breaking news
new electoral rolls
-
మున్సిపల్ పోరు: మీ పేరు ఉందా..?
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీల్లో ఓటర్ల ముసాయిదా, కుల గణన ముసాయిదా జాబితాను ప్రకటించారు. వెంటనే జాబితాలో మీ పేరు ఉందా లేదా చూసుకోండి.. శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేశాం కదా.. ఎక్కడికి పోతుందిలే అని అనుకోవద్దు.. ఇప్పటికే అనేక సార్లు ఓటరు సర్వే చేశారు. మీ పేరు తొలగించి ఉండవచ్చు. మున్సిపల్ ఎన్నికల్లో మీరు ఓటు వేయాలంటే మీకు ఓటు ఉందో లేదో ఒకసారి సరిచూసుకోండి.. వీటితో పాటు కొత్త వారికి ఓటు నమోదుకు కొంత సమయం ఉంది. వెంటనే నమోదు చేసుకోవడానికి ప్రయత్నాలు చేయండి. కొత్తగా ఓటర్ నమోదు చేసుకోవాలంటే ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండితే చాలు. ఓటు నమోదు చేసుకుని ఈనెల 22న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేసే అవకాశాన్ని పొందవచ్చు. జనవరి 7 వరకు.. కొత్తగా ఓటు నమోదు చేసుకునే వారు ఈనెల 7న ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు నమోదు చేసుకుకే అవకాశం ఉంది. www. nvcp.in, www.ceotelangana.nic.in అనే వెబ్సైట్లోకి వెళ్లి ఓటర్‌గా నమోదు చేసుకోచ్చు. దీనికి గాను ఫారం నంబర్–6ను పూరించి అప్లోడ్ చేయాలి. గత నెల 30వ తేదీన మున్సిపాలిటీల్లో ఓటర్ ముసాయిదా జాబితాను ప్రదర్శించారు. వీటికి గత నెల 31 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరిస్తారు. ఈ నెల 3వ తేదీన అభ్యంతరాలకు సమాధానాలు, వివరణ ఇస్తారు. 4న తుది జాబితా ప్రకటించి, 7న నోటిఫికేషన్ జారీ చేస్తారు. ఈలోపు ఓటర్‌గా నమోదు చేసుకోవడం మన ఓటు గల్లంతు అయితే వెంటనే మున్సిపల్ కమిషనర్‌కు దరఖాస్తు చేసుకుంటనే వాటిని సరి చేస్తారు. గత ఓటర్ల జాబితా ప్రకటన సందర్భంగా పెద్ద ఎత్తున ఓట్లు గల్లంతయ్యాయని అరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్లు ఒక డివిజన్లో ఉండి మీ ఓటు మరో డివిజన్లో ఉన్నా వెంటనే తమ దృష్టికి తీసుకుని వస్తే సరిచేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. 2014వ ఎన్నికల సమయంలో 2,28,872 మంది ఓటర్లు ఉండగా 2019 ఎన్నికలు వచ్చే సరికి 2,72,194 మందికి పెరిగిపోయారు. గడిచిని 5 ఏళ్లలో 43,322 మంది ఓటర్లు కొత్తగా పెరిగారు. పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు 20,825 ఓటర్లు పెరిగారు. డివిజన్ల పునర్వీభజన ప్రకటించిన నాటి నుంచి 14,408 మంది ఓటర్లు పెరిగినట్లు గణనాంకాలు చెబుతున్నాయి. ఎన్నికల నాటికి మరికొంత మంది ఓటర్లు పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్ కేంద్రాలు మారినా.. సరాసరి ఒక పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లు వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు. బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తుండడంతో ఇప్పటికే కరీంనగర్‌కు 1050, హుజూరాబాద్‌కు 150, జమ్మికుంటకు 150, చొప్పదండికి 66, కొత్తపల్లికి 44 బ్యాలెట్ బాక్స్‌లు చేరుకున్నాయి. పోలింగ్ కేంద్రాల ముసాయిదాను 4న ప్రకటిస్తారు. 5 నుంచి 8వ తేదీ వరకు అభ్యంతరాలు, సూచనలను స్వీకరిస్తారు. అభ్యంతరాలను 9న ప్రకటించి మరునాడు పోలింగ్ కేంద్రాలకు కలెక్టర్‌కు నివేదిక సమర్పిస్తారు. తుది పోలింగ్ కేంద్రాల జాబితాను 13న ప్రకటిస్తారు. 22న ఎన్నికలు నిర్వహించి 25న ఫలితాలు ప్రకటిస్తారు. -
సు‘బాస్’ నగర్!
