్లు ఇప్పిస్తానని రూ.1.50 కోట్లతో ఉడాయించిన మాయలేడి శ్రీదేవిని రూరల్ పోలీసులు పట్టుకున్నారు. ఆమె చేతిలో మోసపోయిన గుంటూరుకు చెందిన బాధితులు ఇటీవల మంగళగిరి రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం విదితమే. కేసు విచారణ చేపట్టిన రూరల్ పోలీసులు హైదరాబాద్‌లోని ఓ హోటల్లో శ్రీదేవితోపాటు ఆమె కుమారుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆమె భర్త ఆచార్యులును కూడా విచారిస్తున్నట్లు సమాచారం. మాయలేడి భర్త వ్యవసాయశాఖలో విధులు నిర్వర్తిస్తుండగా.. ఏడు సంవత్సరాల క్రితం మనస్పర్థలు వచ్చి ఇద్దరూ విడిపోయారు. అయితే కుమారుడికి వివాహం చేసేందుకు ఆరు నెలలుగా ఇద్దరూ కలిసి ఉంటున్నారని తెలిసింది. అంతకుముందే జల్సాలకు అలవాటుపడిన శ్రీదేవి గుంటూరు పట్టాభిపురంలో హోంగార్డు ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలు నొక్కేసినట్లు సమాచారం. ప్రకాశం జిల్లాలో, విజయవాడలో సైతం ఇదేవిధంగా మోసాలకు పాల్పడి డబ్బు సంపాదించి కుమార్తెను ఆస్ట్రేలియాకు పంపి కుమారుడిని ఎంబీఏ చదివించినట్లు తెలుస్తోంది. గుంటూరుతో పాటు కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఆమెపై పలు చీటింగ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులతో ఫొటోలు దిగి వారితో తనకు సత్సంబంధాలు వున్నాయని, సినిమా అవకాశాలు కల్పిస్తానని యువతులను, ఉద్యోగాలు ఇప్పిస్తానని పలువురు యువకులను మోసగించినట్లు సమాచారం. శ్రీదేవిని అదుపులోకి తీసుకున్న మంగళగిరి రూరల్ పోలీసులు ఆమె వద్ద రూ.25 లక్షల నగదు, రూ. 25లక్షల విలువైన బంగారం స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. -
సెలవులకు ఇంటికెళ్లి అదృశ్యమైన మెడికో


