breaking news
Narasaimhan
-
నేడు గవర్నర్ ఢిల్లీ టూర్
-
ఢిల్లీ వెళ్లిన గవర్నర్ నరసింహన్
హైదరాబాద్ : రాష్ట్ర గవర్నర్ నరసింహన్ ఒకరోజు పర్యటన నిమిత్తం సోమవారం ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఆయన ఇవాళ పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు. అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో గవర్నర్ భేటీ అవుతారు. రెండు రాష్ట్రాల సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నర్ను కలిసిన కొద్దిరోజులకే నరసింహన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. నరసింహన్ మంగళవారం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.