breaking news
Mumbai-Ahmedabad Bullet train
-
ఇండియా బుల్లెట్ రైలు: రెడీ అవుతున్న స్టేషన్లు చూస్తారా?
దేశంలో బుల్లెట్ రైలు పరుగులకు ఏర్పాట్లు చకాచకా సాగుతున్నాయి. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రారంభానికి ఇంక ఒక్క అడుగు దూరంలోనే ఉందని, స్టేషన్లు దాదాపు పూర్తయ్యే దశలో ఉన్నాయని పేర్కొంటూ భారతీయ రైల్వే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో వాటి ఫొటోలను షేర్ చేసింది.ముంబై-అహ్మదాబాద్ కారిడార్‌కు సంబంధించి గుజరాత్‌లోని బుల్లెట్ ట్రైన్ స్టేషన్లు దాదాపు పూర్తయ్యాయని ‘ఎక్స్’లో ఇండియన్ రైల్వేస్ పోస్ట్ చేసింది. ఆధునిక డిజైన్, సాంస్కృతిక గుర్తింపు, అంతరాయం లేని కనెక్టివిటీ, పర్యావరణ అనుకూల లక్షణాలతో, స్టేషన్లు ప్రయాణికుల సౌకర్యాన్ని పునర్నిర్వచిస్తాయని, ప్రయాణంలో కొత్త బెంచ్‌మార్క్‌లను సెట్ చేస్తాయని పేర్కొంది.ఎన్ని స్టేషన్లు, ఎక్కడెక్కడ?ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్‌లో మొత్తం 12 స్టేషన్లు ఉన్నాయి. అవి ముంబై (బాంద్రా-కుర్లా కాంప్లెక్స్), థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్, సబర్మతి.వీటిలో నాలుగు స్టేషన్లు మహారాష్ట్ర (ముంబై, థానే, విరార్, బోయిసర్), ఎనిమిది గుజరాత్ (సబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, భరూచ్, సూరత్, బిలిమోరా, వాపి)లో ఉన్నాయి.ఈ ప్రాజెక్టు మొత్తం పొడవు 508 కిలోమీటర్లు. ఇందులో గుజరాత్ లో 348 కిలోమీటర్లు, మహారాష్ట్రలో 156 కిలోమీటర్లు, కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ గుండా 4 కిలోమీటర్లు వెళుతుంది.బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు వివరాలుబుల్లెట్ రైలు గరిష్ట ఆపరేటింగ్ వేగం గంటకు 320 కిలోమీటర్లు, మొత్తం ప్రయాణానికి 2 గంటల 7 నిమిషాలు పడుతుందని భావిస్తున్నారు. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో జపనీస్ షింకన్ సేన్ ట్రాక్ సిస్టమ్ ఆధారంగా జె-స్లాబ్ ట్రాక్ సిస్టమ్ ఉంటుంది. ప్రాంతాల వారీగా చూస్తే, కారిడార్‌లో ఏడు పర్వత సొరంగాలు (మహారాష్ట్రలో ఆరు, గుజరాత్లో ఒకటి), 24 నదీ వంతెనలు (20 గుజరాత్లో, నాలుగు మహారాష్ట్రలో ఉన్నాయి) ఉన్నాయి. The #BulletTrain stations on the Mumbai–Ahmedabad corridor in Gujarat are nearing completion. With modern design, cultural identity, seamless connectivity and eco-friendly features, the stations will redefine passenger comfort and set new benchmarks in travel. pic.twitter.com/2olttW6Mnb— Ministry of Railways (@RailMinIndia) August 28, 2025 -
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో మరో కీలక అడుగు
ముంబై- అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ సంస్థ(ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్) గుజరాత్‌లోని నవ్సారి సిటీలో అక్టోబర్ 2న బుల్లెట్ ట్రైన్ తొలి క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి ఢిల్లీ మధ్య మొత్తం 508 కిలోమీటర్ల నిడివితో పూర్తిగా వయడక్టు పద్దతిలో బుల్లెట్ ట్రైన్ ట్రాక్ నిర్మాణం శరవేగంగా సాగుతుంది. ఈ నిర్మాణ పనుల్ని ఎన్హెచ్ఎస్ఆర్సీఎల్ పర్యవేక్షిస్తుంది. తాజాగా ఈ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్‌లో భాగంగా 11.90 నుంచి 12.4 మీటర్ల పొడవు, 2.1 నుంచి 2.5 మీటర్ల వెడల్పు, 3.40 మీటర్ల లోతు, 60 వేల కిలోల బరువైన క్యాస్టింగ్ యార్డ్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఈ తరహాలో మొత్తం 19(సెగ్మెంట్స్) క్యాస్టింగ్ యార్డ్‌లను తయారు చేయాల్సి ఉంటుంది The first segment for Mumbai- Ahmedabad HSR corridor was casted yesterday at a casting yard near Navsari. These segments are 11.90 to 12.4m in length 2.1 to 2.5 m in width having depth of 3.40 m & weighing approx. 