breaking news
M.S.Dhoni
-
ఒక్క హిట్‌తో రెమ్యూనరేషన్ డబుల్!
టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ జీవితకథ ఆధారంగా తెరకెక్కించిన బాలీవుడ్ చిత్రం 'ఎంఎస్ ధోనీ: ద అన్‌టోల్డ్ స్టోరీ' బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఇప్పటికే 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించినట్టు నిర్మాతలు ప్రకటించారు. దీంతో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు, థియేటర్ల యజమానులకు లాభాలను తెచ్చిపెట్టింది. కథ కోసం నిర్మాతలు పెద్ద మొత్తంలో డబ్బును ధోనీకి చెల్లించినట్టు వార్తలు వచ్చాయి. ఇక ఈ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన హీరో సుషాంత్ సింగ్ రాజ్‌పుట్‌కు బాగా కలసి వచ్చింది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో సుషాంత్ తన రెమ్యూనరేషన్‌ను రెండింతలు పెంచాడట. సుషాంత్ కెరీర్లో ఇదే భారీ హిట్ చిత్రం. ఎంఎస్ ధోనీ సినిమాలో నటించిన తర్వాతే అతనికి మంచి గుర్తింపు వచ్చింది. ఈ సినిమా తర్వాత చేయబోయే ప్రాజెక్టులకు సుషాంత్ 3.5 నుంచి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కాగా సుషాంత్ నిర్ణయంపై కొందరు నిర్మాతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. ఎంఎస్ ధోనీకున్న క్రేజ్ వల్ల గాక, తన వల్లే ఈ సినిమా హిట్ అయిందని సుషాంత్ భావిస్తున్నాడని, ఇదే సమస్య అని ఓ నిర్మాత వ్యాఖ్యానించాడు. బయోపిక్ సినిమాల్లో బిగ్గెస్ట్ ఓపెనర్‌గా, ఈ ఏడాది విడుదలైన సినిమాల్లో సుల్తాన్ తర్వాత అత్యధిక వీకెండ్ కలెక్షన్లు సాధించిన రెండో చిత్రంగా ఎంఎస్ ధోనీ నిలిచింది. నీరజ్ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సుషాంత్ సింగ్ రాజ్పుట్ టైటిల్ రోల్లో నటించాడు. మొత్తమ్మీద ఈ సినిమా అందరికీ కలసివచ్చింది. -
రేపు ఉపాధ్యాయ దినోత్సవం
చెంప ఛెళ్లుమనిపించారు! నా మొదటి కోచ్ రమాకాంత్ అచ్రేకర్ గారు చాలా క్రమశిక్షణగల వ్యక్తి. ‘‘బాగా ఆడుతున్నావు’’ అని ఆయన ఎవరినైనా అనడం చాలా అరుదుగా జరిగేది. నన్ను మాత్రం అప్పుడప్పుడూ ‘హీరో’ అని పిలిచేవారు. ఒకేరోజు నాలుగైదు మ్యాచ్‌లు ఆడే అవకాశం కలిగించేవారు. తన స్కూటర్‌పై ముంబాయి నగరమంతా తిప్పేవారు. అలా అని గారాబం చేసేవారు కాదు. చెప్పిన మాట వినలేదని ఒకసారి నా చెంప ఛెళ్లుమనిపించారు కూడా! - సచిన్ టెండూల్కర్ గురూజీ... నల్లటి బోర్డ్ మీద మీరు రాసిన తెల్లటి అక్షరాలు ఇప్పటికీ వెన్నెల వెలుగులు పంచుతూ ఉన్నాయి. - డి. శంకర్, మచిలీపట్నం నువ్వు సాధించగలవు అన్నారు..! నటనలో నా గురువు బెరీ జాన్. ఢిల్లీలో అతడి థియేటర్ గ్రూప్‌లో పని చేస్తున్నప్పుడు ఆయన పంచిన ఆప్యాయతను ఎప్పటికీ మరవలేను. జాన్ గొప్ప గురువు మాత్రమే కాదు మానవతావాది కూడా. ఆయన నుంచి కేవలం నటనను మాత్రమే కాదు నడవడికను కూడా నేర్చుకున్నాను. ‘‘నేను సినిమాల్లో హీరోగా చేయాలనుకుంటున్నాను’’ అనగానే నా ఫ్రెండ్సందరూ ఎగతాళిగా నవ్వేవాళ్లు. జాన్ మాత్రం ‘‘నువ్వు అనుకున్నది సాధించగలవు’’ అని ధైర్యం ఇచ్చేవారు. - షారుక్ ఖాన్ గురువు అంటే మనతో స్నేహం చేసే దేవుడు! - పి.దేవి, రాయపర్తి అదనపు క్లాసులు తీసుకునేవారు... మా లెక్కల టీచర్ పేరు కె.డి. సింగ్. ఏడు నుంచి పది వరకు గణితం బోధించారు. నేను ఎప్పుడు చూసినా క్రికెట్ ఆడడం ఆయనకు నచ్చేది కాదు. ‘‘నీకు తిండి పెట్టేది క్రికెట్ కాదు... చదువు మాత్రమే’’ అనేవారు. కొన్నిసార్లు అయితే- ‘‘నువ్వు ఈ ఆటలో పడి చదవడం లేదు. పరీక్షల్లో కచ్చితంగా ఫెయిలవుతావు’’ అని తిట్టేవారు. అంతమాత్రాన... తిట్టడమే పనిగా పెట్టుకోలేదు. నా చదువు గురించి ఒకవైపు ఆందోళన పడుతూనే మరోవైపు రకరకాల సలహాలు ఇచ్చేవారు. నా కోసం ఎక్స్ట్రా క్లాసులు కూడా తీసుకునేవారు. కొంతకాలం క్రితం ఆయనను కలిసినప్పుడు- ‘‘నీకు తిండి పెట్టేది క్రికెట్ కాదు. చదువు’’ అనే మాటను గుర్తుకుతెచ్చుకొని నవ్వారు. ఆయనతో మాట్లాడుతున్నంతసేపూ నేను ఏడో తరగతిలో ఉన్నట్లుగానే అనిపించింది. - యం.యస్. ధోని ఒకరోజు- చెట్టు కింద మీరు పాఠం చెబుతున్నప్పుడు ఎప్పుడూ రాని వాన వచ్చింది! వానకు మీ పాఠం నచ్చి మాతో పాటు వింటూ కూర్చుంది!! - యస్. శశి, గుంటూరు