80,098 ఓటర్లతో సుభాష్ నగర్ టాప్ చివరి స్థానంలో దత్తాత్రేయ నగర్ కొత్త ఓటర్ల జాబితాపై సర్వత్రా ఆసక్తి సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ కొత్త ఓటర్ల జాబితా ఆసక్తి రేకెత్తిస్తోంది. నూతనంగా ఏర్పాటైన కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాష్‌నగర్ ఓటర్ల పరంగా గ్రేటర్‌లోని 150 డివిజన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ డివిజన్లో అత్యధికంగా 80,098 మంది ఓటర్లు ఉన్నారు. గోషామహల్ నియోజకవర్గంలోని దత్తాత్రేయ నగర్ డివిజన్ కేవలం 29,959 మంది ఓటర్లతో చివరి స్థానంలో ఉంది. ఆ లెక్కన సుభాష్‌నగర్ డివిజన్లో గెలవడమంటే.. దత్తాత్రేయనగర్ వంటి మూడు వార్డుల్లో విజయంతో సమానం. మహిళా ఓటర్లూ ఇక్కడే ఎక్కువ. మొత్తం 34,152 మంది మహిళలు ఉన్నారు. దత్తాత్రేయ నగర్ డివిజన్లోని మొత్తం ఓటర్ల కంటే ఇక్కడి మహిళలే ఎక్కువ. ఆ తరువాత హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. నాగోల్, ఘాన్సీబజార్ డివిజన్లలో ఎక్కువగా 21 మంది వంతున థర్డ్‌జెండర్ ఓటర్లు ఉన్నారు. సుభాష్‌నగర్ తర్వాతి స్థానాల్లో మైలార్‌దేవ్‌పల్లి(70,749 ఓటర్లు), హఫీజ్‌పేట (67,540), కొండాపూర్ (66, 246 ఓటర్లు), కుత్బుల్లాపూర్ (62788 ఓటర్లు) ఉన్నాయి. 7 డివిజన్లలో 60 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. 55 డివిజన్లలో 50 వేలకు పైగా ఓటర్లు ఉన్నారు. వీటిలో 21 డివిజన్లలో 55 వేలకు పైగా ఉన్నారు. దత్తాత్రేయనగర్‌లో అతి తక్కువగా... అతి తక్కువగా దత్తాత్రేయ నగర్లో 29,959 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో మెహదీపట్నం (31,114), రామ్‌గోపాల్‌పేట (31,738), నవాబ్‌సాహెబ్‌కుంట (31,867), శాస్త్రిపురం(32,023), ఆర్సీపురం(32,513), పురానాపూల్ (33,537), టోలిచౌకి(33, 891), సులేమాన్ నగర్(33,998), బార్కా స్ (34,065), మెట్టుగూడ (34,236), దూద్‌బౌలి(34,565), భారతినగర్ (34,768), మొఘల్‌పురా (34,773)లు ఉన్నాయి. 40 వేల లోపు ఓటర్లు గలవి డివిజన్లు మొత్తం 29 ఉన్నాయి. మహిళలు ఎక్కువగా... సుభాష్‌నగర్‌లో మహిళా ఓటర్లు అత్యధికంగా 34,152 మంది ఉన్నారు. ఆ తర్వాత హఫీజ్‌పేటలో 30,528 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు 25 వేలకు పైగా ఉన్న డివిజన్లు మొత్తం 26 ఉన్నాయి. అవి.. సరూర్‌నగర్ (28,474), ఆర్కేపురం(27,716), సైదాబాద్ (27,638), మూసారాంబాగ్ (25,367), ఐఎస్‌సదన్ (25,398), మైలార్‌దేవ్‌పల్లి (29,830), జాంబాగ్(26.878), గన్‌ఫౌండ్రి(25116), అంబర్‌పేట (25318), బాగ్‌అంబర్‌పేట (25504), రామ్‌నగర్ (26126), ఖైరతాబాద్ (25614), కొండాపూర్ (28252),బాలాజీనగర్ (26828), అల్లాపూర్ (25193), కుత్బుల్లాపూర్(27032), నేరేడ్మెట్ (25999), మౌలాలి (26913), ఈస్ట్ఆనంద్బాగ్(25279), మల్కాజిగిరి (26847), గౌతమ్ నగర్ (27898), తార్నాక (27973), బన్సీలాల్‌పేట(25016), మోండామార్కెట్(25592), మహిళా ఓటర్లు తక్కువగా ఉన్న డివిజన్లలో దత్తాత్రేయనగర్ (14012), రామ్‌గోపాల్‌పేట (14433 ), మెహదీపట్నం(14814)ఉన్నాయి. అయినా అంతే.. వార్డుల మధ్య పదిశాతం వ్యత్యాసంతో ఒక్కో వార్డు జనాభా (2011 లెక్కల మేరకు) దాదాపు 40 వేల నుంచి 47 వేల వరకు ఉండేలా డీలిమిటేషన్‌ను పూర్తి చేసి న సంగతి తెలిసిందే. తాజా లెక్కల మేరకు ఓటర్లు కొన్ని డివిజన్లలో 65 వేలకు దాట గా, కొన్ని డివిజన్లలో 40వేల లోపు ఉన్నా రు. అభివృద్ధి పనుల్లో వ్యత్యాసం లేకుండా ఉండేందుకని డీలిమిటేషన్ చేసినప్పటికీ, పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లయింది. అప్పుడు.. ఇప్పుడు 2009 ఎన్నికలకు, ఇప్పటికీ డివిజన్ల ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసాలు చోటు చేసుకున్నాయి. అప్పట్లో దాదాపు 20 వేల ఓటర్లున్న డివిజన్లలో ప్రస్తుతం 40వేలకు పెరగ్గా... అప్పట్లో 70 వేలకు పైగా ఓటర్లు ఉన్న డివిజన్లలో ప్రస్తుతం 51 వేలకు తగ్గారు.