60 MT, 19 such segments will make a span of 45m. https://t.co/yP9nNw46i2 — NHSRCL (@nhsrcl) October 1, 2021 19 సెగ్మెంట్స్ ఎందుకు బుల్లెట్ ట్రైన్‌కు సంబంధించి నిర్మాణాల్ని చేపట్టలేని పిల్లర్స్, ట్రాకులు,బ్రిడ్జ్‌లను మరో ప్రాంతంలో విడివిడిగా నిర్మిస్తారు. అనంతరం పెద్ద పెద్ద పొక్లెయిన్ల సాయంతో తరలించి అవసరమైన ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు. అలా ఈ బుల్లెట్ ట్రైన్ నిర్మాణాల్ని సెగ్మెంట్స్‌గా విభజించి నిర్మిస్తున్నారు. చదవండి: బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టులో మరో రికార్డు.. ప్రపంచ దేశాల సరసన భారత్! -
ముంబై–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ఇదే
న్యూఢిల్లీ: ముంబై–అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్టు(ఎంఏహెచ్ఎస్ఆర్)లో భాగంగా నడిపే బుల్లెట్ రైలు చిత్రాన్ని జపాన్ రాయబార కార్యాలయం మొదటిసారిగా శనివారం విడుదల చేసింది. ముంబై–అహ్మదాబాద్ మధ్య నడవనున్న ఈ5 సిరీస్ షింకాన్సెన్ రైలింజన్‌కు కొన్ని మార్పులు చేయనున్నట్లు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది. ముంబై, అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల పొడవైన ఈ ప్రాజెక్టు 2023 కల్లా పూర్తి చేయాల్సి ఉంది. సుమారు రూ.1,08,000 కోట్ల ఈ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వం సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తుంది. -
హై స్పీడ్ ట్రైన్...అదిరే ఫీచర్స్
ముంబై : భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టబోతున్న ప్రాజేక్టుల్లో బుల్లెట్ ట్రైన్ ఒకటి. జపాన్ సహకారంతో ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య రూపొందనున్న ఈ ప్రాజెక్ట్‌లో ఎన్నో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ వారి అధ్వర్యంలో బంద్రా కుర్ల కాంప్లెక్స్ (బీకేసీ) నుంచి నవంబర్‌లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్టు కోసం 108 గ్రామాలలోని 10వేల మంది నుంచి భూమిని సేకరించారు. ముంబాయి-అహ్మదాబాద్‌ల మధ్య 508 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1,10,000 కోట్లు కాగా ఆ మొత్తంలో 88వేల కోట్లను 0.1శాతం వడ్డీతో జపాన్ నుంచి అప్పుగా తీసుకోనున్నారు. ఈ మొత్తాన్ని 50 సంవత్సరాలలోపు చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇంత భారీ వ్యయంతో చేపడుతున్న ఈ బుల్లెట్ ట్రైన్లో సదుపాయాలు కూడా ఆ విధంగానే ఉండబోతున్నాయని రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైళ్లలోకంటే అత్యాధునిక సాంకేతికతను బుల్లేట్ రైలులో వినియోగించనున్నారు. తిరిగే కుర్చీలు, కాఫీ మేకర్స్‌తో పాటు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను కూడా ఏర్పాటు చేయనున్నారు. మొత్తం 508 కి.మీ మార్గంలో 468 కి.మీ ఎత్తైన ట్రాక్ మార్గం, 27కి.మీ సొరంగ మార్గం, 13కి.