breaking news
nephew kills uncle
-
బాబాయిపై అబ్బాయి బండరాయితో దాడి!
సాక్షి, మైలవరం: కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. బంధాలు భారమవుతున్నాయి..క్షణికావేశంలో బంధాలు తెంచుకుంటున్నారు.. చిన్నచిన్న విషయంలో పట్టింపులకు పోతున్నారు. ప్రాణాలు తీసుకునేందుకు వెనకడం లేదు.అన్నపై దాడి చేస్తున్నాడని ప్రశ్నించిన పాపానికి బాబాయిని అన్న కొడుకు కొట్టిచంపిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది. తండ్రీకొడుకులు గొడవ పడుతున్న నేపథ్యంలో అడ్డుగా వెళ్లిన వ్యక్తికి తీవ్ర గాయాలై మృతి చెందిన ఘటన చెర్వుమాధవరం గ్రామంలో బుధవారం తెల్ల్లవారుజామున చోటుచేసుకొంది. ఎస్ఐ రాంబాబు అందించిన వివరాలు... జి.కొండూరు మండల పరిధిలోని చెర్వుమాధవరం గ్రామానికి చెందిన ఓర్సు బాబు, కొడుకు నాగరాజుకి జీవనోపాధి కోసం ఆటో కొని ఇచ్చాడు. అయితే మద్యానికి బానిసైన నాగరాజు ఆటోని సక్రమంగా నడపకుండా అప్పులు చేస్తుండడంతో తండ్రి మందలించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నాగరాజు తండ్రిని కొట్టాడు. ఇది గమనించి బాబు తమ్ముడు ఓర్సు నరసింహారావు(37) అడ్డుగా వెళ్లాడు. దీంతో కోపోద్రిక్తుడైన నాగరాజు బండరాయి తీసుకొని బాబాయి నరసింహారావు తలపై మోదాడు. తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అవుతుండడంతో కుటుంబ సభ్యులు మైలవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో మృతి చెందాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. సీఐ శ్రీను, ఎస్ఐ రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మేనత్తను వేధిస్తున్నాడని మామను చంపిన అల్లుడు
మేనత్తను వేధిస్తున్నాడని ఆమె భర్తను మేనల్లుడు దుడ్డుకర్రతో కొట్టి చంపాడు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. జియాగూడ ఇందిరానగర్ నివాసి నర్సింహ (22) కూలీ. ఇతని మేనత్త అనూరాధను బంజారాహిల్స్‌కు చెందిన హన్మంతు (28)కు ఇచ్చి నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిపించారు. కూలీ అయిన హన్మంతు నిత్యం తాగి వచ్చి అనూరాధను హింసించేవాడు. దీంతో ఆమె పుట్టింటికి వచ్చి ఉండేది. కొద్ది రోజులకు హన్మంతు వచ్చి సర్దిచెప్పి తన వెంట తీసుకెళ్లేవాడు. నాలుగు రోజుల క్రితం భర్త తాగి వచ్చి కొట్టడంతో అనూనురాధ మళ్లీ పుట్టింటికి వచ్చేసింది. మంగళవారం మధ్యాహ్నం హన్మంతు భార్యను తీసుకెళ్లేందుకు జియాగూడకు రావడంతో గొడవ జరిగింది. ఆ తర్వాత నర్సింహ, హన్మంతు కలిసి బయటకు వెళ్లి.. మద్యం తాగి ఇంటికి చేరుకున్నారు. అనూరాధ, హన్మంతుల మధ్య మళ్లీ గొడవ జరిగింది. అక్కడే ఉన్న నర్సింహ తీవ్ర ఆగ్రహానికి గురై.. పక్కనే ఉన్న దుడ్డు కర్రతో హన్మంతు తలపై కొట్టాడు. తీవ్ర రక్తస్రావమై కుప్పకూలిన హన్మంతును పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం హన్మంతు మృతి చెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.