breaking news
naveen jindaal
-
Global Investors Summit: ఏపీలో జిందాల్ స్టీల్ భారీ పెట్టుబడులు
సాక్షి, విశాఖపట్నం: విశాఖలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరుగుతోంది. ఈ సందర్బంగా ఏపీలో పెట్టుబడులపై వివిధ కంపెనీలు తన పెట్టుబడులను ప్రకటించారు. జిందాల్ కంపెనీ రానున్న రోజుల్లో భారీ పెట్టుబడులు పెడుతున్నట్టు పేర్కొంది. జిందాల్ స్టీల్ అండ్ పవర్ చైర్మన్ నవీన్ జిందాల్ మాట్లాడుతూ.. ఏపీ ప్రగతిలో భాగమవుతున్నందుకు సంతోషంగా ఉంది. ఏపీలో మౌలిక వసతులు అద్భుతంగా ఉన్నాయి. ఏపీలో పారిశ్రామిక అనుకూల వాతావరణం భేష్. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. 10వేల కోట్ల పెట్టుబడులతో 10వేల మందికిపైగా ఉపాధి కల్పించబోతున్నట్టు తెలిపారు. ఆర్థిక వృద్ధిలో ఏపీ నంబర్ వన్‌గా ఉందన్నారు. జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ జీఎం రావు మాట్లాడుతూ.. ఏపీలో ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ ఎకో సిస్టమ్ ఉంది. సీఎం వైఎస్ జగన్ దార్శనికత ప్రశంసనీయం. సీఎం జగన్ విజన్ అద్భుతం. ఏపీలో కనెక్టివిటీ బాగా పెరిగింది. ఏపీ ప్రగతిలో భాగమైనందుకు సంతోషంగా ఉంది. ఎయిర్ కనెక్టివిటీ పెరుగుతుండటంతో ఏపీకి మరిన్ని పరిశ్రమలు వస్తున్నాయి. రాష్ట్ర జీడీపీ సుస్థిరంగా ఉండటం ప్రశంసనీయం అని అన్నారు. సియాంట్ చైర్మన్ బీవీ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. విశాఖలో మా కంపెనీలకు మరింత విస్తరిస్తాం. ఐటీ రంగంలో ఏపీ నిపుణుల పాత్ర ఆదర్శనీయం. విద్యారంగంలో ఏపీ కృషి అమోఘం. పలు రంగాల్లో సాంకేతిక పాత్ర వేగంగా జరుగుతోంది. అమ్మ ఒడి, విద్యా కానుక, విద్యా దీవెన, విదేశీ విద్యాదీవెన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి జరుగుతోందన్నారు. భారత్ బయోటెక్ ఛైర్మన్ కృష్ణ ఎల్లా మాట్లాడుతూ.. ప్రపంచాలనికి ఉత్తమమైన మానవ వనరులను ఏపీ అందిస్తోందన్నారు. నైపుణ్యానికి ఏపీ చేస్తున్న కృషి అభినందనీయం. ఏపీలో వనరులు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సమర్థవంతంగా వాడుకుంటే ఏపీలో మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. -
జిందాల్ పాస్ పోర్టు ఎందుకు స్వాధీనం చేసుకోలేదు
న్యూఢిల్లీ: బొగ్గు కుంభకోణం కేసులో సీబీఐ తీరుపట్ల స్పెషల్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అభియోగాలు ఎదుర్కొంటున్న నవీన్ జిందాల్ పాస్ పోర్ట్‌ను ఎందుకు స్వాధీనం చేసుకోలేదని ప్రశ్నించింది. బొగ్గు కుంభకోణంపై గురువారం విచారణ సందర్భంగా ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, విచారణ జరుగుతున్నందున పాస్ పోర్టును సీజ్ చేయకూడదని నిర్ణయించుకున్నామని కోర్టుకు సీబీఐ తెలిపింది. దీంతో పాస్ పోర్టులను స్వాధీనం చేసుకొనే విషయంలో ఒక్కొక్కరికి ఒక్కో విధానం అనుసరించకూడదని సీబీఐకి కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో అందరికీ ఒకే సూత్రం వర్తించేలా విధానాన్ని రూపొందించాలని సీబీఐ డైరెక్టర్‌కు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసింది. బొగ్గు కుంభకోణంపై మే 6న అభియోగ పత్రాన్ని పరిగణనలోకి తీసుకుంటామని ప్రత్యేక కోర్టు ఈ సందర్భంగా తెలియజేసింది. దీంతో జిందాల్‌తో సహా 14మందిపై దాఖలైన ఛార్జ్షీటుపై మే 6న కోర్టు వాదనలు విననుంది.