మీ మైదాన ప్రాంతంలో నిర్మించనున్నారు. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ రైలు దేశంలోనే పెద్దదైన సొరంగం గుండా 21కి.మీ దూరం ప్రయాణిస్తుంది. మరో 7కిలోమీటర్లు సముద్రం గుండా ప్రయాణిస్తుంది. ప్రస్తుతం ముంబై, అహ్మదాబాద్‌లను కలుపుకుని 12 స్టేషన్లను ప్రతిపాదించారు. జపాన్ టెక్నాలజీతో నిర్మితం కానున్న ఈ బుల్లెట్ ట్రైన్ గంటకు 300కిమీ వేగంతో ప్రయాణించిప్పటికి కుదుపులు ఉండవని, నిలబడి కూడా హాయిగా ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఈ బుల్లెట్ ట్రైన్లో 10కార్లు (కోచ్‌లు) ఉంటాయని తెలిపారు. 2033 వరకూ మరో 6కార్లను అదనంగా వీటికి జత చేయనున్నారు. ప్రసుతం ఉన్న కార్లలో 750 సీట్లు ఉంటాయని, భవిష్యత్తులో వీటి సంఖ్యను 1250కి పెంచనున్నట్లు తెలిపారు. ప్రయాణ చార్జీలు బీకేసీ నుంచి థానే వరకూ రూ.250గా, బీకేసీ నుంచి విరార్ వరకూ రూ.500గా, బీకేసీ నుంచి బోయిసర్ వరకూ రూ.750గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉండబోయే 10కార్లలో ఒకటి బిజినెస్ క్లాస్ కాగా మిగితావి జనరల్ కంపార్ట్మెంట్స్. ముంబాయి - అహ్మదాబాద్ మధ్య ప్రతిరోజు 40వేల మంది బుల్లెట్ ట్రైన్లో ప్రయాణించవచ్చని అంచనా. బుల్లెట్ ట్రైన్‌ను చేరుకునేందుకు 14వేల మంది తమ సొంత వాహనాలను, 6500మంది విమానం ద్వారా, మిగితావారు ఇతర రైలు మార్గాల ద్వారా చేరుకోనున్నట్లు భావిస్తున్నారు. ఈ హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు 2023 వరకూ పూర్తి కానున్నట్లు అధికారులు తెలపగా, రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ మాత్రం 2022, ఆగస్ట్ 15నాటికి పూర్తి చేస్తానని ప్రకటించారు. -
'మోదీ ఉద్దేశం ఏమిటో అర్థం కావట్లే..'
ముంబయి : ఓ పక్క నేషనల్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్ బీజేపీతో పొత్తు పెట్టుకోనున్నారని తీవ్ర ఊహాగానాలు రేకెత్తుతుండగా వాటిని ఆయన పటాపంచలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. మోదీ అనుసరిస్తున్న విధానాల వల్ల భారత వృద్ధి రేటు నెమ్మదించిందని అన్నారు. కశ్మీర్ పాలసీతోపాటు, బుల్లెట్ రైలు ప్రాజెక్టును కూడా విమర్శించారు. బుల్లెట్ రైలు అనేది ఆచరణ సాధ్యంకాదని అన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పొందే ప్రయోజనాలు, ఇరు రాష్ట్రాల మధ్య కేటాయింపుల్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్పారు. 'మహారాష్ట్రకు కేవలం నాలుగు స్టేషన్లు మాత్రమే ఇచ్చారు. కానీ, ఎక్కువ స్టేషన్లు గుజరాత్‌కు ఉన్నాయి. అసలు బుల్లెట్ రైలు వెనుక ఉద్దేశం ఏమిటో నాకు ఇప్పటి వరకు తెలియడం లేదు. వాస్తవానికి బుల్లెట్ రైలు కావాల్సింది ఒక ముంబయికి ఢిల్లీకి మధ్య. లేదంటే ఢిల్లీకి కోల్‌కతాకు మధ్య లేదా ముంబయి చెన్నై మధ్య. ముంబయి అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ఆచరణ సాధ్యం కాదు. అయితే, గుజరాత్‌కు వచ్చే ప్రయోజనాలు తాను కాదనబోనని, అయితే, మహారాష్ట్రకు జరిగే నష్టం గురించే తాను ఎత్తి చూపాలని అనుకుంటున్నానని తెలిపారు. -
‘బుల్లెట్ రైలు’పై కదలిక
న్యూఢిల్లీ: గంటకు 350 కి.మీ. వేగంతో నడిచే బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రైల్వే శాఖ ‘జాతీయ హైస్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్’ పేరుతో స్పెషల్ పర్పస్ వెహికల్ ఏర్పాటు చేసింది. ముంబై-అహ్మదాబాద్ మధ్య నడిచే ఈ ప్రాజెక్టుకు రూ.97,636 కోట్లు వ్యయమవుతుందని అంచనా.