breaking news
nine days celebrations
-
గణపతి నవరాత్రులు ఎందుకు?
గణపతి నవరాత్రి ఉత్సవాల పేరుతో తొమ్మిది రోజులు పూజ చేయడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజులు యథావిధిగా వ్రతం చేసే ఆచారం ఇప్పటికీ చాలాప్రాంతాల్లో ఉంది. ఇలా గణపతి నవరాత్రులు, ఉత్సవాలు జరుపుకోవడం వెనక స్వాతంత్య్ర సమర యోధులు బాలగంగాధర తిలక్ మహోన్నత ఆశయమే కారణం. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ప్రజలను చైతన్యవంతం చేయడానికి, అగ్ర, నిమ్న అనే వర్ణ భేదాలు లేకుండా హిందువులనందరినీ ఒకే వేదికపైకి తెచ్చి ఏకం చేయడానికి లోకమాన్య బాల గంగాధర తిలక్ సార్వజనిక అంటే వీధి గణేశ ఉత్సవాలకు నాంది పలికారు. ఫలితంగా శాస్త్రప్రకారం భాద్రపద శుద్ధ చవితినాడు ఏకదిన వ్రత విధానం మాత్రమే ప్రధానంగా ఉన్నప్పటికీ, సమాజంలో ఐకమత్యం, జాతీయ భావం పెంపొందించడానికే ఈ నవరాత్రి ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. నాటినుంచి అది కొనసాగుతోంది, అది సంతోషకరమే. అయితే అనవసర పోటీ తత్వాలు, మితిమీరిన ఆడంబరాలు వీడి అందరూ కలసి మెలసి ఐక్యంగా ఈ పండుగను నిర్వహించుకున్నప్పుడే లోకమాన్యుడి ఆశయం నెరవేరినట్టు. – గోగులపాటి కృష్ణమోహన్, సీనియర్ పాత్రికేయులువ్యవస్థాపకులు, నా టీవీ అండ్ నా ఫౌండేషన్ -
మార్చి 7 నుంచి సాగరమాత ఉత్సవాలు
గుంటూరు: సాగరమాత ఉత్సవాలు మార్చి 7 నుంచి 9 తేదీ వరకు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా జరిగే నవదిన జపములు శనివారం ప్రారంభం కానున్నట్లు తెలిసింది. ప్రతి ఏడాది జరిగే ఈ సాగరమాత ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. గుంటూరు జిల్లా మాచర్ల మండలం విజయపురిసౌత్లో ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఉత్సవాలకు గుంటూరు బిషప్ పాల్గొంటారు. (మాచర్ల)


